Vizag Ship Story: ఏడాదైనా కదలని ఓడ... ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏమైందో..?

విశాఖ తెన్నేటిపార్కులో నౌక

పర్యాటక శాఖ (AP Tourism) అధికారులు ఆ నౌకను తమకు ఇస్తే... ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా మారుస్తామని బేరసారాలు చేశారు. అయితే ఎంతకు కొనాలనే విషయమై ఇరువర్గాల మధ్య అవగాహన కుదరలేదు.

 • Share this:
  P. Anand Mohan, Visakhapatnam, News18

  ఏడాదైంది. ఆ బంగ్లాదేశ్ (Bangladesh) షిప్ విశాఖపట్నం (Visakhapatnam) తీరానికి కొట్టుకొచ్చి ఏడాదైంది. కనీసం దాన్ని ఏం చేస్తారో.. తెలీకుండానే ఏడాది గడిచిపోయింది. ఫ్లోటింగ్ రెస్టారెంట్ (Floating Restaurant)  అన్నారు. సకల సదుపాయాలతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అదన్నారు.. ఇదన్నారు.. ఇంకేదో చెప్పారు. కానీ.. ఏడాదైనా ఆ షిప్ ని ఏం చేస్తారో తెలియలేదు. గత ఏడాది బంగ్లాదేశ్‌ వాణిజ్య నౌక పోర్టు యాంకరేజి నుంచి తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకువచ్చింది. దానిని కొనుగోలు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న అధికారుల ప్రకటన నేటికీ కార్యరూపం దాల్చలేదు. కురుసుర సబ్‌మెరైన్‌లా, టీయూ-142 యుద్ధ విమానంలా ఆ నౌకను ఒక సందర్శనీయ స్థలంలా మార్చినా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. కానీ.. షిప్ కథ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.

  యాంకరేజ్ సమస్యతోనే..
  విశాఖ పోర్టు (Vizag Port) లోపలకి రావాల్సిన ఈ బారీ నౌక.. తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకొచ్చింది. “ఎంవీ మా” నౌక బంగ్లాదేశ్ నుంచి విశాఖ పోర్టుకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటుంది. విశాఖ పోర్టు నుంచి స్టోన్, క్వార్జ్, ఫ్లైయాష్ తీసుకుని వెళ్తుంది. ఇది గత ఏడాది సెప్టెంబర్ 19న విశాఖ పోర్టుకు వచ్చింది. అయితే డాక్యుమెంట్ల విషయంలో సమస్యలు తలెత్తడంతో పోర్టు అవుటర్ హార్బర్‌లోని యాంకరేజ్‌లో ఉండిపోయింది. సరిగ్గా అదే సమయంలో వాయుగుండం కారణంగా అక్టోబర్ 11న బలమైన గాలుల ధాటికి షిప్ కొట్టుకువచ్చేసింది. సరిగ్గా యాంకరేజ్ చేయకపోవడం వల్లే ఇది జరిగిందని అప్పట్లో అధికారులు ధృవీకరించారు.

  ఇది చదవండి: భర్త మర్మాంగంపై వేడినీళ్లు పోసిన భార్య... ఎంత కోపమొస్తే మాత్రం అలా చేస్తారా..?


  కదిలించడంలో విఫలం...
  80 మీటర్ల పొడవైన నౌక రాళ్ల మధ్య ఇసుకలో చిక్కుకుపోయింది. అందులో 15 మంది సిబ్బంది క్షేమంగానే బయటపడ్డారు. తిరిగి దానిని సముద్రంలోకి పంపడానికి పోర్టు, కోస్టుగార్డు, తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయత్నించాయి. కానీ ఏవీ సఫలం కాలేదు. దాంతో అందులో వున్న ఇంధనం వల్ల సముద్ర జలాలు కలుషితం కాకూడదని, రివర్స్‌ పంపింగ్‌ విధానంలో దానిని ట్యాంకర్లలోకి ఎక్కించి తరలించారు.

  ఇది చదవండి: గబ్బిలాలను పూజిస్తే దోషాలు పోతాయా..? ఏపీలో ఓ గ్రామంలో వింత ఆచారం..


  నౌకమాత్రమే మిగిలింది..
  ఎంత ప్రయత్నించినా ఈ షిప్ అంగుళం కూడా కదలదని బంగ్లాదేశ్ కి చెందిన షిప్ యజమానికి అర్ధమైంది. అందులోని విలువైన యంత్ర సామగ్రి తీసుకువెళ్లిపోయారు. కేవలం ఈ నౌకను మాత్రం వదిలేశారు. దానిని తుక్కుకు, ఇనుప సామాన్లకి విక్రయించే ప్రయత్నాలు కూడా చేశారు.

  ఇది చదవండి: ఏపీలో ప్రతిరోజూ కరెంట్ కోతలు.. సోషల్ మీడియాలో వైరల్.. ప్రభుత్వ రియాక్షన్


  పర్యాటక శాఖ ఆసక్తి చూపినా...
  విషయం తెలిసిన పర్యాటక శాఖ అధికారులు ఆ నౌకను తమకు ఇస్తే... ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా మారుస్తామని బేరసారాలు చేశారు. అయితే ఎంతకు కొనాలనే విషయమై ఇరువర్గాల మధ్య అవగాహన కుదరలేదు. ఆ తరువాత పర్యాటకశాఖ దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే పర్యాటకులు మాత్రం దానిని ఇప్పటికీ ఆసక్తిగానే తిలకిస్తున్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల దానిని తీసుకునే ఆలోచన లేకపోతే.., కనీసం ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించినా విశాఖకు ఒక పర్యాటక ప్రాజెక్టు వచ్చినట్టు అవుతుంది. ఆ దిశగానైనా ప్రయత్నం చేయాల్సి ఉంది.
  Published by:Purna Chandra
  First published: