హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

G20 Meeting: విశాఖలో జీ-20 సదస్సుకి సర్వం సిద్ధం.. ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే..

G20 Meeting: విశాఖలో జీ-20 సదస్సుకి సర్వం సిద్ధం.. ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే..

విశాఖలో జీ20 సదస్సు

విశాఖలో జీ20 సదస్సు

విశాఖ వేదికగా మార్చి28,29 తేదిల్లో నిర్వహించనున్న జీ-20 సదస్సును విజయవంతం చేసేందుకు నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు గ్రేటర్ అధికారులకు సహకరించాలని గ్రేటర్ కమిషనర్ పి. రాజాబాబు అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

G20 Meeting:   మెగా అంతర్జాతీయ సదస్సుకు విశాఖ (Visakha) వేదికగా నిలుస్తోంది. మార్చి 28, 29 తేదిల్లో  జీ-20 సదస్సు (G 20 Meeting) జరగనుంది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు గ్రేటర్ అధికారులకు సహకరించాలని గ్రేటర్ కమిషనర్ పి. రాజాబాబు అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మాకంగా నిర్వహించనున్న సదస్సుకు 40 దేశాల నుంచి 200 వరకూ ప్రతినిధులు హాజరవుతారని, వారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతి, ప్రయాణ ఏర్పాట్లు చేయడంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

దీనిలో భాగంగానే స్టీల్ ప్లాంట్ (Steel Plant) నుంచి కొమ్మాది వరకూ నగరాన్ని సుందరీకరించడం, విద్యుత్ దీపాల ఏర్పాటు, ప్లాంటేషన్, పౌంటైన్ల ఏర్పాటు ప్రత్యేకంగా చేపడుతున్నామని, సదస్సుకు విచ్చేసే ప్రతినిధులకు పర్యాటక ప్రాంతాలను సైతం సందర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్కేబీచ్ (RK Beach) తో పాటు, రుషికొండ, తొట్లకొండ, శిల్పారామం ప్రాంతాలను సైతం శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అయితే జీ-20 సదస్సు కంటే ముందుగా మార్చి2, 3 తేదిల్లో విశాఖలోనే ఇన్విస్టర్స్ మీట్ జరగనున్న నేపధ్యంలో అనాటికే జీ-20 ఏర్పాట్లు పూర్తిచేసేలా ప్రణాళిక ప్రకారం పనులు ప్రారంభిస్తున్నా మన్నారు. ముఖ్యంగా నగర సుందరీకరణతో పాటు, రహదారులు, ఇతర పర్యాటక ప్రాంతాలను సైతం మరింత అందంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఇదీ చదవండి : అరుదైన హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్.. చిన్న పిల్లలకు వరంలా నిలుస్తున్న హృదయాలయం

ముఖ్యంగా ఆర్కేబీచ్ ప్రాంతాన్ని ఓ ఐకానిక్ గా తీర్చిదిద్దేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సదస్సుకు అవసర మయ్యే ఖర్చు, నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ముఖ్యంగా సదస్సుకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్న లైజినింగ్ ఆఫీసర్ల నియామకంతో పాటు, వార్డు సెక్రటరీల సేవలను వినియోగించుకుని ఎదస్సును విజయవంతం గా పనిచేస్తున్నామన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag

ఉత్తమ కథలు