Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ANAKAPALLE JAGGERY MARKET FACING CRISIS DUE TO THESE REASONS FARMERS SEEKS GOVERNMENT HELP FULL DETAILS HERE PRN VSP

Andhra Pradesh: చేదెక్కుతున్న బెల్లం.. 120ఏళ్ల చరిత్ర ఉన్నా వీడని సంక్షోభం.. ప్రభుత్వం ఆదుకుంటుందా..?

సంక్షోభంలో అనకాపల్లి బెల్లం మార్కెట్

సంక్షోభంలో అనకాపల్లి బెల్లం మార్కెట్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బెల్లంపల్లి ఇప్పటి పిలుపు అనకాపల్లి. ఈ పేరంటనే తియ్యని బెల్లం గుర్తొస్తుంది. ఆ తియ్యదనం అలా నోట్లో నీళ్లూరిస్తుంది. విశాఖపట్నం జిల్లాలో (Visakhapatnam) ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటైన ఈ అనకాపల్లి ఆసియాలో బెల్లం ఎగుమతులకు ఫేమస్. కానీ.. అదే బెల్లంపల్లి ఇప్పుడు సంక్షోభం వైపు నడుస్తోంది.

ఇంకా చదవండి ...
    P. Anand Mohan, Visakhapatnam, News18

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఒకప్పటి బెల్లంపల్లి.. ఇప్పటి పిలుపు అనకాపల్లి. ఈ పేరంటనే తియ్యని బెల్లం గుర్తొస్తుంది. ఆ తియ్యదనం అలా నోట్లో నీళ్లూరిస్తుంది. విశాఖపట్నం జిల్లాలో (Visakhapatnam) ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటైన ఈ అనకాపల్లి ఆసియాలో బెల్లం ఎగుమతులకు ఫేమస్. కానీ.. అదే బెల్లంపల్లి ఇప్పుడు సంక్షోభం వైపు నడుస్తోంది. బెల్లంపల్లి ఇక చరిత్ర అయిపోయే రోజులు ఎంతదూరంలో లేవంటున్నారు స్థానికులు. ఒక్కసారిగా చెరకు సాగు తగ్గడం.. దిగుబడి లేకపోవడం.. వేల ఎకరాల్లో, హెక్టార్ల బెల్లం తయారీ తగ్గిపోవడం కారణాలు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అనకాపల్లి బెల్లం మార్కేట్ ప్రస్తుతం కళా విహీనంగా మారింది..బెల్లం మార్కేట్ కు వచ్చే బెల్లం దిమ్మల సంఖ్య రోజుకు రోజుకు తగ్గిపొతున్నాయి.

    120 ఏళ్ల చరిత్ర
    అనకాపల్లి బెల్లం మార్కేట్ ఏర్పడి దాదాపు 120 సంవత్సరాలు అవుతుంది. మొదట ఈ మార్కెట్ అనకాపల్లీ బాలాజీ పేటలో ఉండేదీ. అక్కడ రద్దీ ఎక్కువ కావడంతో 2002లో టీడీపీ హయాంలో దాడి వీరబద్రరావు ఎమ్మేల్యేగా ఉన్న సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి మార్చారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ మొత్తం విస్థీర్ణం 32 ఎకరాలు ఉంది. ఈ భూమిని ఎకరాకు రెండు లక్షల చొప్పున చెల్లించి రైతుల వద్ద నుంచి సేకరించారు. నర్సీపట్నం, అనకాపల్లి, మాడుగుల, యలమంచిలి, చోడవరం, పెందుర్తి నియోజక వర్గాల పరిధిలో వేలాధి హెక్టార్లలో చెరకు పంట పండిస్తారు రైతులు. దీన్ని దృష్టిలో పెట్టుకోనే ప్రత్యేకంగా బెల్లం మార్కెట్ అనకాపల్లిలో ఏర్పాటు చేశారు. పండించిన పంటను బెల్లంగా మార్చి 13, 15, 18 కేజీల బెల్లం దిమ్మెలుగా మార్చి మార్కెట్ కు తీసుకువస్తారు రైతులు.

    ఇది చదవండి: డేంజర్ జోన్ లో కొల్లేరు... మార్పు రాకుంటే కష్టం... నిపుణులు ఏమంటున్నారంటే..!


    ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
    ఇక్కడ నుంచి రాష్ర్టంలోని ఇతర జిల్లాలతో పాటుగా అటు తెలంగాణ, ఇటు పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ర్టాలకు ఎగుమతులు అవుతాయి. అందుకనే అనకాపల్లి బెల్లం మార్కెట్ ను షుగర్ బౌల్ ఆఫ్ ఏపీ గా పిలుస్తారు. దేశంలో బెల్లం ఎగుమతులలో రెండో స్థానంలో అనకాపల్లి బెల్లం మార్కెట్ ఉండేది. జిల్లాలో బెల్లంకు ఉన్న అవశ్యకతను గుర్తించిన ప్రభుత్వాలు అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంధ్రంలో ప్రత్యేకంగా చెరకు దాని మీద వచ్చే ఉత్పత్తులను పెంచడానికి ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. రైతులు మార్కెట్ కు తీసుకు వచ్చిన బెల్లాన్ని స్పెషల్, ప్యూర్ వైట్, గులాబి, ఛాలు, బ్లాక్, చితికిన బెల్లం గా గ్రేడింగ్ చేస్తారు.

    ఇది చదవండి: టీటీడీ కొత్త నిర్ణయం వర్కవుట్ అవుతుందా..? ఉద్యోగుల రియాక్షన్ ఏంటి..?


    మొదలైన సీజన్
    ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి ఏప్రెల్ వరకూ బెల్లం మార్కెట్ సీజన్. రైతులు పండించిన చెరకును గానుగల్లో బెల్లంగా మార్చి మార్కెట్లకు తీసుకు రావడం జరిగుతుంది. అయితే అనకాపల్లి మార్కెట్‌లో బెల్లం లావాదేవీలు ఏటేటా తగ్గిపోతున్నాయి. గత కొద్ది ఆర్థికసంవత్సరాల నుంచి మార్కెట్‌ చరిత్రలోనే నిరాశను మిగిల్చింది. సాధారణంగా ఏటా రూ.150 కోట్ల వరకూ లావాదేవీలు ఉంటాయి. రూ.వంద కోట్ల మేర జరిగాయంటే బెల్లం ఉత్పత్తి తగ్గినట్లే. అలాంటిది 2018–19 ఆర్థిక సంవత్సలంలో కేవలం రూ. 91.08 కోట్లకే పరిమితం కావడం మార్కెట్‌ వర్గాలను కలవరపరుస్తోంది. జిల్లాలో చెరకు సాధారణ సాగు విస్తీర్ణం 45వేల హెక్టార్లు. అయితే ప్రస్తుతం 34వేల హెక్టార్లకు పడిపోయింది. ఒక వైపు రైతులకు గిట్టుబాటు కాకపోవడం, చెరకు పంటకు పసుపు తెగులు వ్యాపించడం సమస్యకు కారణం. మార్కెట్‌లో తెల్ల బెల్లాన్ని మొదటి రకంగా భావిస్తారు. దీని తయారీలో సల్ఫర్‌ వినియోగం ఉంటోందంటూ ఫుడ్‌ కంట్రోల్‌ అధికారుల దాడులతో రైతులు, వర్తకులు ఇబ్బంది పడుతున్నారు. అలాగని నల్లబెల్లం తయారు చేస్తే ధర పడిపోతోంది.

    ఇది చదవండి: విద్యార్థులకు ఆంధ్రా యూనివర్సిటీ షాక్.. ఈ కోర్సులకు గుడ్ బై..! కారణం ఇదే..!


    పడిపోతున్న దిగుబడులు
    చెరకు వంగడాలను రూపొందించినప్పుడు హెక్టార్‌కు 150 టన్నులు ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హెక్టార్‌కు కొన్ని ప్రాంతాల్లో 75 టన్నులు, మరికొన్ని చోట్ల 50 టన్నులకు మించడం లేదు. ఇక బెల్లం దిగుబడి కూడా బాగా తగ్గిపోతోంది. అనకాపల్లి మార్కెట్‌కు 2011–2012లో 8.17లక్షల క్వింటాళ్ల బెల్లం వచ్చింది. ఇదే రికార్డు. ఇక వ్యాపార పరంగా 2016-17 సీజన్ లో అత్యధికంగా రూ 146 కోట్ల వ్యాపారం జరిగింది. గత ఆర్ధిక సంవత్సరంలో కేవలం 16.64 లక్షల దిమ్మలు మాత్రమే అమ్మాకానికి వచ్చాయి. చెరకు సాగు తగ్గడం, పంటకలు పసుపు తెగులు సోకడంతో పాటు కారోనా కారణంగా యార్డుకు వచ్చే చెబ్లం దిమ్మలు తగ్గుతున్నాయి. గతంలో సీజన్ సమయం ప్రారంభంలో మొదటి మూడు నెలల్లోనే 20 లక్షలకు పైగా బెల్లం దిమ్మలు అమ్మకానికి వచ్చేవి. ఈ సారి ఏడాది పొడవునా అమ్మకాలు చేపట్టినా అంత సరకు యార్డుకు రాకపోవడం గమనార్హం. గత ఆర్ధిక సంవత్సరంలో కేవలం 16 లక్షల దిమ్మెలు మాత్రమే రావడంతో రూ 77.53 కోట్ల వ్యాపారం సాగింది. గత సీజన్ తో పోల్చుకుంటే రూ 1.21 కోట్లు తక్కువ. గత పుష్కర కాలంలో ఇంత తక్కువ వ్యాపారం జరగడం ఇదే తోలిసారి.

    ఇది చదవండి: విశాఖలో లండన్ ఐ.. ఏపీ ప్రభుత్వం ప్రణాళిక.. సీఎం జగన్ ఆదేశాలు..


    సెస్ నుంచి తప్పించుకునేందుకు సిండికేట్
    మార్కెట్ కు రాకపోవడానికి ప్రధాన కారణం. ఇటీవల కాలంలో రైతుల వద్దకు నేరుగా వెళ్లి వ్యాపారుకు బెల్లం కొనుక్కుంటున్నారు. దీంతో బెల్లం మార్కేట్ కు ఎవ్వరూ రావాడం లేదు. సాధారణంగా రైతులు బెల్లం మార్కేట్ కు వచ్చి బెల్లం అమ్మితే వచ్చిన ధరలో 100 రూపాయలకు రూపాయి వంతు మార్కెట్ కటిటీకి సెస్(సుంకం) రూపంలో వ్యాపారులు కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు లక్షరూపాయాల వ్యాపారం చెస్తే మార్కేట్ కు వెయ్యి రూపాయలు సెస్ రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఆ సెస్ ద్వారా వచ్చే అధాయం మీదనే మార్కెట్ కమిటీ దానిలోని 25 మంది కుటుంభాలు అధారపడి జీవిస్తున్నాయి. ఈ సెస్ నుంచి తప్పించుకోవడానికి వ్యాపార్ధులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి బెల్లం కొనుక్కుంటున్నారు. ఇదే సమయంలో బెల్లం కు ప్రత్యామ్నాయంగా వాడుతున్న బెల్లం పౌడర్ మహారాష్ర్ట నుంచి ఇటీవల కాలంలో భాగా దిగుమతి అవుతుంది. గత ఏడాది వెయ్యి లారీలకు పైగా దిగుమతి జరిగినట్లు తెలుస్తుంది. పౌడర్ రావడం వల్ల స్థానికంగా ఉన్న బెల్లాన్ని ఎవ్వరూ కొనడం లేదు. పోనీ నల్ల బెల్లబెల్లం తయ్యారు చెయ్యాడినికి దానికి ధర లేదు.

    ఇది చదవండి: ఆ పోస్ట్ ఆఫీస్ లో అందరూ మహిళలే.. చిటికెలో పనులు చక్కబెట్టేస్తారు..


    దశాబ్ధాలుగా ఓ వెలుగు వెలిగిన అనాకాపల్లి బెల్లం మార్కెట్ పరిస్థితి ఇది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అనకాపల్లిలో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంధ్రంలో బెల్లం ఉత్పత్తులపై పరిశోధనలు సాగుతున్నా వాటిని సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేవు. బయట నుంచి వచ్చే బెల్లం పౌడర్ కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు ఎక్కువగా మార్కెట్ కు వచ్చే అకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో అనకాపల్లి బెల్లానికి జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ చంద్రన్న కానుక కోసం అవసరమైన బెల్లాన్ని సరఫరా చేసే టెండర్‌ను గుజరాత్‌ వర్తకులకు అప్పగించారు. ఇక్కడే అసలు సమస్య ప్రారంభం అయింది. ఇటీవల కేంధ్ర ప్రభుతక్వం కొత్తగా తీసుకు వచ్చిన సాగుచట్టాల ప్రకారం దేశంలో రైతు పండించిన దాన్నిదేశంలోని ఎవ్వరైన కోనుక్కునే అకాశం ఉంది..కోనుగోలులు అన్ని ఆన్ లైన్ పద్దతిలో జరిగాలని కేంధ్ర ప్రభుత్వం అదేశాలు జారీ చెసిందిదాంతో అనకాపల్లీ బెల్లం మార్కెట్ లో కూడా ఆన్ లైన్ ద్వారా బెల్లం ట్రెడింగ్ చెయ్యాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అటు రైతులు ఇటు వర్తకులు తీవ్ర స్థాయిలో తమ అభ్యంతరాలను రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడం జరిగింది.

    ఇది చదవండి: జీవీఎంసీ కమిషనర్ బదిలీ వెనుక రాజకీయహస్తం..? అందుకే పంపించేశారా..?



    అన్ లైన్ ట్రేడింగ్ తో ఇబ్బందులు
    ఆన్లైన్ ట్రేడింగ్ కాబట్టి వ్యాపారులంతా సిండికేట్ గా మారే అవకాశం ఉంది అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మన రైతులు పెట్టుబడి దారుల వద్ద పెట్టుబడులు తీసుకొని దానితో వ్యవసాయం చేస్తారు అనకాపల్లి బెల్లం వ్యాపారుల దగ్గర నుంచి రైతులు పెట్టుబడులకు డబ్బులు తీసుకొని దానిద్వారా వ్యాపారం చేయడం జరుగుతుంది గత కొన్ని దశాబ్దాలుగా రైతులకు వ్యాపారులకు ఒక రకమైన బంధం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం కొత్త గా తీసుకొచ్చిన విధానం వల్ల ఇప్పుడు ఆ అవకాశం లేదు. దీంతో గతకొద్దికాలంగా బెల్లం రైతులు మార్కెట్లో వ్యాపారం చేసే వర్తకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.

    ఇది చదవండి: భూమిలో నుంచి వింత శబ్ధాలు.. హడలిపోతున్న ఊరిజనం.. దెయ్యాలు పగబట్టాయా..?


    తగ్గిపోతున్న బెల్లం రాక
    వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న మార్కెట్ కు ఇంత తక్కువ సరకు రావడం ఇదే తోలిసారి 1987-88 సీజన్ లో 84.63 లక్సల దిమ్మలను విక్రయించారు.1997-98 మధ్య 35.89 లక్షలు, 2007-08లో 37.46 లక్షల దిమ్మెలు, 2017-18లో 22.13 లక్షల దిమ్మెలు, 2018-19లో 22.62 లక్షలు, 2019-20లో 16.85 లక్షల దిమ్మెలు మార్కెట్ కు రాగా.., 2020-21 ఆర్ధిక సంవత్సరంలో కేవలం 16.64 లక్షల బెల్లం దిమ్మెలు మాత్రమే అనకాపల్లి మార్కెట్ కు వచ్చాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Agriculture, Andhra Pradesh, Visakhapatnam

    తదుపరి వార్తలు