Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY WILL GO VISAKHA DISTRICT FOR ATC TIRES COMPANY INAUGURATION NGS VSP

CM Jagan: నేడు అచ్యుతాపురానికి సీఎం జగన్ దంపతులు.. ఏటీసీ టైర్స్ యూనిట్ ప్రారంభం.. త్వరలోనే మరిన్ని

నేడు అచ్యుతాపురానికి సీఎం జగన్

నేడు అచ్యుతాపురానికి సీఎం జగన్

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. పరిశ్రమలు రావడం లేదనే విమర్శల నేపథ్యంలో.. నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఏసీటీ టైర్స్ యూనిట్ లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. మరోవైపు మరికొన్ని పరిశ్రమలకు భూమి పూజ చేయనున్నారు. గత కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే ఇంటికి కూడా వెళ్లనున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  AP CM Jaganmohan Reddy: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి.. ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పనున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) ల్లో ఆయన నేడు పర్యటించనున్నారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరి.. 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ (Vizag Airport) కు సీఎం చేరుకుంటున్నారు. అక్కడ పార్టీ నేతలను కలిసిన తరువాత.. 10.40–12.30 గంటల వరకు అనకాపల్లి జిల్లా (Anakapalli District) అచ్యుతాపురానికి చేరుకుని.. అక్కడ ఏపీ సెజ్‌లో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యూనిట్ (ATC Tires AP Private Limited), ఉత్పత్తులు ప్రారంభించనున్నారు. దానితో పాటు అక్కడే మరికొన్ని పరిశ్రమలకు భూమి పూజ చేయనున్నారు. దీంతో ఏపీ పరిశ్రమలు రావడం లేదనే విమర్శలను తిప్పి కొట్టనున్నారు. రాబోయే పరిశ్రమల ద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

  జపాన్ కు చెందిన యోకహామా గ్రూప్ నకు చెందిన ఏటీసీ టైర్ల పరిశ్రమను ఇక్కడ దాదాపు 100 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. 1,500 కోట్ల అంచనా వ్యయంతో ప్లాంట్ ను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా తోలి యూనిట్ సిద్ధమైంది. ఈరోజు సీఎం చేతుల మీదుగా ఈ యూనిట్ ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ దాదాపు 2,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించింది.  ముఖ్యంగా వ్యవసాయం, మైనింగ్‌లో ఉపయోగించే వాహనాలకు టైర్లను కంపెనీ తయారు చేస్తుంది. అదనంగా 1,000 కోట్ల రూపాయలను వెచ్చించి, మరో 1,000 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా విస్తరణకు వెళ్లాలని యోచిస్తోంది. సీఎం  పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజుతో కలిసి రాష్ట్ర
  పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పరిశీలించారు.

  ఇదీ చదవండి: ఉప్పుతో గ్లోబుపై భారత మాత చిత్రం.. ఉప్పొంగిన దేశ భక్తి

  100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న యోకహామా కంపెనీ 6 ఖండాల్లో 120 దేశాల్లో విస్తరించి ఉంది. మన దేశంలో ఇప్పటికే తమిళనాడులోని
  తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో ఏటీసీ టైర్ల మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను నెలకొల్పింది. అచ్యుతాపురం యూనిట్‌ మూడోది. ఇక ఏపీ
  సెజ్ ప్రాంగ‌ణంలో సీఎం జ‌గ‌న్ ప‌లు నూత‌న యూనిట్లకు భూమి పూజ చేయ‌నున్నారు. ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్ తో పాటు.. వాటర్‌
  ప్రూఫింగ్‌ ఉత్పత్తుల తయారీ, కోటింగ్, సీలెంట్స్‌ తదితర ఉత్పత్తుల తయారీ యూనిట్‌ విస్తరణకు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు.
  మేఘ ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కార్బొనేటెడ్‌ ప్రూట్‌ డ్రింక్స్, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్, ప్రూట్‌ జ్యూస్‌ల టెట్రా ప్యాకింగ్, పెట్‌ బాటిల్స్‌
  తదితర ఉత్పత్తుల బెవరేజెస్‌ యూనిట్‌ను సెజ్ లో నెలకొల్పనున్నారు.

  పరిశ్రమలకు భూమి పూజ ముగిసిన వెంటనే.. 12.40 గంటలకు అచ్యుతాపురం నుంచి విశాఖపట్నం బయలుదేరి వెళ్లనున్నారు. గత కొంతకాలంగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే ఇంటికి వెళ్లనున్నారు.. మధ్యాహ్నం 1.10 గంటలకు మర్రిపాలెంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ నివాసానికి చేరుకుంటారు.

  ఇదీ చదవండి: నేటి నుంచి వెంకటేశ్వర స్వామి వైభవోత్సావాలు.. బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

  ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలు ఏమీ లేవు. వాసుపల్లి గణేష్ కుమారుడికి ఇటీవలే వివాహమైంది. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం జగన్‌ ఆశీర్వదించనున్నారు. మరోవైపు సమయం కుదిరితే.. పార్టీలో తనకు ఎదురవుతున్న సమస్యలపై అధినేత జగన్ కు గణేష్ వివరిస్తారని తెలుస్తోంది. ఆ తరువాత మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ నుంచి తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు. 3.00 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Investers, Visakha

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు