VISAKHAPATNAM ANDHRA PRADESH CRICKET ASSOCIATION START A CRICKET LEAGUE FROM JUNE 22ND ON WORDS NGS
APL: ఐపిఎల్ ముగిసిందని నో టెన్షన్.. ఏపీఎల్ సిద్దం.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కు బీసీసీఐ అనుమతి.. ప్రత్యేకత ఏంటంటే?
ఆంధ్ర ప్రిమియర్ లీగ్ కు సర్వం సిద్ధం
APL: ధనాధన్ క్రికెట్ తో పూర్తి వినోదం పంచిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. అయితే టోర్నీ ముగిసిపోతోంది.. తరువాత మళ్లీ బోర్ అని ఫీల్ అయ్యే.. క్రికెట్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పింది.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ తో సరికొత్త ఫార్మట్ సందడి చేసుందుకు సిద్ధమైంది.. ఈ టోర్నీ ప్రత్యేకత ఏంటంటే..?
Andhra Pradesh Premier League: క్రికెట్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ (Good News to Cricket Fans).. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి చేస్తోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్ కు చేరగా.. రెండో ఫైనల్ బెర్త్ కోసం బెంగళూర్, రాజస్థాన్ లు పోటీ పడుతున్నాయి. తొలి సీజన్ లో అనూహ్యంగా చాంపియన్ గా నిలిచిన.. రాజస్థాన్ తరువాత ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు.. ఇప్పుడు టైటిల్ పై కన్నేసింది. అయితే అందుకు రెండు అడుగు దూరంలో ఉంది. మొదట బెంగళూర్ ఛాలెంజర్స్ పై విజయం సాధించి ఫైనల్ కు చేరాలి. అప్పుడు టైటిల్ కోసం గుజరాత్ పోటీ పడే అవకాశం వస్తుంది. ఇక ఇప్పటి వరకు ట్రోఫీ నెగ్గని రాయల్ బెంగళూర్ ఛాలెంజర్స్ తొలి కప్పుపై కన్నేసింది. మరి ఈ రోజు ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో రెండో ఫైనలిస్ట్ ఎవరు అన్నది తేలిపోనుంది. ఏదీ ఏమైనా ఈ ఆదివారం జరిగే ఫైనల్ తరువాత.. ఈ మహాసంగ్రామానికి ఎండ్ కార్డు పడుతుంది. దీంతో ఇన్నాళ్లూ వినోదం పంచిన క్రికెట్ లీగ్ ముగియడంతో ఫ్యాన్స్ బోర్ ఫీలవుతారు.. అయ్యో క్రికెట్ సమరం ముగిసిందే..? ఎలా అని మదనపడతారు. అలాంటి వారికి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానుల కోసం మరో పోటీ పండగ సిద్ధమవుతోంది. త్వరలోనే మరో క్రికెట్ సమరం ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం పలికింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ లీగ్ జరగనుంది. ఈ విషయాన్ని ఏసీఏ కోశాధికారి ఎస్ఆర్ గోపీనాథ్‌రెడ్డి, ఏసీఏ సభ్యులు ప్రకటించారు. ఐపిఎల్ స్థాయిలోనే ఈ పోటీలను నిర్వహిస్తామని.. క్రికెట్ అభిమానులకు ఏమాత్రం నిరాశకలిగించకుండా చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హామీ ఇస్తోంది. మరోవైపు మంత్రి రోజాపై ఈ క్రికెట్ లీగ్ పై ఆనందం వ్యక్తం చేశారు..
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే.. ఈ క్రికెట్ లీగ్ జూన్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు ఏసీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఏసీఏ కోశాధికారి గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ కు మంచి ఆదరణ ఉందని.. అందుకే టోర్నీ గ్రాండ్ సక్సెస్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐ.పి.ఎల్ కేవలం పురుషులకు మాత్రమే.. కానీ ఈ టోర్నీ మాత్రం పురుషులకు, మహిళలకు వేర్వేరుగా లీగ్ లను నిర్వహించనుంది. పురుషుల మ్యాచ్‌లు జూన్ 22 నుంచి జూలై 3 వరకు జరుగుతాయని.. మహిళల మ్యాచ్‌లు జూన్ 28 నుంచి జూలై 3 వరకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. పురుషుల మ్యాచ్‌లన్నీ విశాఖ క్రికెట్ స్టేడియంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.