Asani Cyclone: బంగాళాఖాతం (Bay of Bengal) లో అసని తుపాను (Asani Cyclone) కొనసాగుతోంది. దిశను మార్చుకున్న తుపాను.. కృష్ణా జిల్లా (Krishna District) మచిలీపట్నం వైపు వేగంగా దూసుకెళ్తోంది. కోనసీమ కాకినాడ (Kakinada) సముద్ర తీరం వెంబడి అసని తుపాను పయనిస్తోంది. తుపాను ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు ఎగిసి పడుతున్నాయి. తీరం వెంబడి పయనించే సమయంలో ఈదురు గాలిలుతో కూడిన వర్షాలు చాలా చోట పడుతున్నాయి. ఇప్పటికే ఉప్పాడ (Uppada) తీర ప్రాంతం కోతకు గురవుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ పూర్తిగా అలర్ట్ అయ్యారు. తహిసిల్దారు కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ (Control Room) లను అధికారులు ఏర్పాటు చేశారు. తీరప్రాంత మండలాల్లోని ఉద్యోగులను అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశారు. అలాగే మూడు జిల్లాల్లో పోలీస్, రెవిన్యూ, ఫైర్, మిగిలిన శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.
అసని తీవ్ర తుఫాన్ నేపథ్యంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం-08942-240557, విజయనగరం కలెక్టరేట్-08922-236947, 08922-276888, చీపురుపల్లి-9440717534, భోగాపురం-8074400947, విశాఖ-0891-2590100, 2590102 నెంబర్లను అందుబాటులో ఉంచారు. అత్యవసర సమయాల్లో ఎవరైనా సాయం కోరచ్చని కోరారు. అధికారుల.. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ దగ్గర పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అలాగే ఒంగోలు కలెక్టరేట్‌లో కూడా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూం నంబర్ : 1077, పోలీస్ వాట్సప్ నంబర్ : 9121102266. చీరాల ఆర్డీవో కార్యాలయంతో పాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు అసని తీవ్ర తుఫాన్ కారణంగా బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, రేపల్లె, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో బాపట్ల కలెక్టరేట్‌లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.. కంట్రోల్ రూమ్ నెంబర్లు 87126 55878, 87126 55881, 87126 55918. అలాగే తీర ప్రాంత మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : తుఫాను తీసుకొచ్చిన బంగారం మందిరం.. చూసేందుకు ఎగబడుతున్న జనం
అసని తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత మండలాలైన ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, నాగులుప్పలపాడు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. జరుగుమిల్లి మండలంలో అత్యధికంగా 34 మిల్లీ మీటర్లు, ఒంగోలులో 26 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తుఫాన్ కారణంగా మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cyclone alert, Vizag