హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Paiditalli ammavari Panduga 2022: వనంలో వెలిసిన జనజాతరకు సర్వం సిద్ధం.. సిరిమానోత్సవం చరిత్ర తెలుసా?

Paiditalli ammavari Panduga 2022: వనంలో వెలిసిన జనజాతరకు సర్వం సిద్ధం.. సిరిమానోత్సవం చరిత్ర తెలుసా?

పైడితల్లి అమ్మవారి జాతర ముహూర్తం ఫిక్స్

పైడితల్లి అమ్మవారి జాతర ముహూర్తం ఫిక్స్

Paiditalli ammavari Panduga 2022: వనంలో వెలిసిన దేవత.. ప్రకృతి స్వరూపిణిగా భావించే పైడితల్లి అమ్మవారి పండుగ జన జాతరకు సర్వం సిద్ధమైంది. మరి ఉత్తరాంధ్రప్రజల ఆరాథ్య దైవంగా చెప్పకునే.. పైడితల్లి అమ్మవారి చరిత్ర విన్నా..? తెలుసుకున్నా ఎంతో పుణ్యఫలం వస్తుందన్నది భక్తుల నమ్మకం.. ఈ పెడుగు వెనుక ఉన్న చరిత్ర తెలుసా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vizianagaram, India

Paiditalli ammavari Panduga 2022: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాథ్య దైవం.. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం.. పైడితల్లమ్మ (Paiditalli Ammavaru).. ఆ అమ్మవారి చరిత విన్నా.. తెలుసుకున్నా.. ఎంతో పుణ్యఫలం. ఆ తల్లిని మదిలో స్మరిస్తూ కోర్కెలు కోరితే.. అవి తీరిన కొద్దిరోజుల్లోనే ప్రపంచంలో ఎక్కడున్నా పైడితల్లిని దర్శించుకునేందుకు తరలివస్తారు. అక్కడితో ఆగకుండా ఏటా అమ్మను దర్శించుకోవడానికి తొలేళ్ల నుంచి సిరిమానోత్సవం (Sirimanotsavam) వరకూ ఇక్కడే ఉండి పసుపు, కుంకుమలతో మొక్కుబడులు చెల్లిస్తారు.  మళ్లీ వచ్చి  దర్శించుకుంటామంటూ ప్రకృతి స్వరూపిణిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారు. అంతటి మహిమాన్వితమైన పైడితల్లమ్మ వారి జాతరకు సర్వం సిద్ధమైంది..

ఉత్తరాంధ్రలో  అంబరాన్ని అంటే జాతర ఏదైనా ఉంది అంటే అది పైడితల్లి అమ్మవారి ఉత్సవం.. గత రెండేళ్లు కరోనా కారణంగా ఇబ్బందులు తప్పలేదు. అందుకే ఈ సారి పక్కాగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర ప్రజల ( Uttarandhra People) ఆరాధ్య దైవంగా భావించే ఈ పైడితల్లి అమ్మవారి జాతర (Sri Pydithalli Ammavari) వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ప్రతిఏటా వైభవంగా జరిగే ఉత్సవాలను ఈ ఏడాది కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అయితే ఈ జాతర ఒకటి రెండు కాదు.. సుమారు నెల రోజుల పాటు జరుగుతుంది. ప్రధాన ఘట్టాలైన తోల్లేళ్లు ఉత్సవం అక్టోబర్ 10న అంటే సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. ఇక లక్షలాది మంది భక్తులు ఎదురుచూసే సిరిమాను సంబరం.. అక్టోబర్ 11 న జరగనుంది.

ఇదీ చదవండి : ప్రయాణం వారికి నరకంగా మారింది..? గ్రామస్తుల టెన్షన్ దేనికో తెలుసా..?

అయితే కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా సిరిమాను సంబరం జరపలేకపోయారు. దీంతో ఈ సారి అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు ఆలయ ఈవో. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారు. విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం. సెప్టెంబర్ 21న మొదలయ్యే అమ్మవారి జాతర నవంబర్ 2 వరకు కొనసాగుతుంది. లక్షలాది మంది తరలివచ్చే జాతరకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఇదీ చదవండి : మగువలు మెచ్చే పట్టు చీరలకు ఆ ఊరు పెట్టింది పేరు..! ఆ డిజైన్స్‌ చూస్తే మతిపోవాల్సిందే..!

పైడి తల్లి అమ్మవారి చరిత్ర : మహారాజుల ఇంట ఆ కనకదుర్గమ్మ... పైడితల్లిగా జన్మించింది. ఐతే... ఎప్పుడూ సామాన్యురాలిలా ప్రజల మధ్యే బతికింది. అదే సమయంలో... విజయనగరం, బొబ్బిలి రాజ్యాల మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం వద్దని పైడితల్లి కోరినా... ఎవరూ ఆమె మాట వినలేదు. రెండు రాజ్యాల రాజులూ చనిపోవడంతో... తీవ్ర ఆవేదన చెందిన పైడి తల్లి... పెద్ద చెరువులో దూకి అంతర్థానమైంది. కొన్నాళ్లకు పతివాడ అప్పలనాయుడి కలలో కనిపించిన అమ్మ... తాను చెరువులో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పింది. వెంటనే ఊరంతా వెళ్లి చెరువులో వెతకగా పైడితల్లి అమ్మవారి విగ్రహం కనిపించింది. దాంతో అక్కడే అమ్మవారికి వనం గుడి కట్టి... పూజలు చేస్తున్నారు.

ఇదీ చదవండి : మగువలు మెచ్చే పట్టు చీరలకు ఆ ఊరు పెట్టింది పేరు..! ఆ డిజైన్స్‌ చూస్తే మతిపోవాల్సిందే..

ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో... మూడు లాంతర్ల ప్రాంతంలో మరో పెద్ద ఆలయాన్ని నిర్మించారు. అక్కడ ఏటా ఆరు నెలలు ఉత్సవాలు చేస్తున్నారు. వాటిలో ప్రసిద్ధమైనది సిరిమాను ఉత్సవం. సిరిమాను అనేది చింతలు తీర్చే చింతచెట్టు మాను. పైడి తల్లికి ప్రతిరూపంగా ఆలయ పూజారి సిరిమానుపైకి ఎక్కి భక్తులను దీవిస్తారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Festival, Vizianagaram

ఉత్తమ కథలు