హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ప్రమోషన్ ఇస్తామన్న వద్దంటున్నారు..! ఏపీలో ఎంఈఓ పోస్టులపై ఆసక్తిచూపని టీచర్లు.. కారణం ఇదేనా..?

ప్రమోషన్ ఇస్తామన్న వద్దంటున్నారు..! ఏపీలో ఎంఈఓ పోస్టులపై ఆసక్తిచూపని టీచర్లు.. కారణం ఇదేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో పాఠశాలల పర్యవేక్షణకు మండలానికి ఇద్దరు చొప్పున విద్యాధికారులు నియమించాలని సీఎం జగన్ (AP CM YS Jagan) ఆదేశించిన విషయం తెలిసిందే.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో పాఠశాలల పర్యవేక్షణకు మండలానికి ఇద్దరు చొప్పున విద్యాధికారులు నియమించాలని సీఎం జగన్ (AP CM YS Jagan) ఆదేశించిన విషయం తెలిసిందే. మండల విద్యాశాఖ అధికారుల్లో ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి పాఠశాలల నిర్వహణ వ్యవహారాలు అప్పగించనున్నారు. అయితే విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) లో మాత్రం ఎంఈఓ పోస్టులకు ఏ టీచర్లు సుముఖత చూపిస్తున్నట్లు కనిపించట్లేదు..! కారణాలేంటనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. నాడు- నేడు పనులు పూర్తయిన బడుల్లో కల్పించిన సౌకర్యాలు బాగు న్నాయా? లేదా? అన్నది నెలకోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా తెలియజేసేందుకు వీలుగా ఫోన్ నంబర్లను ప్రతి స్కూల్‌లో విద్యార్థులకు కనపడేవిధంగా డిస్‌ప్లే బోర్డులు పెట్టాలని ముఖ్యమంత్రి తెలిపారు.

  వచ్చే ఏడాది జూన్‌లో అన్ని పాఠశాలలు తెరిచే నాటికి విద్యా కానుకను పిల్లలకు కచ్చితంగా అందించాలని, యూనిఫామ్‌ కుట్టుకూలి ఛార్జీలను స్కూల్‌ ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో వేయాలని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి మండలానికి ఇద్దరు ఎంఈఓలను నియమించనుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా విశాఖ జిల్లాకు సబందించి అదనంగా ఏడు మండల విద్యాశాఖాధికారి పోస్టులును ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ జిల్లాలో మొత్తం 11 మండలాలకు గానూ.., 22 మంది ఎంఈవోలు ఇక్కడకు రానున్నారు.

  ఇది చదవండి: ఆస్పత్రి సూపర్‌వైజర్‌కే వైద్యం అందలేదు.. ఇంతకంటే దారణం ఏమైనా ఉంటుందా..? 

  ఇప్పటివరకు పద్మనాభం, భీమిలి, ఆనందపురం, పెందుర్తి మండలాలకే MEO పోస్టులుండగా, కొత్తగా ఇచ్చిన ఉత్తర్వులతో చినగదిలి, సీతమ్మధార, మహారాణిపేట, ములగాడ, గోపాలపట్నం, గాజువాక, పెదగంట్యాడ మండలాలకు అదనంగా మండల విద్యాశాఖ అధికారులు పోస్టులును మంజూరు చేశారు.

  ఇది చదవండి: విశాఖ బీచ్‌లో అద్భుతం.. పురాతన నిర్మాణం గుర్తింపు.. ఆ యుద్ధకాలం నాటిదేనా..?

  దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఈవోలకు పనిభారం తగ్గుతుంది. ఇలా అయితే పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలకు పర్యవేక్షణ జరుగుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలోని పాఠశాలలను విద్యాశాఖ పర్యవేక్షణలోకి తీసుకురావడం వల్ల, ఇకపై వీటి పర్యవేక్షణ బాధ్యత ఎంఈవోలపైనే పడబోతుంది. ఎంఈవో-1 పోస్టు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి , ఎంఈవో-2 పోస్టు జెడ్పీ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలకు కేటాయించారు.

  ఇది చదవండి: స్నేహమంటే ఇదేరా..! స్నేహితుడికి గుర్తుగా.. వీల్లేం చేశారో మీరే చూడండి..

  ఎంఈవో పోస్టులకు హెచ్‌ఎంల సమ్మతి ప్రక్రియను ఆదివారం జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో చేపట్టగా కేవలం 14 మంది మాత్రమే సమ్మతి తెలిపారని సమాచారం. MEO విధులు, బాధ్యతలపై స్పష్టత లేకపోవడంతో ఎక్కువమంది ఈ పోస్టులో చేరడానికి, మొగ్గు చూపడం లేదని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దీంతో విశాఖ పరిసరాల్లో ఉన్న జడ్పీ హెచ్‌ఎంలు నర్సీపట్నం లేదా పాడేరు పరిసర మండలాలకు వెళ్లాల్సి వస్తుందేమో అనే భయంతో కొందరు సీనియర్లు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Teacher jobs, Visakhapatnam

  ఉత్తమ కథలు