హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: అక్కడ రోడ్లపై చేపలు పడుతున్నారు..! దీని వెనుక స్టోరీ వేరే ఉంది..!

Vizag: అక్కడ రోడ్లపై చేపలు పడుతున్నారు..! దీని వెనుక స్టోరీ వేరే ఉంది..!

అనకాపల్లిలో అధ్వానంగా మారిన రోడ్లు

అనకాపల్లిలో అధ్వానంగా మారిన రోడ్లు

అనకాపల్లి జిల్లా (Anakapalli District) లో కారో.. బైకో ఎక్కి రోడ్డు మీదకొస్తే అంత సౌకర్యవంతంగా ప్రయాణించే రోడ్లు ఉండే పరిస్థితులు లేవు. అంతేకాదు వాటిపై ప్రాణాలకు కూడా గ్యారెంటీ ఉండటం లేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Anakapalle, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  అనకాపల్లి జిల్లా (Anakapalli District) లో కారో.. బైకో ఎక్కి రోడ్డు మీదకొస్తే అంత సౌకర్యవంతంగా ప్రయాణించే రోడ్లు ఉండే పరిస్థితులు లేవు. తారు రోడ్డులో తారు అంతా కొట్టుకుపోయి.. పైకి రోడ్డుమీద చెల్లాచెదురైన కంకరతో.. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గుంతలు దర్శనం ఇస్తున్నాయి. ఓ రెండు, మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు వాహనానికే కాదు అందులో ప్రయాణిస్తున్నవారికి కూడా ఆరోగ్యానికీ దెబ్బే అన్నంత ప్రమాదకరంగా ఈ రోడ్లు అన్ని మారిపోయాయి. పలుచోట్ల జిల్లా వ్యాప్తంగా ద్విచక్రవాహనంపైనే కాదు.. కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఈ గుంతల్లో నీళ్లు నిండటంతో.. మనం ప్రయాణం చేసేది రోడ్డు మీదేనా? నదిలోనా అన్న అనుమానం వచ్చేలా జిల్లాలో చాలాచోట్ల రహదారులు ఘోరంగా మారాయి.

  అనకాపల్లి జిల్లా చోడవరం నియోజక వర్గంలో వర్షాకాలంలో బురద మయంగా మారిన రహదారులు...వర్షాలు తగ్గాక పెద్ద పెద్ద గుంతలతో దర్శనమిస్తున్నాయి. ఆ రహదారిలో ప్రయాణించేందుకు వాహనదారులు అనేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజూ ఆ దారుల్లో ప్రయాణించడం వలన ప్రయాణికుల వారు ఒళ్లు గుల్లవుతోంది.

  ఇది చదవండి: దుర్గమ్మకు 108 కొబ్బరికాయలు కొట్టిన రోజా.. మంత్రిగారి మొక్కు అందుకే..!

  చోడవరం పట్టణంలో రోడ్లపై భారీ గుంతల వలన ప్రజలు పడుతున్న కష్టాలను వివరిస్తూ టిడిపి మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో రోడ్ల పై చేరిన నీటిలో చేపలు పడుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కేఎస్ఎన్ మాట్లాడుతూ రహదారులపై గుంతలు ఏర్పడటం సహజమని కానీ ఆ గుంతలు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రహదారులపై చెరువులు ఏర్పాటు అయ్యాయని.. ఇంత చేతకాని పరిపాలన తన రాజకీయ జీవితం మొత్తంలో చూడలేదనీ ఆయన అన్నారు.

  ఇది చదవండి: ఏపీకి తుఫాన్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలర్ట్..

  వైసీపీ అసమర్ధ పాలన వలన నిత్యం ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారని ఆయన తెలిపారు.. ప్రతి రోజు అధ్వానంగా తయారయిన ఈ రహదారుల వలన వాహన చోదకులు యాక్సిడెంట్‌ల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. చోడవరం నియోజకవర్గ పరిధిలోని దదాపు అన్ని రహదారులు ఇలాగే తీవ్ర అద్వాన్న పరిస్థితులలో ఉన్నాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కారణం ధర్మ శ్రీ కనీసం శ్రద్ధ చూపకపోవడం అత్యంత దారుణమన్నారు. ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో, ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు ప్రధాన రహదారులు బాగా దెబ్బతిన్నాయి. మండల, గ్రామ రహదారులైతే అంతా ఇంతా కాదు మరీ అధ్వానంగా తయారయ్యాయి. రాత్రివేళల్లో సరిగా కనిపించక నగరవాసులు గుంతల్లోపడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

  జిల్లా వ్యాప్తంగా తాత్కాలిక మరమ్మతులకైనా ఎంతోకంత నిధులు కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాల కలెక్టర్ల నుంచి ప్రతిపాదనలు వెళ్లినా ఏపి సర్కారు అస్సలు పట్టించుకోవడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ నియోజక వర్గంలో బురదతో నిండిపోతున్న రహదారులను అధికారుల పట్టించుకోకపోవడంతో వర్షాకాలం పూర్తయిన తరువాత కూడా మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి. ఇప్పటికైనా త్వరితగతిన గోతులమయంగా మారిన రహదారులు మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు