కాదేదీ కవితకు అనర్హం అన్నారు పెద్దలు.. కొందరు మాత్రం కాదేదీ కళకు అనర్హం అని నిరూపిస్తుంటారు కొందరు. తమకున్న అభిరుచితో దొరికిన ప్రతి వస్తువుతోనూ అద్భుతాలు చేస్తుంటారు అందరితో శభాష్ అనిపించుకుంటారు. క్షణం తీరిక లేకున్నా కాసింత ఆసక్తి ఉంటే మనసు దోచే ఎన్నో అందమైన ఆకృతులు తయారుచేయవచ్చునని అనకాపల్లి జిల్లా కొత్తకోట గ్రామానికి చెందిన ప్రకాష్ నిరూపిస్తున్నాడు. ప్రకాష్ మెడికల్ షాపు నిర్వహిస్తూనే ఖాళీ సమయాల్లో అగ్గి పుల్లలు, ఖాళీ మందుల పెట్టెలు, ఐస్ క్రీమ్ పుల్లలు,వెదురు పుల్లలతో అందమైన కళాకృతులను తయారు చేస్తున్నాడు. అందంగా తయారు చేసిన కళాకృతులు ఇంటికి మరింత శోభనిస్తాయని చెబుతున్నాడు. చిన్నపాటి వస్తువులతో, పడవలు, అపార్ట్ మెంట్లు, తాజ్ మహల్, చార్మినార్ కట్టడాల నమూనాలను తయారుచేశాడు. వాటిని అద్దాల్లో అందంగా అమర్చి ఉపయోగిస్తున్నారు.
వెదురుపుల్లలతో అందమైన కళాకృతులు
వెదురు రేకులతో అందమైన ఆకృ తులను మొదట చిన్న చిన్న రైళ్లు, విమానాలు, కార్లు, పూరిల్లు తయారుచేసేవాడు. మెడికల్ షాపులో తీరిక వేళ తయారీ లో సిటీ, లండన్ బ్రిడ్జి ఇలా ఎన్నో అందమైన వస్తువులు తయారుచేశాడు. వాటితో పాటు ఓ అందమైన స్మార్ట్ విలేజీ నమూనాను రూపకల్పన చేశాడు. విశాలమైన రోడ్లు, సిగ్నల్ వ్యవస్థ, చిన్న కాలనీ, అందమైన పార్కులతో ఉన్న ఓ గ్రామ వాతావరణం కల్పించే ఆకృతి రూపొందించారు.
బంధువులకు, ఫ్రెండ్స్‌కు బహుమతులు
వివాహ సమయంలోను, పండుగ రోజుల్లో గుర్తుగా వాటిని స్నేహితులకు, బంధు వులకు అందించి వారి ప్రశంసలు అందుకునేవాడు. ఇటీవల నర్సీపట్నంలో జరిగిన చిత్ర కళా ప్రదర్శనలో ఆయన తయారుచేసిన వస్తువులను ప్రదర్శించి అవార్డు అందుకున్నారు. హైస్కూల్, కళాశాలల్లో ప్రదర్శించి విద్యార్థులకు వీటి తయారీపై ఆసక్తి కలిగిస్తున్నాడు.
ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా శిక్షణ ఇస్తా
సరదాగా మొదలైన ఈ తయారీ ప్రస్తుతం తనకెంతో సంతోషాన్నిస్తుందని, సంఘంలో గౌరవంతో పాటు గుర్తింపు వచ్చిందన్నాడు. ఆసక్తి ఉన్నవారికి ఉచిత శిక్షణ అందిస్తానని ప్రకాష్ ఈ సందర్భంగా తెలిపారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.