హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

G20 Summit: మరో అంతర్జాతీయ సదస్సుకు సర్వం సిద్ధం..40 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు హాజరు..

G20 Summit: మరో అంతర్జాతీయ సదస్సుకు సర్వం సిద్ధం..40 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు హాజరు..

జీ 20 సమ్మిట్ కు సర్వం సిద్ధం

జీ 20 సమ్మిట్ కు సర్వం సిద్ధం

G20 Meeting: కాబోయే రాజధాని విశాఖ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సమావేశం సూపర్ సక్సెస్ అయ్యింది.. ఇప్పుడు మరో అంతర్జాతీయ సమావేశానికి సిద్ధమైంది.. ఇందులో సుమారు 40కి పైగా వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.. ఇంకా ఈ సదస్సు ప్రత్యేకతలు ఏంటంటే?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.

అందాల పర్యాటక నగరం విశాఖ.. అంతర్జాతీయ నగరంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. వరుస కీలక సమావేశాలకు వేదిక అవుతోంది. త్వరలో విశాఖపట్నం (Visakhapatnam) వేదిక మరో ప్రతిష్టాత్మక సదస్సు జి-20 ఈ నెల కానుందని.. అయితే  28 నుండి 30వ తేదివరకు విశాఖ వేదికగా  నిర్వహించబడుతోందని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు.  మంగళవారం  సాయంత్రం ఎ.యు కన్వేషన్ హాలు  లో  పోలీసు కమిషనర్ సి.హెచ్ శ్రీకాంత్, జి.వి.ఎం.కమిషనర్ పి.రాజాబాబు కలిసి  మీడియా సమావేశంలో పలు సూచనలు చేశారు.  అయితే  జి-20 సదస్సుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ వెల్లడించారు.  ఈ నెల 27వ తేది నుండి వివిద దేశాలకు చెందిన  డెలిగేట్స్ విశాఖ చేరుకుంటారని తెలిపారు.  సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు జి-20 సదస్సులో పాల్గొంటారని అన్నారు

 విశాఖ విమానాశ్రయం (Visakhs Airport) లో  విదేశాల నుండి వచ్చే ప్రతి నిధులకు మన సాంప్రదాయాల ప్రకారం స్వాగత ఏర్పాట్లు చేయుట జరుగుతుందని అన్నారు. 28వ తేదిన  ప్రతినిధుల ప్యానల్ చర్చలు ఉంటాయని అదే రోజు రాత్రి  అతిధులకు గాలా డిన్నర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందులో పాల్గొంటారని  కలెక్టర్ తెలిపారు.

 29వ తేది ఉదయం యోగా, మెడిటేషన్ కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం ప్యానల్ చర్చలు జరుగుతాయన్నారు.  30వ తేది ప్యానల్ చర్చలు అనంతరం  విశాఖ మున్సిపల్ కమిషనర్ ఎంపిక చేసిన  మూడు ప్రాంతాలను  విదేశీ ప్రతినిధులకు సూపించడం జరుగుతుందన్నారు.  31వ తేది ఉదయం  సిటీ ప్లానర్స్, మున్సిపల్ కమిషనర్స్  ఇతర ఉన్నత అధికారులతో  వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందన్నారు.  అదే విదంగా  ఈ నెల 18వ తేది నుండి 26వ తేది వరకు “జన్ భాగీదారీ” కింద వివిద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. 18వ తేది ఉదయం సిటిలో యెగా డ్రైవ్  నిర్వహిస్తామన్నారు.

ఇదీ చదవండి : పిల్లలు, స్త్రీలకు ప్రత్యేక కేటాయింపులు.. నవరత్నాలకు పెద్దపీట.. ఏపీ వార్షిక బడ్జెట్ లెక్క ఇదే..

19వ తేది ఆర్.కె.బీచ్ నుండి 3K, 5K, 10K మారథాన్ లను నిర్వహిస్తారు. ఇందుకోసం ఆన్ లైన్ ద్వారా రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చున్నారు. 22వ తేది మాక్ జి-20 సదస్సు నిర్వహణ, 24వ తేదిన  జి.వి.ఎం .సి ఆద్వర్యంలో  సాగర తీర స్వచ్చతా కార్యక్రమం, 25వ తేదిన ప్రీ ఆర్ట్  కాంటెస్ట్, 26వ తేదిన వైజాగ్ కార్నీవాల్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. 

పోలీసు కమిషనర్ సి.హెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ జి-20 సదస్సు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు 2350 మంది పోలీసు  సిబ్బంది ని వినియోగించడం జరుగుతుందన్నారు.  డెలిగేట్స్  విమానాశ్రయం చేరిన దగ్గర నుండి వారికి ఏర్పాటు చేసిన  వసతి , వారు సందర్శించే ప్రాంతాలలో  సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అదే సమయంలో  సామాన్య ప్రజలకు  ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ తదితర అంశాలపై దృష్టి సారిస్తామన్నారు.

ఇదీ చదవండి : తెలుగు రాష్ట్రాల్లో వైరస్ డేంజర్ బెల్స్.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?

 జి.వి.ఎం .సి మున్సిపల్ కమిషనర్ పి.రాజాబాబు మాట్లాడుతూ ఈ నెల 18వ తేది నుండి 31వ తేది వరకు  వివిద కార్యక్రమాలు నగరంలో జరుగుతున్నందున  ఈ నెల 22 నాటికి నగర సుందరీకరణ పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఇందుకోసం సుమారు  100 కోట్ల వరకు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా  అదనంగా బీచ్ పార్కులను అభివృద్ది చేయడం,  రోడ్లు వేయడం, మొక్కలు నాటడం తదితర నగర సుందరీకరణ కార్యక్రమాలను  యుద్ద ప్రాతిపదికన చేస్తున్నామన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam

ఉత్తమ కథలు