VISAKHAPATNAM ANDHRA PRADESH CRIME NEWS KAKINADA SI SUICIDE HIS SERVICE GUN WHAT HAPPENED NGS
AP Crime News: సీఎం బందోబస్తుకు వెళ్లి వచ్చి ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న ఎస్సై.. ఏం జరిగిందంటే?
ఎస్సై ఆత్మహత్య
AP Crime News: ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్ మెంట్ లో విషాదం నెలకొంది. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అది కూడా సీఎం బందోబస్తుకు వెళ్లి వచ్చిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ఏమై ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.
AP Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పోలీసులు ఆత్మహత్య సంఘటలు పెరగడం ఆందోళన పెంచుతోంది. ఎవరైనా ఆత్మహత్య (Suicide) కు పాల్పడుతున్నారని తెలిస్తే.. వారి ప్రయత్నం విరమించి ధైర్యం చెప్సాల్సిన పోలీసులే ఇలా బలవన్మరణానికి పాల్పడుతుండడంత కలకలం రేపుతోంది. అధికార ఉన్నత స్థానంలో ఉండే ఎస్సై లు సైతం ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన పెంచుతోంది. ఆ మధ్య విజయనగరం (Vizianagaram) జిల్లాలో ఓ మహిళ ట్రైనీ ఎస్సై, హోమ్గార్డ్స్ (Home guards) విభాగం చూసే ఆర్ఐ ఈశ్వరరావు (RI Eswararao) ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా కాకినాడ జిల్లా (Kakinada District) లో ఎస్సై ఆత్మహత్య (SI Suicide) కలకలం రేపుతోంది. అయితే అతడి ఆత్మహత్యకు.. అధికారుల ఒత్తిడి కారణమా..? కుటుంబ కలహాలు ఉన్నాయా..? లేక ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. అయితే పోలీస్ డిపార్ట్ మెంట్లో ఇటీవల ఆత్మహత్యలు పెరగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన కాకినాడ (Kakinada)జిల్లాలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కాకినాడ రూరల్ సర్పవరం (Sarpavaram)పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాలకృష్ణ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం సీఎం బందోబస్తుకు వెళ్లి వచ్చిన ఎస్ఐ గోపాలకృష్ణ.. రాత్రి ఇంట్లో గన్ తో కాల్చుకున్నాడు. గోపాలకృష్ణ స్వస్థలం విజయవాడ సమీపంలోని జగ్గయ్య చెరువు గ్రామం. 2014 బ్యాచ్ లో ఎస్ఐగా సెలక్ట్ అయిన గోపాలకృష్ణ.. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు భార్యాపిల్లలు నిద్రిస్తున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
గతంలో కాకినాడలో ట్రాఫిక్ విభాగంలో గోపాలకృష్ణ పని చేశారు. అతడిపై ఎలాంటి వేధింపులు లేవని.. ఉద్యోగం విషయంలో ఎప్పుడు హ్యాపీగానే ఉండేవారని సహచరులు చెబుతున్నారు.
వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గోపాలకృష్ణ మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ పరిశీలించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు తర్వాతే ఎస్సైది ఆత్మహత్యనా? మిస్ ఫైర్ జరిగి మృతిచెందారా? అనేది తేలనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.