Setti Jagadeesh, News 18, Visakhapatnam
అంగన్వాడీ (Anganwadi Centres) కేంద్రాలలో ఉంటున్న బరువు తక్కువగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju District Collector) కలెక్టర్ సుమిత్ కుమార్ అంగన్వాడీ సిడిపిఒ(CDPO) లను, సూపర్వైజర్లను ఆదేశించారు. చిన్నారులు బరువు పెరగక పోవటానికి కారణాలను విశ్లేషించి తదనుగుణంగా పోషకాహారాన్ని అందించాలని, అవసరమైతే డాక్టర్ల సహాయం తీసుకోవాలని., అటువంటి వారిని కొన్ని దినాలు ఆసుపత్రిలో ఉన్న పౌష్టికాహార పునరావాస కేంద్రంలో ఉంచి పౌష్టికాహారం అందించాలన్నారు. సూపర్వైజర్లు ప్రతి వారంలో కనీసం ఐదు రోజులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి ఆయా గ్రామాలలో కొంత సమయం వారితో గడపాలని, వారికి అవసరమైన సూచనలు అందించాలని, చిన్నారులకు తల్లి పాలు పట్టే విధానం, పొజిషన్ వివిరించి అవగాహన కల్పించాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాలలో స్టాక్వెరిఫై చేయాలని, ప్రతి రోజు వంట వండుతున్నదీ లేనిదీ పరిశీలించాలని ఆదేశించారు. సూపర్వైజర్లు గ్రామాలను సందర్శించే తేదీలు ముందుగానే షెడ్యూల్ వేసుకుని, దాని ప్రకారం పర్యటించాలని, అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలపై ఆరా తీయాలని, అంగన్వాడీ కేంద్రాలలో కొన్ని రోజులు వంట చేయటం లేదని దృష్టికి వచ్చినందున, కేంద్రాలకు ఎంతమంది వస్తున్నారు.
ఎంతమందికి వంట చేస్తున్నారు అనేది పరిశీలించాలన్నారు. వారు తీసుకొచ్చే సరుకు నాణ్యత కూడా చెక్ చేయాలని ఆయన తెలిపారు. అంగన్వాడీలకు రాలేనిబాలింతలు, గర్భిణీలకు టేక్ హోమ్ రేషన్ అందించాలని తెలిపారు. గత సమావేశంలో అంగన్వాడీ కేంద్రాల సందర్శన ఫోటోలను తీయాలన్న ఆదేశాల అమలును ఆయన పరిశీలించారు. ఆయా కేంద్రాల సూపర్వైజర్లు తీసుకున్న ఫోటోలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ బరువున్న పిల్లల బరువులను ఒక రిజిస్టర్ లో నమోదు చేయాలని, ఒక నెల రోజులు వ్యక్తిగతంగా పర్యవేక్షించి నెల తరువాత బరువును పరిశీలిస్తే ఖచ్చితంగా పెరుగుతుందని, ఐతే పర్యవేక్షణ చేస్తూ, పౌష్టికాహారం తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శిక్షణా కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్య లక్ష్మి, పాడేరు డివిజన్ సిడిపిఓలు, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam