హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: ప్రధాని ముందే మూడు రాజధానుల ప్రస్తావన..? మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

CM Jagan: ప్రధాని ముందే మూడు రాజధానుల ప్రస్తావన..? మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

ప్రధాని ముందే మూడు రాజధానుల ప్రస్తావన

ప్రధాని ముందే మూడు రాజధానుల ప్రస్తావన

CM Jagan: అందరూ ఊహించినట్టే సీఎం జగన్ చెప్పాలి అనుకున్నది సూటిగా చెప్పేశారు. అది కూడా ప్రధాని ముందే.. వికేంద్రీ కరణకు కట్టుబడి ఉన్నామని.. ఆ దిశగానే పాలన సాగిస్తున్నామన్నారు జగన్.. మరి రాజధానిగా విశాఖకు మోదీ ఆమోదం కూడా ఉందా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

CM Jagan:  విశాఖపట్నం (Visakhapatnam)లో ప్రధాని మోదీ (PM Modi) పర్యటన  ఈ సారి అత్యంత ఆసక్తికరంగా మారింది. అందుకు ప్రధాన కారణం మూడు రాజధానుల అంశమే.. రాష్ట్ర బీజేపీ నేతలు,. గతంలో ఏపీకి వచ్చిన కొందరు జాతీయ నేతలు, కేంద్రమంత్రులు సైతం అమరావతి (Amaravati) నే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మాత్రం.. వికేంద్రీకరణే ముద్దు అని చెబుతూ వచ్చింది. మూడు రాజధానుల (Three Capitals) ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం జగన్, ఇతర కేబినెట్ మంత్రులు పదే పదే ఇదే మాట చెబుతున్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధానికి త్వరలోనే అడుగులు పడుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.

దీనికి కేంద్ర ప్రభుత్వం మద్దతు లేదని విమర్శలు ఉన్నాయి. అందుకే ఆ ఆరోపణల నుంచి బయట పడేలా ప్లాన్ చేశారు సీఎం జగన్ .. ప్రస్తుతం విశాఖలో ఉన్న ప్రధాని మోదీ ముందే మూడు రాజధానులు అంశం ప్రస్తావిస్తే.. మోదీ ఎలాంటి అభ్యంతరం  చెప్పరని..  దీంతో మూడు రాజధానులకు కేంద్రం మద్దతు ఉందని ప్రజలకు చెప్పే అవకాశం దొరుకుతుందని సీఎం జగన్ లెక్క అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

అందరూ ఊహించినట్టే ప్రధాని సభపైనే మూడు రాజధానులపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు.. వికేంద్రీకరణ దిశగా పాలన సాగిస్తున్నామంటూ.. పరోక్షంగా మూడు రాజుధానులే మా ప్రధాని నినాదమి సంకేతాలు ఇచ్చారు. అది కూడా ప్రధాని మోదీ ముందే.. అయితే  నేరుగా ఎక్కడా అయిన మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురాలేదు.. రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు ఇలా పరోక్షంగా వీకేంద్రీ కరణపై మోదీ సభలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. ఏ రోజు ఏ సేవ అంటే..?

వికేంద్రీకరణ.. పారదర్శకత్వ పాలనే తమ విధానమని పరోక్షంగా మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రస్తావిస్తే.. ప్రధాని మోదీ మాటలు కూడా సీఎం జగన్ వ్యాఖ్యలను సమర్ధించేలానే సాగాయి. విశాఖను పరిపాలన రాజధానిగా ఏపీ ప్రభుత్వం చెబుతుంటే.. ప్రధాని సైతం విశాఖ పై పొగడ్తల వర్షం కురిపించారు. దేశానికి ముఖ్య వ్యాపార కేంద్రంగా విశాఖ మారింది అన్నారు. దేశానికి ఒక విశిష్ట నగరంగా విశాక గుర్తింపు పొందింది అంటూ ప్రధాని తన మనసులో మట బయట పెట్టారు. ఇన్ని అర్హతలు ఉన్న విశాఖను రాజధాని కాదని ఎలా చెప్పగలం అని పోరక్షంగా మోదీ హింటు ఇచ్చారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. 

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Pm modi, Visakhapatnam

ఉత్తమ కథలు