Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ANAKAPALLI YOUNG MAN DRAWING PAINTINGS WITH TONGUE ATTRACTING MANY PEOPLE FULL DETAILS HERE PRN VSJ NJ

The Tongue Artist: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. ఇంతకన్నా వెరైటీగా ఎవరైనా బొమ్మలు గీస్తారా..?

నాలుకతో బొమ్మ గీస్తున్న వినోద్

నాలుకతో బొమ్మ గీస్తున్న వినోద్

Vizag: సాధారణంగా చిత్రకారులంటే కాన్వాస్, పెయింట్స్, బ్రష్ లు ఉంటే సరిపోతుంది. తమ ఊహలకు రంగులద్ది సరికొత్త చిత్రాన్ని ఆవిష్కరిస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం చాలా డిఫరెంట్. చేత్తో పెయిటంగ్ వేస్తే ఏం గొప్ప అనుకున్నాడో ఏమో.. ఏకంగా నాలుగతో బొమ్మలు గీస్తూ వారెవా అనిపించుకుంటున్నాడు.

ఇంకా చదవండి ...
  S Jagadeesh, News18, Visakhapatnam

  మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలా అని ఓసినిమాలో చెప్పారు. కొందరు కళలను పోషిస్తే.. మరికొందరు కళను బ్రతికిస్తారు. ఇంకొందరు థింక్ డిఫరెంట్ అనే పేరుతో కళకు కొత్త అర్ధం చెబుతారు. సాధారణంగా చిత్రకారులంటే కాన్వాస్, పెయింట్స్, బ్రష్ లు ఉంటే సరిపోతుంది. తమ ఊహలకు రంగులద్ది సరికొత్త చిత్రాన్ని ఆవిష్కరిస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం చాలా డిఫరెంట్. చేత్తో పెయిటంగ్ వేస్తే ఏం గొప్ప అనుకున్నాడో ఏమో.. ఏకంగా నాలుగతో బొమ్మలు గీస్తూ వారెవా అనిపించుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనకాపల్లి జిల్లా (Anakapalli District) బలిఘట్టం గ్రామానికి చెందిన సుర్ల వినోద్‌(18) తన అద్భుత ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. నాలుకతో గోడలమీద, పేపర్‌ల మీద బొమ్మలు గీస్తూ అబ్బురపరుస్తున్నాడు.

  చిన్ననాటి నుంచి డ్రాయింగ్‌ మీద ఉన్న ఆసక్తితో…క్లాస్‌రూమ్‌లో బుక్స్‌పై, ఇంటికొచ్చాక గోడల మీద ఏదో ఒక బొమ్మలు గీస్తూ ఉండేవాడు. తాను అందరిలో భిన్నంగా ఉండాలని మొదటి నుంచి తాపత్రయపడుతూ ఉండేవాడు. అలానే తనకిష్టమైన పెయింటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాడు.

  ఇది చదవండి: ఈయన చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది.. వ్యర్థానికి కూడా అర్ధమిస్తాడు..


  అందుకు తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ఎంతో ఉపయోగపడింది. కొత్తగా ఏముంటుందని ఆన్‌లైన్‌లో చూస్తుంటే.. ఒకరోజు యూట్యూబ్‌లో ఓ ఆర్టిస్ట్‌ నాలుకతో బొమ్మలు గీయడం కనిపించింది. ఇలా కొత్తగా చేస్తే తనకంటూ ఓ గుర్తింపు వస్తుందని మెల్లగా నాలుకతో బొమ్మలు వేయడం మొదలు పెట్టాడు. అది చూసిన గ్రామంలో యువకులు, పెద్దలు వినోద్‌ని అభినందించారు. వినోద్‌ ఆసక్తిని తన తల్లిదండ్రులతో పాటు గ్రామంలోని వాళ్లు కూడా ప్రోత్సహించారు.

  ఇది చదవండి: పోలవరంలో అద్భుతం.. అది అషామాషీ శివలింగం కాదు.. పురావస్తు శాఖ ఏం చెప్పిందంటే..!


  దేవుడు బొమ్మలు , దేశం కోసం ప్రాణ త్యాగం చేసి మరణించిన మన స్వాతంత్ర సమరయోధులు బొమ్మలు నాలుకతో గీస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. అంతేకాదు పొలిటికల్‌ లీడర్స్‌, అబ్దుల్‌ కలాం ఆజాద్‌..మొన్నా మధ్య ప్రధాని మోదీ బొమ్మ కూడా గీసి అందరి మన్ననలు పొందాడు.

  ఇది చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే టమాటా.. ప్రభుత్వం కీలక నిర్ణయం


  ఎన్నో అవార్డులను
  ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న వినోద్‌….స్థానికంగా కొన్నిచోట్ల పెయింటింగ్ కాంపిటేషన్స్‌ లో (painting competition) తన ప్రతిభను చూపి అవార్డులు సొంతం చేసుకున్నాడు. హైదరాబాదుకు చెందిన కపిలపట్నం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్ లో నిర్వహించిన నేషనల్ చిల్డ్రన్ ఆర్ట్ హంట్(National children art hunt) పోటీల్లో పాల్గొన్న ఈ యువకుడు covid 19 పై సందేశాత్మక చిత్రం గీసి.. ప్రతిభ అవార్డును సొంతం చేసుకున్నాడు. కరోనాతో అతలాకుతలమైన దేశాన్ని భారతమాత తీవ్రరూపం దాల్చకుండా కట్టడి చేయగలిగిందని వినోద్ ఆ చిత్రం ద్వారా తెలియజేశాడు.

  ఇది చదవండి: పీఏగా పెట్టుకుంటే అందరి నోళ్లూ మూయిస్తా.. సీఎంను కోరిన విద్యార్థి.. జగన్ ఏమన్నారంటే..!


  2021 సంవత్సరంలో ఐకాన్ అవార్డు
  తన నాలికని కుంచెగా మలచుకొని అద్భుత కళాఖండాలను సృష్టించాడు. విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కి వినోద్ పంపిన చిత్రాలకు… స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ 2021 అవార్డుకు ఎంపికయ్యాడు.

  ఇది చదవండి: ఈ హోటల్ కు కరెంట్ బిల్లు రానే రాదు.. పైగా ప్రభుత్వమే డబ్బులిస్తుంది..!


  యూట్యూబ్‌లో పెయింటింగ్‌ వీడియోలు
  మన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలంటే ఇప్పుడు సోషల్‌ మీడియాను మించిన మంచి ఫ్లాట్‌ఫ్లామ్‌ లేదు. అందుకే తాను నాలుకతో వేస్తున్న పెయింటింగ్‌లను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి వినోద్‌ టాలెంట్‌ లోక్‌ల్‌లోనే కాదు అందరికి తెలిసింది. వినోద్ మాట్లుడుతూ… ‘’చిన్నప్పటినుండి అనేక చిత్రాలు గీసినప్పటికీ పెద్ద గుర్తింపు ఏమి దొరకలేదు. అలా అందరిలా కాకుండా ఏదైనా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా డిఫరెంట్‌గా పెయింటింగ్‌ చేయడం మొదలుపెట్టాను. జాతీయ, ప్రపంచ స్థాయికి వెళ్ళే దిశగా ఇంకా బాగా మెలుకువలు నేర్చుకుని ముందుకు వెళ్తాను.” అని చెప్పాడు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు