etti Jagadesh, News18, Visakhapatnam.
బాహుబలి (Bahubali) సినిమా గురించి తెలియని వాళ్లు ఉండరు.. టాలివుడ్ సినిమా (Tollywood Movie) స్థాయిని పెంచిన ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో ప్రతి సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులోనూ ఆ సినిమాలో భారీ (గ్రాఫిక్) దున్నపోతుతో భల్లాలదేవ పోరాడే సీన్ అయితే అందరికీ కళ్లముందే ఉంటుంది. అది గ్రాఫిక్స్ కావచ్చు కానీ.. అలాంటి భారీ దున్నపోతు ఇప్పుడు వైజాగ్ (Vizag) లో కనువిందు చేస్తుంది. ఎక్కడంటే..? విశాఖపట్నం (Visakhapatnam) లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రేమ సమాజం (Prema Samajam) అనే సంస్థ 1970వ సంవత్సరంలో గోశాల ప్రారంభించారు. నాలుగు ఆవులతో ప్రారంభమైన ఈ గోశాల ఇప్పుడు వందకుపైగా గోవులను సంరక్షిస్తున్నారు.
ప్రేమసమాజం అనాథ పిల్లలు, వృద్దులకు సేవలు అందిస్తూ ఉంటుంది. గో సంరక్షణ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు, పిల్లలు, వృద్దులకు ఆరోగ్య రీత్యా ఎటువంటి ఇబ్బందులూ ఉండవని పెద్దలు సూచనలు మేరకు ఈ మూగ జీవులకు సేవ చేసేందుకు గోశాల నిర్వహిస్తున్నట్లు ప్రేమ సమాజం సెక్రెటరీ జగదీశ్వర్ రావు తెలిపారు.
ఈ ఆవులను ఎవరో దాతలు ఇచ్చినవి కాదు…వాటిని కొంతమంది కళేబరాలకు తరలిస్తుంటే స్థానికులు సహాయంతో పట్టుకొని ఆ మూగజీవుల సంరక్షణ బాధ్యతను ప్రేమ సమాజం తీసుకుంది. అప్పటినుంచి ఎవరైనా ఆవులను పోషించలేని పరిస్థితిలో ఉంటే తమకు అప్పగిస్తే తాము సంరక్షిస్తామని చెబుతున్నారు.
ప్రేమ సమాజానికి వచ్చిన ఆవులలో ఒక దానికి లేగ దూడ పుట్టింది. భారీ ఆకారంతో పుట్టిన ఈ ఎద్దుకు ప్రేమ సమాజం నిర్వాహకులు ముద్దుగా రాము అని పేరు పెట్టారు. కానీ బాహుబలి సినిమా తర్వాత దీని పేరు పూర్తిగా మారిపోయింది. అదేనండి బాహుబలి ఎద్దుగా బాగా ఫేమస్ అయింది. ఈ భారీ ఆకారంలో ఉన్న ఎద్దు బాహుబలి ఎద్దులానే ఎవ్వరికి లొంగదు. నిర్వాహకులు కానీ, అక్కడ పనిచేసే వాళ్లకు కూడా లొంగదు. ఆ ఎద్దుకు తినడానికి, తాగడానికి దాని దగ్గరకే తీసుకొచ్చి గడ్డి, నీళ్లు పెట్టాలి తప్ప అది బయటకు రాదు.
ఇదీ చదవండి : కర్నూలులో ప్రత్యక్షమైన సింగం.. నిమజ్జన వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్!
ఈ భారీ దున్నపోతు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. దీంతో ఈ 'బాహుబలి'ని చూడటానికి నగరవాసులు, చుట్టుపక్కల గ్రామాలే వాళ్లే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జనం ప్రేమసమాజంకి వస్తున్నారు.
రోడ్డు మీద వదిలేసే ఆవులను, ఎక్కడైనా తిండి కోసం ఇబ్బంది పడుతున్న ఆవులను తమకు అప్పగిస్తే తమ పిల్లల మాదిరిగా చూసుకుంటామని అంటున్నారు. వాటికి అనారోగ్యపరంగా సమస్యలు తలెత్తితే స్థానిక పశు వైద్యశాల ప్రభుత్వ డాక్టర్‌తో మెరుగైన సేవలు అందిస్తున్నారు. వందకుపైగా ఉన్న ఆవులలో కేవలం నాలుగు మాత్రమే ప్రేమసమాజానికి పాలు ఇవ్వడం జరుగుతుంది. మిగతావన్నిటినీ గో సంరక్షణలో భాగంగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
మీకు కూడా ఈ బాహుబలి ఎద్దును చూడాలని అనిపిస్తే వెంటనే ప్రేమసమాజంకు వెళ్లాల్సిందే.
అడ్రస్ : 30-6-39, దాబా గార్డెన్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గరలో, మహారాజుపేట, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్- 530004
ఎలా వెళ్లాలి?
విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి డాబాగార్డెన్స్‌కు ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఈ ప్రేమసమాజం కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam, Vizag