Setti Jagadeesh, News 18, Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా సంక్రాంతి (Sankranti) సీజన్ ఫీవర్ మొదలైంది.. పట్టణాల్లో ఉన్న ప్రజలు.. గ్రామాల బాట పడుతున్నారు. అయితే సాధారణంగా సంక్రాంతి అంటే పల్లెల్లో ఎక్కువగా కనిపించేది.. గంగిరెద్దుల సందడే.. ముఖ్యంగా విశాఖపట్నం (Visakhapatnam) పల్లె గ్రామాలు, మన్యంలో కూడా సంక్రాంతి వారం రోజులు ముందు నుండి గంగిరెద్దుల వారి సందడి చాలా ఎక్కువగా ఉండేది. మారుతున్న సమాజంతో పాటు ప్రజలు కూడా బిజీ అవడంతో నగరంలో సంక్రాంతి సందడి ఏమి కనిపించడం లేదు. గంగిరెద్దుల వారి చప్పుడులే కనిపించడం లేదు. అప్పట్లో పెద్దలందరూవారిని ఎంతో ఆప్యాయతగా దానాలతో పంపించేవారు.
గంగి రెద్దుల వారి హంగులు, శ్రుతి, సన్నాయి బూర, డోలు, చేతిలో కంచుతో చేయబడిన చిన్న చేతిగంట, వేషధారణలో నెత్తికి రంగుల తలగుడ్డ, మూతిమీద కోర మీసాలు, చెవులకు కమ్మల జోడు, వారు వీరు ఇచ్చిన పాత కోటు, భుజంమీద కండువా, చేతికి వెండి మురుగులు, నుదురున పంగనామంతో పంచ కట్టు కట్టి ఆకర్షణీయంగా తయారౌతారు. గంగిరెద్దుల వారికి ప్రతి ఊరిలోనూ మధ్యనున్న పెద్ద బజారే వారికి రంగస్థలం.
ముందుగా గ్రామంలో ప్రవేశించి, గ్రామ పెద్దలను ఆశ్రయించి వారి అనుమతితో ప్రదర్శనం ఏర్పాటు చేసుకుంటారు. వారి వాయిద్యాలాతో రణగొణ ధ్వనులు చేసి ప్రజలను రప్పిస్తారు. ఆ రోజుల్లో గంగి రెద్దుల ఆటలంటే మహాదానందంతో హాజరయ్యేవారు. ప్రేక్షకులందరూ మూగిన తరువాత గంగి రెద్దులను మేళతాళాలతో ఊరంతా తిప్పుగూ స్వాగతం పలికిస్తారు.
ఇదీ చదవండి : సరిహద్దులు దాటేస్తున్న రేషన్ బియ్యం.. ఎలా మాయ చేస్తున్నారంటే..?
ఎద్దు నోటిలో మెడను ఇరికించి అదృశ్యాన్ని అందరికీ చూపిస్తారు. వాయిద్యానికి అనుకూలంగా గజ్జెల కాళ్ళతో నృత్యం చేసేది, పడుకో మంటే పడుకునేది, లేవ మంటేలేచేది, అయ్యగారికి దండం పెట్టమంటే తలవంచి పెట్టేది. అయ్యగారికి శుభం కలుగుతుందా? అనుకున్న పనులు జరుగుతాయా అంటే అవునన్నట్టు తల ఊపుతుంది. వాడు అడిగిన ప్రతిదానికీ తల ఊపడాన్ని బట్టే ఒక సామెత పుట్టింది. మనవాళ్ళు అంటూ వుంటారు. ఏమిటిరా అడిగిన ప్రతిదానికీ గంగి రెద్దులా తల ఊపుతావు. నోటితో సమాధానం చెప్పరా అని. అది ఏనాడో పుట్టిన సామెత.
ఇదీ చదవండి : పందానికి సై అంటున్న క్రాస్ పుంజులు.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?
సంక్రాంతి పండుగ నెల రోజుల ముందేఊరూర డూడూ. బసవన్నల నృత్యాలతో ఇంటి ముంగిట కనువిందు చేస్తాయి. ఈ ఆనందాన్ని తిలకించి వారు పెట్టే పిడికెడు. గింజలతో పొట్టనింపుకొని దేశ సంచారం చేస్తారుగంగిరెద్దులవారు. సంవత్సరంలో ఆరునెలల కాలం పాటు దేశంలో వివిధ ప్రాంతాలకు గంగిరెద్దులతో కుటుంబ సమేతంగా వలసలు వెళతారు. వీరిలో రెండు తెగలు. ఒకరు పూర్తిగా గంగిరెద్దుల మీద జీవనం సాగిస్తుండగా, మరొక తెగ యక్షగాన కళాకారులు.
ఇదీ చదవండి : ఆయన దారి టీడీపీ వైపు కాదా..? జనసేనలో చేరాలని ఫిక్స్ అయ్యారా..? కన్నా ఫ్యూచర్ ఏంటి..?
వీరు తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి వీధి నాటకాలు ప్రదర్శించి వారిచ్చే సంభావనతో కుటుంబాలు పోషించుకుంటారు. టీవీలు, సినిమాల ప్రభావంతో నాటి కళారూపకాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం ఆ వృత్తిని తమ పిల్లలకు నేర్పించటం లేదు. వీరిలో బాల్యవివాహాలు సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. గంగిరెద్దుల వారు మాత్రం తమ వారసత్వాన్ని కొనసాగింపుతో జీవనాన్ని నెట్టుకొస్తుండగా, తెగ వారు ఆదరణ లేక మానేస్తున్నారు. కుటుంబ సమేతంగా వలన వెళుతున్నందు వలన వీరికి సంక్షేమ కార్యక్రమాలు అందటం లేదు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Makar Sankranti, Visakhapatnam, Vizag