Setti Jagadeesh, News 18, Visakhapatnam
ప్లాస్టిక్ (Plastic) వినియోగం పెరిగి సహజ సిద్ధంగా దొరికే అడ్డాకులతో తయారుచేసే విస్తరాకులకు డిమాండ్ తగ్గింది. ఏజెన్సీ (Agency) లో ఎక్కువగా ఈ అడ్డాకులను ఏరుకుంటూ వారపు సంతలో అమ్మకాలు చేసి జీవనం సాగిస్తుంటారు కొంతమంది గిరిజనులు. వారం అంతా ఆకులు తీసుకొచ్చి ఎండబెట్టి సంతకు తీసుకువచ్చిన తమకు తగిన ధర రావడం లేదంటూ గిరిజనులు వాపోతున్నారు.
రోజు, రోజుకు పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అణుగుణంగా దశాబ్దాల క్రితం సర్వ సాధారణంగా ఉపయోగించే వస్తువుల వినియోగం తగ్గిపోతోంది. ఆనాటి కాలంలో భోజనం చేయడానికి విస్తరాకులు విరివిగా ఉపయోగించే వారు. వాటిని తయారు చేయడానికి అడ్డ ఆకులు ఎండబెట్టి, జొన్న పుల్లలతో వాటిని కుట్టి విస్తరాకులు తయారుచేసి వినియోగించేవారు. అంతేకాక అరటి ఆకులను కూడ భోజనాలకు ఉపయోగించేవారు. శుభకార్యాల్లోనూ అతిథులకు విస్తరాకుల్లో,అరటి ఆకుల్లో సంప్రదాయ బద్దంగా భోజనాలు వడ్డించేవారు.
నేడు కూడా సంప్రదాయాన్ని పాటించే కొందరు విస్తర్లు వాడుతున్నా దాదాపు చాలా మంది శుభకార్యాల్లో వాటి వాడకాన్ని చాలా మట్టుకు తగ్గించేశారు. ప్లాస్టిక్ వస్తువుల విని యోగంతో విస్తారాకుల ఆదరణ రోజు రోజుకూ తగ్గిపోతుంది. మార్కెట్లో విరివిగా లభించే ప్లాస్టిక్ బ్యాగులు, థర్మకోల్ ప్లేట్లు,పేపర్ గ్లాసులు అధికంగా వినియోగిస్తున్నారు.దీని వల్ల జరిగే నష్టాలను ప్రజలు గ్రహించడం లేదు.
ఇదీ చదవండి : వారి జీవితాల్లో కొత్త వెలుగులు..? ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎందుకంటే?
ప్లాస్టిక్ ప్లేట్లు వాడటం వల్ల కలిగే నష్టాలు..
థర్మకోల్ ప్లేట్లు కానీ, పేపర్ ప్లేట్లు కానీ వాడకం ఆరోగ్యానికి హానికరం. వాటిలో వాడిన ఆహారాన్ని కూడ కలుషితం చేస్తాయి. ప్రజలు బాక్టీరియా, చర్మ అలర్జీలు, గ్యాస్ట్రో సమస్యలకు ప్లాస్టిక్ వాడకం కారకం అవుతోంది. అదీగాక వేడిగా ఉన్న ఆహారాన్ని ప్లాస్టిక్ పాత్రల్లో వాడితే క్యా న్సర్ కారక క్రిములు శరీరంలో వద్ధి చెందు తాయని శాస్త్రజ్ఞులు తేల్చారు. కాఫీ, టీ, ఇతర పానీయాల కోసం కాగితాలతో తయారు చేసిన, పునర్వినియోగ పాత్రలను వాడాలి. ఆహార పార్సిళ్లకు ప్లాస్టిక్ బ్యాగులను వినియోగించొద్దు.
ఇదీ చదవండి : తెలుగు మహిళకు మిసెస్ ఆసియా టైటిల్.. తొలి దక్షిణ భారత మహిళగా అరుదైన గుర్తింపు
ప్లాస్టిక్ ప్లేట్లపై మోజు.. పెరుగుతున్న విద్యా,సాంకేతిక పరిజ్ఞానానికి అణుగుణంగా నేడు ప్రజల్లో కూడా మార్పు వస్తోంది. ప్రాచీన కాలంలో ఉపయోగించే వస్తు వులను పక్కన పెట్టి మార్కెట్లో లభించి అతి తక్కువ ధరలో ఆకర్శించే ప్లాస్టిక్, ప్లేట్లను వాడుతున్నారు. ఒక్కో ప్లేట్ ధర 1.25 నుంచి 30 వరకు ధర ఉంటుంది. వీటిల్లో ఒక వాడి పారేసేవి, వాడుకొని నీటితో కడిగి తిరిగి వాడేవి ఉంటాయి.డిజైన్,నాణ్యతను బట్టి థర్మకోల్, ప్లాస్టిక్ ప్లేట్ల ధర ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam