Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ANAKAPALLI WOMAN DONATED COMMUNITY FRIDGE TO SUPPORT HUNGRY PEOPLE FULL DETAILS HERE PRN VSP

Vizag News: ఈ పెద్దావిడ సంకల్పం చాలా గొప్పది.. అభాగ్యుల ఆకలి తీర్చే గొప్ప ఆలోచన..

కట్టమూరి వరలక్ష్మి

కట్టమూరి వరలక్ష్మి

Anakapalle: అన్ని దానాలకంటే అన్నదానం మిన్న అంటారు. అన్నార్తులకు ఆకలి తీర్చడం మినహా ప్రపంచంలో ఎవరికీ ఏ తృప్తి ఉండదు. అన్నం పెట్టేటప్పుడు.. అవతలి వ్యక్తి ఆకలి తీరేటప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి ఓ ఆలోచనతో.. సమాజానికి ఏదో చేద్దామనే ఉద్దేశంతో ఓ పెద్దావిడ ముందుకొచ్చింది.

ఇంకా చదవండి ...
    P Anand Mohan, News18, Visakhapatnam

    అన్ని దానాలకంటే అన్నదానం మిన్న అంటారు. అన్నార్తులకు ఆకలి తీర్చడం మినహా ప్రపంచంలో ఎవరికీ ఏ తృప్తి ఉండదు. అన్నం పెట్టేటప్పుడు.. అవతలి వ్యక్తి ఆకలి తీరేటప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి ఓ ఆలోచనతో.. సమాజానికి ఏదో చేద్దామనే ఉద్దేశంతో ఓ పెద్దావిడ ముందుకొచ్చింది. తన నెలవారీ ఫింఛన్ డబ్బుతో ఓ పెద్ద ఫ్రిజ్ కొని ఒక సెంటర్ లో ఉంచింది. ఆ ఫ్రిజ్ నిర్వహణ బాధ్యత తనే తీసుకుంది. అందులో కూరలు, పండ్లు, ఆహారం పెట్టొచ్చని చెబుతోంది. విశాఖ జిల్లా అనకాపల్లిలో కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఇప్పుడు స్థానికంగా పాపులర్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) లో అనకాపల్లి ఒక నియోజకవర్గం. ఇప్పుడు ఏకంగా అనకాపల్లి ఓ జిల్లాగా మారింది. ఒకప్పటి బెల్లంపల్లి నేడు అనకాపల్లి అయ్యింది. బెల్లానికి ఫేమస్ అయిన అనకాపల్లి దాతృత్వానికి కూడా ఫేమస్ అవ్వబోతోంది.

    అనకాపల్లి సెంటర్లో కమ్యునిటీ ఫుడ్ ఫ్రిడ్జ్ ఏర్పాటుతో చాలామంది అన్నార్తులకు ఆకలి తీరే మార్గం దొరికింది. అనకాపల్లి జిల్లా కేంద్రం నిత్యం ప్రజల రాకపోకలతో ఉంటుంది. అటు ఏజెన్సీకి ఇటు మహా విశాఖ నగరపాలక సంస్థకు ఇదే సెంటర్. దీంతో చాలా మంది ఇక్కడ నుంచీ రాకపోకలు సాగిస్తారు. ఇక్కడకి వచ్చి వెళ్లే వారికి అన్ని సందర్భాల్లోనూ ఆహారం దొరికే అవకాశం ఉండుదు. అలాగే పేదలకు.. ఆ పూటకు ఆహారం కావాల్సిన బాటసారులకు కూడా ఇక్కడ ఆహారం కష్టమే. ఇలాంటి వారి కోసమే ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు.

    ఇది చదవండి: సండే వస్తే మటన్ లాగిస్తున్నారా..? ఈ సీన్ చూస్తే ముక్క ముట్టరు..! 


    అనకాపల్లి ప్రాంతానికి చెందిన కట్టమూరి వరలక్ష్మి ఈ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. వరలక్ష్మి కుమారుడు కట్టమూరి బాబ్జితో ఈ ఆలోచనకి సపోర్ట్ చేశారు. ఈ ఆలోచన రాగానే ఆయన వంతుగా ఫ్రిడ్జ్ కొనుగోలు.. ఇతరత్రా ఏర్పాటుకు సహకరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫీస్ ఎదురుగానే ఈ ఫ్రిడ్జ్ పెట్టారు. మున్సిపల్ కమిషనర్ కనకమహాలక్ష్మి వీరిని ప్రోత్సహించి.. కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఫ్రిడ్జ్ ఏర్పాటు వల్ల.. చాలా మందికి ఉపయోగం ఉంటుందని వరలక్ష్మి అన్నారు. ఎవరైనా ఆహారాన్ని వృధా చేయకుండా ఇక్కడ ఫ్రిడ్జ్ లో ఉంచితే కావాల్సిన వారు ఇక్కడ నుంచీ వీటిని తీసుకోవచ్చని అంటున్నారు.



    అయితే ఆహారం పాడవకుండా మాత్రమే ఫ్రిడ్జ్ లో పెట్టాలని అంటున్నారు. ఎంతోమంది రోడ్లమీద అనాధలుగా ఆకలితో తిరిగే వారు ఉన్నారని.. పేదలు ఎక్కువగా ఆకలితో అలమటిస్తున్నారని వరలక్ష్మి అన్నారు. అలాంటి వాళ్ల కోసమే తినే పదార్థాలు ఫ్రిడ్జ్ ప్రారంభించామని చెప్పారు. ఇందులో ఎవరికి నచ్చిన ఫుడ్డు వారు తీసుకోవచ్చు. ఎవరికి నచ్చిన ఫుడ్డు వారు ఇందులో పెట్టవచ్చు. 24 గంటలు అందుబాటులో ఉంటుందని అన్నారు. అలాగే ప్రజలకు కావాల్సినంత మంచి పదార్థాలు తీసుకొని తినవచ్చని.. తినే ముందు మాత్రం అవి ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలని వరలక్ష్మి సూచించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు