Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY SERIOUS ON GAS LEAKAGE ISSUES IN VIZAG NGS VSP

CM Serious: విషవాయువు లీకేజీ ఘటనలపై సీఎం జగన్ సీరియస్.. సంచలన ఆదేశాలు

బ్రాండిక్స్ ప్రమాదంపై సీఎం జగన్ సీరియస్ (twitter)

బ్రాండిక్స్ ప్రమాదంపై సీఎం జగన్ సీరియస్ (twitter)

CM Jagan Serious on Gas leak: ప్రముఖ పర్యాటక జిల్లాగా పేరొందిన విశాఖలో వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. తరచూ గ్యాస్ లీకేజీలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీరియస్ అయ్యారు.. వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
  CM Jagan Serious on Viskha Gas leakage Issue: ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ పర్యాటక జిల్లాగా విశాఖ గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు ఇక్కడ వరుస విష వాయువు లీకేజీ ఘటనలు భయపెడుతున్నాయి. ఏడాది కాలంలోనే ఆరేడు ఘటనలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా అచ్యుతాపురంలోని సెజ్ నుంచి ఎక్కగా హెచ్చరికలు అందుతున్నాయి. తాజాగా  అచ్యుతాపురం సెజ్ (Atchutapuram) లో సీడ్స్ కంపెనీ (Seads) విషవాయువు లీకేజీ (Gas Leakage) ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సీరియస్ అయ్యారు. సీఎం ఆదేశాలతో మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minster Gudivada Amarnath) ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వమే వారి ఆస్పత్రి ఖర్చులను పెట్టుకుంటుందని చెప్పారు. అలాగే సీఎం జగన్ ఆదేశాల మేరకు వెంటనే సీడ్స్ కంపెనీని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సీడ్స్ ఫ్యాక్టరీ తెరవకూడదని ప్రభుత్వం తరపున ఆయన స్పష్టం చేశారు.

  అచ్యుతాపురం స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ (సెజ్‌)లో ఉన్న సీడ్స్‌ దుస్తుల కంపెనీలో విషవాయువు లీకేజ్ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. అసలు ప్రమాదానికి కారణం ఏంటి..? భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా అన్నదానిపై.. విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు సీఎం జగన్.  ముఖ్యంగా ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి..  ప్రమాదానికి ప్రధాన  కారణం ఏంటి..? యాజమాన్యం నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది.. భవిష్యుత్తులో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు. పొరపాటున ప్రమాదం జరిగితే.. కంట్రోల్ చేసేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఇలాంటి వాటిపై పరిశీలించి.. పూర్తి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.

  ఇదీ చదవండి : ఇద్దరు న్యాయవాదుల మధ్య చిచ్చు రేపిన బెయిల్ పిటిషన్.. మహిళా న్యాయవాది ఏం చేసిందంటే..?

  ఈ సెజ్ లో ఇప్పటికే పలుమార్లు గ్యాస్‌ లీకై పలువురు ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.  తాజాగా మంగళవారం జిల్లాలోని అనకాపల్లి పరిధిలోని అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్‌ అపెరిల్‌ సిటీ పరిధిలో మరోసారి సీడ్స్‌ పరిశ్రమలో విష వాయువు లీకైంది. విష వాయువును పీల్చిన మహిళా ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 100 మంది దాకా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురరైనట్లు సమాచారం.

  ఇదీ చదవండి : సముద్ర తీరంలో వింత జీవి.. అది ఎంత డేంజరో తెలుసా?

  విష వాయువును పీల్చిన కారణంగా వీరంతా వాంతులు, విరేచనాలకు గురై స్పృహ తప్పి పడిపోయారని తెలిసింది. పరిస్థితిని గమనించిన కంపెనీ యాజమాన్యం అస్వస్థతకు గురైన మహిళలను హుటాహుటీన ఆసుపత్రులకు తరలించారు.

  ఇదీ చదవండి : ఈ చిత్రం చూశారా? అన్ సీజన్ లో చెట్టు నిండా గుత్తులు.. గుత్తులుగా మామిడి కాయలు.. ప్రత్యేకత ఏంటంటే?

  గతంలో కూడా ఇదే కంపెనీలో విష వాయువు లీకేజీ ఘటన జరిగింది. దానిపై విచారణ కొనసాగుతోంది. అది జరుగుతుండగానే, మరోసారి ప్రమాదం జరగడం దురదృష్టకరం అని అన్నారు మంత్రి అమర్నాథ్. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత సీడ్స్ కంపెనీయే వహించాలని అన్నారు.  విషవాయువు లీకేజీ సంఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు.

  ఇదీ చదవండి : తిరుమల శ్రీవారిని కూడా వదలరా? మా వాటా మాకివ్వాల్సిందే? కేంద్రంపై విజయసాయి ఫైర్

  రెండు నెలల క్రితం ఇదే కంపెనీలో ఇలాంటి ఘటన జరిగిందని, ఇప్పుడు మరో ఘటన జరగడం దురదృష్టకరం అని అంటున్నారు మంత్రి అమర్నాథ్. గత ప్రమాదంపై ప్రభుత్వం వేసిన కమిటీ ప్రాథమికంగా ఆ కంపెనీలో కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు తేల్చింది. ప్రస్తుతం ప్రమాదానికి అసలైన కారణం తెలిసే వరకు దాన్ని మూసి ఉంచుతామని అంటున్నారు మంత్రి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag gas leak

  తదుపరి వార్తలు