P Anand Mohan, Visakhapatnam, News18.
Drug Injection: సువిశాల సాగర తీరం.. ఐటీ హబ్ (It Hub), స్మార్ట్ సిటీ (Smart City).. అందమైన పర్యాటక ప్రదేశం (Tourist place).. ప్రశాంత నగరం ఇలా విశాఖ (Visakha)కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కాబోయే ఎగ్జిక్యూటివ్ కాపిటల్ (Executive Capital) అంటూ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ మహా నగరానికి ఇప్పుడు ఏమైంది? ఇలాంటి సమయంలో క్రైమ్ రేటు పెరగడం ఆందోళన పెంచుతోంది. రోజు రోజుకూ హత్యలు, ఆత్మహత్యలు, చోరీలు విపరీతంగా పెరుగుతున్నాయ.. అయితే వీటన్ని ప్రధాన మూలం మత్తు వినియోగం పెరగడమే.. గంజాయితో సహా డ్రగ్స్ సరఫరా కూడా పెరుగుతోంది. అసలు డ్రగ్స్ దందాకు విశాఖ కేరాఫ్ గా మారుతోందా అనే భయం పెరుగుతోంది. దేశంలో ఎక్కడ డ్రగ్స్ గ్యాంగ్ పట్టుబడ్డా ఆ మూలాలు విశాఖలోనే ఉంటున్నాయి.. ఆంధ్రప్రదేశ్ లో మత్తు కలకలం అనే వార్తలు వినిపిస్తే.. అందులో విశాఖ పేరే ముందు వస్తోంది. అంతేకాదు వివిధ రూపాల్లో విశాఖలో మత్తు పదార్దాలు బయట పడుతున్నాయి. ఆ మధ్య చాక్లెట్ల రూపంలో మత్తు పదార్దాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా నిత్యావసర సరుకులు, పండ్లు, వ్యవసాయ ఉత్పత్తుల మాటున గుట్కా, జర్దా, భంగ్ వంటి వాటిని స్మగ్లర్లు అక్రమ రవాణా చేస్తారు. అయితే పోలీసులకే దిమ్మతిరిగేలా లహరి మనుక్య ఆయుర్వేదం పేరిట మందుల డబ్బాల్లో భంగ్ చాక్లెట్లను ఉంచి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఆ విషయం ఇంకా మరవకముందే.. ఇప్పుడు ఇంజెక్షన్లు (drug injection) వెలుగులోకి రావడం కలకలం రేపాయి.
తాజాగా విశాఖపట్నంలో మత్తు ఇంజక్షన్లు అనధికారికంగా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఖరగ్ పూర్ లో నిషేధిత మత్తు ఇంజక్షన్లను 1300 రూపాయలకు కొనుగోలు చేసి విశాఖప ఒక్కొక్కటి 6000 రూపాయలకు అమ్ముతు పట్టుబడ్డారు. అయితే వారు ఇప్పటికే చాలా ఇంజక్షన్లు అమ్మి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఇంకా ఎవరికైనా అమ్మారా..? కొన్నవారు ఎవరు..? అసలు ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి.. అన్న విషయాలపై పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖనగరంలోని లీలామహల్, భీమిలి ప్రాంతాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి నాలుగు బాక్సుల మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి సర్జరీ చేసే రోగులకు ఇచ్చే మత్తు ఇంజక్షన్లు అని అనుమానిస్తున్నారు. ఇలా రోగులకు అమ్మాల్సిన వాటిని.. యువతుకు అమ్ముతున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే వీరు ఇలా మత్తు ఇంజక్షన్లు అమ్మడం ఇదే తొలిసారా..? గతంలో ఎవరికైనా అమ్మారా.. ఇంకా ఈ దందా వెనుక ఎవరు అయినా..? ఉన్నారా..? అసలు ఆ మత్తు ఇంజక్షన్లు ఎక్కడ నుంచి వీరికి వచ్చాయి..? ఇప్పటికే మత్తు ఇంజక్షన్లు ఎవరైనా కొన్నారా.. ఈ దందా ఎప్పటి నుంచి సరఫారా చేస్తున్నారు..? కేవలం ఇవి రోగులకు ఇచ్చే మత్తు ఇంజక్షన్లేనా.. లేక వాటిలో ఇంకేమైనా మిక్స్ చేశారా.. ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Drugs case, Visakhapatnam