Setti Jagadeesh, News 18, Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఏజెన్సీ అయినటువంటి అటవీ ప్రాంతాల్లో నివసించే అమాయక గిరిజనులు అడవిలో దొరికే ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. గిరిపుత్రుల దగ్గర నుండి దళారి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు అమ్ముకునేవారు. అలాంటి సందర్భాల్లో దళారి వ్యవస్థ నుంచి కాపాడే లక్ష్యంగా ఏర్పాటైన రాజ్యాంగబద్దమైన సంస్థనే గిరిజన సహకార సంస్థ (జిసిసి). ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ (జిసిసి) అనేది 1956లో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అనేది విశాఖపట్నంలో ఉంది. అప్పటినుండి గిరిజనులుతయారు చేసే వస్తువులన్నీ జిసిసి అమ్మకాలు చేస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ అటవీ ఉత్పత్తులను రిటైల్ మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి సారించారు.
దీనిలో భాగంగానే అందరికీ అందుబాటు ధరల్లో ప్రజలందరికిచేరాలని చౌక దుకాణాల ద్వారా అందించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా జీసీసీ ఉత్పత్తులు రేషన్ డిపో, రేషను పంపిణీ వాహనాలు (ఎండీయూ)ల్లో ఈ ఉత్పత్తులన్నీ అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం జిల్లాలో 640 చౌక దుకాణాలు, 311 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. గిరిజనులు స్థానిక అటవీ పంటలతో తయారుచేసి,సేకరించి శుద్ధి చేసిన40 రకాలు ఉత్పత్తులనునవంబరు 1వ తేదీ నుంచి వాటిల్లో విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా విశాఖ జిల్లాలో వీటి అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేషను డీలర్లుకు , ఎండీయూ వాహనదారులకు ఆ జిసిసి అందించే గిరిజన ఉత్పత్తులపై ఇదివరకే అవగాహన కల్పించారు.రేషన్ డీలర్లు చేసే అమ్మకాలపై 20 శాతం వరకు కమీషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
విశాఖ జిల్లాలో జిసిసి అందించే ఉత్పత్తులపై 480 మంది వరకు డీలర్లు అమ్మకాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.ఈ జీసస్ ఉత్పత్తులపై విశాఖ నగరవాసుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో అని మొదటిగా కొంతవరకు సరుకు తెప్పించుకొని అమ్మకాలు చేస్తున్నారు. ఈ జిసిసి ఉత్పత్తులు కావాలంటే రేషన్ డీలర్లు ముందుగా వారి సొంత సొమ్ము ఇచ్చి ఉత్పత్తులు తెచ్చుకొని నగర వాసులకి అమ్మకాలు చేసుకోవలసి ఉంటుంది.
ఒక వేళ జిసిసి నుండి తెచ్చిన సరకులు మిగిలితే జిసిసి వెనక్కి తీసుకొనే పరిస్థితి లేదు. ఈ పద్ధతి వలన డీలర్లు జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలపై తర్జనభర్జన పడ్డారు.జీసిసిఉత్పత్తులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లపై పలుమార్లు ఒత్తిడి తేవడంతో కొంతవరకు సరుకు తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు.జిసిసి ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతుంది. అవి ఏంటంటే....చింతపండు, తేనె, కాఫీ పౌడర్, అరకు కాఫీ, రాగి పౌడరు, పసుపు పౌడరు, పసుపు పొడి, కంకుమ పౌడరు, కుంకుడు షాంపు, శీకాయ షాంపు వంటి ఉత్పత్తుల ధరలను తగ్గించి డీలర్ల అమ్మకాలు చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam