Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.
ఆట పేరుతో ముగ్గులోకి దింపుతారు.. తరువాత దొరికినంత దోచుకుంటారు. అంతేకాదు పార్ట్ టైం ఉద్యోగాలంటూ (Part Time Jobs) ముగ్గులోకి దించి.. ఆపై గేమ్ టాస్క్‌లు ఇస్తారు.. పార్ట్ టైం జాబ్ కదా అని ఏ మాత్రం టెంప్ట్ అయ్యి.. వారి మాటలు నమ్మితే అంతే సంగతలు.. తాజాగా విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) లో జరిగిన ఆన్ లైన్ మోసాలే (Online Frauds) అందుకు నిదర్శనం.. ఆ మధ్య ఓ మహిళ..? గుర్తుతెలియని వ్యక్తుల మాటలు నమ్మి తన అకౌంట్‌లోని ఉన్న 12,83,670 పోగొట్టుకుంది. ఆ వెంటనే మోసపాయనని తెలిసి.. అక్టోబరు 13న సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే ఆ మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐ భవానీప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి ఖాతాలోని నగదు కొంత మహారాష్ట్రలోని ఎస్ బ్యాంకు బ్రాంచిలోగల ఖాతాకు, మరికొంత బిహార్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచీలోగల ఖాతాకు వెళ్లినట్టు గుర్తించారు. దీంతో దర్యాప్తు బృందం ముంబై వెళ్లి ‘ఎస్’ బ్యాంకులో ఖాతా కోసం ఇచ్చిన చిరునామాను రా తీశారు.
కానీ అది తప్పుడు అడ్ర్‌సగా తేలింది. ఆ ఖాతాకు లింక్ చేసిన ఫోన్ నంబర్ చలామణిలో లేదు. ఖాతాకు ఇచ్చిన మరొక నంబర్‌ను ట్రాక్ చేసి ఠాణే జిల్లాలోని నవ్‌ఘర్ పరిధిలో 45 ఏళ్ల రాజు గనటే అనే వ్యక్తిని విచారించారు. తాను వాడుతున్న సిమ్ కార్డును ముంబైలో సుమన్‌షా అనే వ్యక్తి వద్ద తీసుకున్నట్టు చెప్పాడు.
ఇదీ చదవండి : అన్నదమ్ముల మధ్య ముదిరిన వైరం.. టీడీపీ శ్రేణుల్లో కలవరం
అతడు ఇచ్చిన సమాచారంతో బిహార్‌లో సుమన్‌షాను అదుపులోకి తీసుకోగా, తాను సిమ్ కార్డు ప్రొవైడర్‌గా పనిచేస్తుంటానని, తన వద్దకు వచ్చే వారి నుంచి ఆధార్, పాన్‌కార్డులు రెండేసి సెట్లు తీసుకుని, వారి పేరు మీదే రెండు సిమ్ కార్డులు తీసుకుని, ఒకటి వారికి ఇచ్చి, మరొకటి తన వద్ద ఉంచుకుంటానని తెలిపాడు. ఈ క్రమంలో ఆగస్టులో రాజస్థాన్‌కు చెందిన సుభాన్‌సింగ్ తన వద్దకు వచ్చి మూడు సిమ్ కార్డులు తీసుకున్నాడని, తర్వాత మరో పది సిమ్ కార్డులు తీసుకున్నాడని చెప్పాడు.
ఇదీ చదవండి: సీఎం జగన్ కు షాక్.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశామని ఓట్లడుగుతాం
ఆ ఫోన్ నంబర్లను బ్యాంకుకు లింక్ చేసి సుభాన్‌సింగ్ అతడి స్నేహితులు సేవింగ్స్ అకౌంట్స్ తెరుస్తారు. తర్వాత ఒక షాపు అద్దెకు తీసుకుని దాని అడ్రస్, బ్యాంకు ఖాతా నంబర్‌తోపాటు కొన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కొన్నాళ్లకు సేవింగ్స్ ఖాతాను కరెంట్ ఖాతాగా మార్చుకుని.. ఆ ఖాతాలోకి మోసగించి దోచుకున్న డబ్బును మళ్లిస్తున్నారు.
ఇదీ చదవండి: సొంత నియోజకవర్గంలో మంత్రికి చుక్కలు.. అసమ్మతికి కారణం ఇదే
ఇలా ఒకే అడ్ర్‌సతో పలు నకిలీ కంపెనీలను సృష్టించారు. వీరి వెనుక రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్ చౌదరి, రజనీష్ గుజ్జార్, మజీద్‌లు ఉన్నారు. వీరంతా తమ స్వస్థలమైన రాజస్థాన్‌లోని గులబ్‌పురలో నిరుద్యోగ యువతను ముంబైలో సుమన్‌షా దగ్గర పంపించి వారి ఆధారాలతో సిమ్ కార్డులను పొందుతున్నట్టు సీపీ తెలిపారు.
ఇదీ చదవండి : రాత్రికి రాత్రే నిర్మాణాలు.. ఖాళీ స్థలం ఉంటే అక్కడ అంతే సంగతి.
ప్రదీప్ చౌదరి, రజనీష్ గుజ్జార్, మజీద్ తాము సేకరించిన ఫోన్ నంబర్లకు పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మెసేజ్‌లను కంప్యూటర్ ద్వారా పంపుతారు. ఇంటి దగ్గర వుంటూనే రోజుకు పది వేల వరకూ సంపాదించవచ్చునని మెసేజ్‌లు పంపుతారు. ఎవరైనా ఆశతో మెసేజ్‌లోని లింక్‌ను క్లిక్ చేస్తే ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. 500 రూపాయల ఫీజు చెల్లిస్తే దరఖాస్తు పంపిస్తారు.
ఇదీ చదవండి : ఇడ్లీ ఫ్యాక్టరీ గురించి ఎప్పుడైనా విన్నారా..? ఎన్నిరకాలు ఉంటాయో తెలుసా..?
ఆ దరఖాస్తులో ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు వంటివి నింపి పంపితే... వారికి ఒక ఐడీ నంబర్ క్రియేట్ అవడంతోపాటు అమెజాన్ ప్రో పేరుతో ఒక పోర్టల్ డిస్‌ప్లే అవుతుంది. అందులో కనిపించే వస్తువులను వర్చువల్‌గానే కొనుగోలు చేస్తే వారి ఖాతాకు కొనుగోలు చేసిన మొత్తానికి అదనంగా 30 శాతం జమవుతుందని చెబుతారు.
ఇదీ చదవండి : 400 రోజులు.. 4000 కిలోమీటర్లు.. 27 నుంచి లోకేష్ పాదయాత్ర.. యువ ఓటర్లే లక్ష్యంగా పేరు
అలా పది వేల రూపాయల వరకూ సక్రమంగానే డబ్బులు పంపించి నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ తర్వాత గేమ్ పేరుతో ఒక టాస్క్ ఇచ్చి గెలిస్తే రెట్టింపు మొత్తం ఇస్తామని ముగ్గులోకి దించుతారు. ఈ ఆటను రూ.రెండు లక్షలతో ప్రారంభిస్తారు. ఆ మొత్తం విడుదల కావాలంటే మరొక టాస్క్ ఆడాలంటారు. బాధితులు మోసపోయామని గుర్తించేంత వరకూ డబ్బులు గుంజేస్తారు.
ఇదీ చదవండి : కూతురుని కూడా వదలరా? ట్రోల్స్ పై కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా .. అసలు ఏం జరిగింది అంటే?
విశాఖలో ఈ తరహా మోసాలకు సంబంధించి 78 ఫిర్యాదులు అందాయని, వీరంతా 2.45 కోట్లు పోగొట్టుకున్నారని తెలిపారు. నిందితుల్లో ప్రదీపచౌదరి, రజనీష్ గుజ్జార్, మజీద్ పరారీలో ఉండగా.. మిగిలిన వారిని అరెస్టు చేశామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన సీఐ భవానీప్రసాద్‌తోపాటు ఇతర సిబ్బందిని సీపీ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, CYBER CRIME, Visakhapatnam