Anna Raghu, Sr.Correspondent, News 18, Amaravati
Good News for Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు శుభవార్త.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అధికారం చేపట్టిన తరువాత ఏపీకి పెట్టుబడులు (Investments for andhra pradesh) రావడం లేదని.. ఉన్న పరిశ్రమలు సైతం వెనక్కు తరలిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కానీ అవన్నీ విమర్శలే అని.. ఏపీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ స్థానంలో ఉందని ప్రభుత్వం (AP Government ) క్లారిటీ ఇచ్చింది. భారత దేశంలోనే.. పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా ఏపీ నిలుస్తోందని.. 2022 సంవత్సరానికి పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ స్థానంలో ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ఏడాది మొదటి 7 నెలల్లోనే 40,361 కోట్ల పెట్టుబడులు
వచ్చాయని.. అందుకే 2022లో దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 45 శాతం పెట్టుబడులను ఆకర్షించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలించిందని.. డీపీఐఐటీ (DPIIT) నివేదిక వెల్లడించింది.
జూలై 2022 నుంచి నేటి వరకు ఏపీకి వచ్చిన పెట్టుబడుల వివరాలను డీపీఐఐటీ నివేదిక వెల్లడించింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) నివేదిక ప్రకారం 1,71,285 కోట్ల భారతదేశ పారిశ్రామిక పెట్టుబడుల్లో ఏపీ 40,361 కోట్ల రూపాయలను ఆకర్షించిందని నివేదికలో ఉంది.
సీఎంగా జగన్ (CM Jagan) బాధ్యతలు చేపట్టిన తరువాత వరుసగా మూడో ఏడాది కూడా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా ఒడిషా (Odisha) 36,828 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏపీ కేబిెట్ ఇప్పటికే ఇతర రంగాల్లో ఎస్ఐపీబీ (SIPB) ద్వారా రాష్ట్రానికి వచ్చిన 1,26,748 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రస్తుతం ఆమోదించిన ఈ పెట్టుబడులతో 40,330 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండడం శుభవార్తే.
ఇదీ చదవండి : వివేకా హత్య కేసులో సీబీఐ చేతులెత్తేసిందా..? విచారణ ఈ నెల 22కు వాయిదా..?
ఆ మధ్య దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ (AP CM jagan Davos Tour) భారీ ఒప్పందాలపై సంతకాలు చేశారు. తాజాగా ఇన్ఫోసిస్ (Infosys).. విశాఖపట్నం (Visakhapatnam) ఆఫీసు ప్రారంభం అవుతోంది. వీటికి తోడు.. తాజాగా ఏపి పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కరణ కాబోతోంది. తిరుపతి (Tirupati), శ్రీకాళహస్తి (Srikalahasthi) చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఆరు వేల కోట్ల రూపాయలతో పలు కంపెనీలు యేర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు కంపెనీలకు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపనలు పూర్తి చేశాడు కూడా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Investments, Visakhapatnam