హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News: మీరు ట్రాఫిక్ పోలీస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..

Good News: మీరు ట్రాఫిక్ పోలీస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..

మీరు ట్రాఫిక్ పోలీస్ అవ్వాలనుకుంటున్నారా?

మీరు ట్రాఫిక్ పోలీస్ అవ్వాలనుకుంటున్నారా?

Good News: పోలీసుగా విధులు నిర్వహించాలి అనుకుంటున్నారు. అందులోనూ ట్రాఫిక్ ఫోలీసుగా రోడ్డుపై విధులు నిర్వహించడమంటే మీకు ఇష్టమా..? అలాంటి వారికి బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే.. మీ కోరిక నెరవేరుతుంది..

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

Good News: ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది.. అది అవ్వాలని.. ఇది అవ్వాలని కలలు కంటారు.. అయితే పెద్ద పెద్ద కలలు తీరడం కష్టమే కానీ.. చిన్న చిన్న కోరికలు అయితే తీర్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి పోలీస్ (Police) అవ్వాలని కోరుకుంటారు.. కాకపోతే అది అంత ఈజీ కాదు.. దానికి  అర్హత ఉండాలి.. పరీక్షలు పాసవ్వాలి.. ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి.. అందుకే  ఆ కోరిక నెరవేరాలి అంటే కఠోర శ్రమ అవసరం.. అలాగే పోలీసుల్లో ట్రాఫిక్ పోలీస్ (Traffic Police) గా విధులు నిర్వహించడం అంటే కొంతమందికి ఇష్టం.. అయితే అలా ఎవరైనా కోరుకుంటే.. వారి లక్ష్యం నెరవేరేందుకు పోలీసు శాఖ అవకాశం ఇస్తోంది.

సమాజంలో తమ వంతు సహాయం, బాధ్యతగా వ్యవహరించాలనుకునే యువకులకి మంచి సువర్ణ అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. పోలీస్ వ్యవస్థలో ప్రజలకు సేవలు చేస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా తమవంతు పాత్ర పోషిస్తాను అంటున్న యువకులకు విశాఖ పోలీస్ శాఖ మంచి సువార్త చెప్పింది.

కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాల్లో కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ వాలంటీర్లుగా స్వచ్ఛందంగా సేవలందించేందుకు ఆసక్తిగల యువకులకు, వ్యాపారులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, సంఘ సేవకులకు అవకాశం కల్పిస్తున్నామని కంచరపాలెం ట్రాఫిక్ సీఐ మల్ల అప్పారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చదవండి : పవన్ ను వైసీపీ టార్గెట్ చేసిందా..? మాటల దాడి పెరగడం వెనుక వ్యూహం ఇదే..?

ఈ మేరకు పోలీసులు వారితో కలిసి రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం, ప్రజలకు, విద్యార్ధులకు వాహన చోదకులకు ట్రాఫిక్ పై  అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమైన కూడళ్ళలో ట్రాఫిక్ పోలీస్ లతో ట్రాఫిక్ ని క్రమబద్ధీ కరించడం..  పండుగలు, ఉత్సవాలు లాంటి ముఖ్య మైన సమయాలలో  ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం లాంటి విధులను నిర్వహించాల్సి వస్తుందన్నారు.

ఇదీ చదవండి: రూటు మార్చిన గంటా.. లోకేష్ పాద యాత్రపై సంచలన వ్యాఖ్యలు

కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కంచరపాలెం, ధర్మానగర్, దుర్గానగర్, జ్ఞానాపురం, ఊర్వశి జంక్షన్, కప్పారాడ, మాధవధార, మురళీనగర్, ఐటిఐ జంక్షన్, మర్రిపాలెం, 104 ఏరియా, కూసా, భార్మానగర్, ఎన్ఏడీ జంక్షన్, బుచిరాజుపాలెం, విమాననగర్, |కాకానినగర్, ఎన్ ఎస్ టి . ఎల్ తదితర ప్రాంతాలలో నివసిస్తున్న వారు కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో గాని లేక కంచరపాలెం ట్రాఫిక్ సిఐ మళ్ళీ అప్పారావుని గాని ఫోన్ నెంబర్ 9440737 ద్వారా సంప్రదించాలని ప్రకటన విడుదల చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap jobs, AP News, Local News, Traffic police, Visakhapatnam

ఉత్తమ కథలు