CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపుపై ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. పార్టీల అధినేతలు ఓ వైపు అభ్యర్థులను ఖరారు చేస్తూనే.. కేడర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇటు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) , అటు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ..? ఇలా ఎవరి ప్లాన్స్ లో వారున్నారు. ముగ్గురు నేతలు తమ తమ పార్టీల కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. వరుస సమీక్షలతో ఎన్నికలకు రెడీగా ఉండాలని మేసేజ్ లు పంపుతున్నారు. సీఎం జగన్ అయితే ఎన్నికలకు 16 నెలలే సమయం ఉంది అంటున్నారు. కానీ విపక్ష నేతలు మాత్రం మరింత ముందుగానే ఎన్నికలు ఉంటాయని భావిస్తున్నారు.
ఏడాదిన్నర మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో తీవ్ర కసతరత్తులు మొదలెట్టారు. ఇందులో భాగంగా మరోసారి ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని వైసీపీ శ్రేణులతో అన్నారు సీఎం జగన్.
మొదట టీడీపీ గెలుచుకున్న నియోజకవర్గాలపైనే ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వైజాగ్ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. వారికి గెలుపు పై దిశా నిర్దేశం చేశారు. మనం అనుకున్న లక్ష్యం ఎందుకు సాధ్యం కాదో మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన జరుగుతోందన్నారు సీఎ జగన్. కుప్పం లాంటి నియోజకవర్గంలో కూడా క్లీన్ స్వీప్ చేశామని జగన్ గుర్తు చేశారు.
కుప్పంలో పని చేసిన స్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి పని చేస్తే.. 175కి 175 సాధిస్తామని భోరసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని, సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం సత్ఫలితాలు ఇస్తోంది అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కార్యకర్తల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని సూచించారు.
మరో 16 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. కార్యకర్తలు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి. సమయం ఉంది కదా అని కార్యకర్తలు ఉదాసీన వైఖరి కనబర్చొద్దని స్పష్టం చేశారు. ప్రతి వార్డులో, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆశీస్సులు తీసుకోవాలన్నారు. మనం అద్భుతమైన పాలన అవసరం. గతంలో ఎన్నడూ లేని విధంగా లబ్దిదారుల ఖాతాల్లోకే నగదు వేస్తున్నాం. మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు అర్థమయ్యేలా ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నాం.. ఇలాంటప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేం అనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలి అన్నారు. మీ పని మీరు చేస్తే.. తన పని తాను చేస్తాను అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చామని, చేసిన పనులను గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో మీ భాగస్వామ్యం ఎంతో అవసరం అని కార్యకర్తలకు సూచించారు జగన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Visakhapatnam