హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: సీఎం జగన్ రేపటి విశాఖ టూర్ రద్దు.. రాజశ్యామల యాగానికి దూరం.. కారణం ఏంటో తెలుసా..?

Breaking News: సీఎం జగన్ రేపటి విశాఖ టూర్ రద్దు.. రాజశ్యామల యాగానికి దూరం.. కారణం ఏంటో తెలుసా..?

రేపు విశాఖకు సీఎం జగన్

రేపు విశాఖకు సీఎం జగన్

Breaking News: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపటి విశాఖ టూర్ రద్దు అయ్యింది. అత్యవసరంగా టూర్ ను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆయన హస్తిన వెళ్తున్నట్టు సమాచారం..

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18. 

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నం వెళ్లాల్సిన టూరు  చివరి నిమిషంలో రద్దైంది.. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం..  ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు విశాఖ చేరుకుంటారని.. అక్కడి నుంచి నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి ఉదయం 11 గంటలకు చేరుకుని వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారని అధికారులు షెడ్యూల్ ప్రకటించారు.  తాజాగా ఆ షెడ్యూల్ రద్దు అయినట్టు సీఎంఓ ప్రకటించింది.  రేపు అత్యవసరంగా ఢిల్లీ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా... రెండు రోజులు ముందుగానే వెళ్లేందుకు సిద్ధంకావడం ఉత్కంఠ రేపుతోంది. ఏపీ సీఎం వైఎస్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ నెల 30న ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న జగన్, ఆ టూర్ ను కాస్త ముందుకు జరుపుకున్నట్లు తెలుస్తోంది.

అయితే అత్యవసరంగా ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొన్ని కీలక పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ను ముందుకు జరుపుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో ఆయన సడన్ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి సీఎం జగన్ శుక్రవారం గుంటూరు జిల్లా పొన్నూరు, అలాగే హైదరాబాద్ లో టూర్లు ప్లాన్ చేసుకున్నారు.  కానీ అర్ధాంతరంగా రద్దుచేసుకున్నట్లు నిన్న రాత్రి ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. దీంతో సీఎం జగన్ ఈ రెండు టూర్లు ఇంత అర్ధాంతరంగా ఎందుకు రద్దు చేసుకున్నారనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

ఏపీలో రాజకీయ పరిణమాల నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఎందుకు సీఎం హస్తినకు వెళ్తున్నారు అన్నదానిపై అధికార పార్టీ వర్గాలు స్పష్టం చేయడం లేదు. కారణం ఏమైనా..? ఈ నెలాఖరులో ఢిల్లీ వెళ్లాల్సిన జగన్ రెండు రోజుల ముందుగానే కేంద్రంలో పెద్దల్ని కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే చివరి నిమిషంలో తన షెడ్యూల్డ్ టూర్లు రద్దు చేసుకుని హస్తిన వెళ్తున్నట్టు లుస్తోంది. ఇవాళ ఢిల్లీ నుంచి అపాయింట్ మెంట్ ఖరారైతే జగన్ టూర్ ఖరారవుతుంది.

ఇదీ చదవండి : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి భారీగా బంగారం.. నగదు డిపాజిట్లు.. విలువ ఎంతో తెలుసా?

మరోవైపు  విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.  ఉత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతోంది. వైదిక కార్యక్రమాలతో పీఠ ప్రాంగణం కళకళలాడుతోంది. ఐదు రోజులపాటు సాగే ఉత్సవాలకు శుక్రవారం మహా గణపతి పూజతో అంకురార్పణ చేసారు. పీఠం ఆధిష్టాన దైవం రాజశ్యామలా అమ్మవారి యాగ క్రతువు కూడా ప్రారంభమైంది.

ఇదీ చదవండి : అరచేతిలో ఇల వైకుంఠం.. టీటీడీ మొబైల్ యాప్ ప్రారంభం..? ఎన్ని ప్రయోజనాలంటే?

రాజస మంత్రంతో హవన పూర్వకంగా ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. మోదుగ పువ్వు తరహా విశేష ద్రవ్యాలను యాగంలో వినియోగిస్తున్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివార్లు యాగశాల ప్రవేశం చేసి క్రతువును ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ యాగం జరుగుతుంది. టీటీడీ నిర్వహణలో శ్రీనివాస చతుర్వేద హవనం కూడా పీఠ ప్రాంగణంలో చేపట్టారు. వేద పండితులు పెద్ద ఎత్తున హవనంలో పాల్గొన్నారు. విద్య, వ్యాపార వృద్ధి కోసం మేధా దక్షిణామూర్తి హోమం నిర్వహించారు.  సీఎం జగన్ ఈ కార్యక్రాలకు హాజరు కావాల్సి ఉండగా.. అత్యవసరంగా టూర్ రద్దు అయ్యింది.                        

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Visakhapatnam

ఉత్తమ కథలు