Setti Jagadeesh, News 18, Visakhapatnam
హిందూ సాంప్రదాయ పండగ (Hindu Traditinal Festivals) ల్లో ఒక్కొక్క పండగకు ఒక్కో విశిష్ట ఉంటుంది. కొన్ని పండగలు స్వామి వార్లకు విశిష్టతైతే మరికొన్ని జాతరలకు ప్రసిద్ధి. అమ్మవారి జాతర పేరు చెప్పగానే మొట్టమొదట గుర్తు కొచ్చేది ఘటలా ఊరేగింపు, సూలాల ధారణ. ఇదే సమయంలో నిప్పుల గుండం కూడా తొక్కటం మనం చూస్తుంటాం. కొత్త అమావాస్య సందర్బంగా విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) లో జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తారు. అలా నిప్పులు గుండం తొక్కితే పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు అవుతాయని, పెళ్లి అయ్యి పిల్లలు వారికి పిల్లలు పుడతారని, కోరికలు నెరవేరుతాయి అని, కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకం. తరతరాలుగా ఈ ఆచారం వస్తుందని అంటున్నారు భక్తులు. జిల్లాలో ప్రతీయేటా జరిగే ఎంతో విశిష్టత గల ఈ జాతరలో అందరూ ఆనందంగా గడుపుతారు.
అక్కడి ప్రజలు బంధువులను, స్నేహితులను ఉత్స వాలకు ఆహ్వానించుకుంటారు. ఊరంతా సందడినెలకొంటుంది. జాతరకు వచ్చినవారు, తమ కోర్కెలు నెరవేర్చుకునేందుకు దైవాన్ని మొక్కి నిప్పులు గుండం తొక్కేందుకు ఎగబడతారు. శూలాలు గుచ్చుకొనిఅగ్ని గుండం తొక్కారు భక్తులు.
తెల్లవారుజాము నుండి మొదలైన ఈ జాతర అమ్మవారి ఘటాలను ఊరేగింపు చేసి భక్తులందరూ నిప్పుల గుండం తొక్కి అమ్మవారిని దర్శించుకుని వెళ్లడం జరుగుతుంది. హిందూ సనాతన దర్మంలో అమ్మవారు కొలువై ఉందని చాటి చెప్పటానికి శూలాలు గుచ్చి , ఈ అగ్ని గుండం కార్యక్రమం నిర్వహించారు.ఈ జాతర మహోత్సవాల సందర్బంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam