Setti Jagadeesh, News 18, Visakhapatnam
విశాఖపట్నం (Visakhapatnam) లో ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University) గ్రౌండ్లో అఖిల భారత డ్వాక్రా బజార్ లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత బొమ్మలు, వస్త్రాలు, ఆభరణాలు విశాఖ వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆరు రోజుల్లో సుమారు రెండు కోట్ల రూపాయల చేతి వృత్తి కళల అమ్మకాలు చేసి డ్వాక్రా బజార్ తనదైన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఒక్క మంగళవారం నాటి అమ్మకాలే రూ.36,83,097లు చేసింది. ప్రారంభంన ఉంచి ఇప్పటికి జరిగిన ఆరు రోజుల అమ్మకాల గణాంకాలు చూస్తే రూ.1.92,23,548లుకు చేరుకుంది. ఈ విషయాన్ని డీఆర్డిఎ ప్రాజక్టు డైరెక్టర్ శోభారాణి ప్రకటించారు. చేతివృత్తి కళాకారులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. సరస్ - 2022 డ్వాక్రా బజార్ పేరుతో ఏర్పాటైన ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాఅనుకోను ఉన్న శ్రీ పోలమాంబ అమ్మవారి గుడి వెనుక ఉన్న మైదానంలో నిర్వహిస్తున్న అఖిల భారత డ్వాక్రా బజారుకు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోంది.
దేశం నలుమూలల నుంచి హాజరైన స్వయం సహాయక సంఘ సభ్యులకుజిల్లా నలుమూలల నుండి విశేష ఆదరణ. డిసెంబరు 27వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన జనవరి 7వ తేదీ వరకూ జరుగుతోంది. ప్రతి రోజూ ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకూ నిర్వహిస్తున్న ఈ డ్వాక్రా బజార్ ప్రదర్శనలో 218 స్టాల్స్ చోటు చేసుకున్నాయి. విజయవాడ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్కప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి సంస్థ, విశాఖపట్నం ద్వారా నిర్వహిస్తుంది. దేశం నలు మూలల జిల్లా నుంచి స్వయం సహాయక సంఘాలద్వారా 450 మంది పాల్గొంటున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలనుంచివచ్చినస్వయం సహాయక సంఘాల ప్రతినిధులు తమస్టాల్స్ ఇక్కడ కొలువుతీరారు. హర్యానా, తెలంగాణ లెదర్ బ్యాగులు, జార్ఖండ్ దుస్తులు, చిప్స్, ఆకర్షణగా హల్వా, సుగంధ ద్రవ్యాలు, మహారాష్ట్ర కాటన్ దుస్తులు, కాశ్మీర్ చీరలు, పాల్స్, డ్రసెమెటీరియల్స్, ఉత్తర ప్రదేశ్ చొక్కాలు, ఒరిస్సా లేస్ వస్తువులు, మట్టి, వెదురు, చెక్క, బొమ్మలు, ఛత్తీసఘడ్ బెల్ మెటల్ వస్తువులు, బొమ్మలు, చెక్క వస్తువులు, వెస్ట్ బెంగాల్ కాగితం పువ్వులు, అస్సాం కాటన్, సిల్క్ చీరలు, హర్యానా గాజు బొమ్మలు, ఉత్తర్ ప్రదేశ్ ఎంబ్రాయిడరీ దుస్తులు, బీహార్ డ్రసెమెటీరియల్స్, కేరళ వెదురువస్తువులు, ఒరిస్సా గోల్డెన్ గ్రాస్ వస్తువులు, అస్మా వెదురు వస్తువులు, నాబార్డ్, మెప్మా, తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉంచారు. హస్తకళ, ఆహార ఉత్పత్తులూ ఇక్కడ చోటు చేసుకున్నాయి. వివిధ రాష్ట్రాల ఆహార పదార్థాలను విశాఖ వాసులకు అందించే విధంగా ప్రత్యేకంగా ఫుడ్ స్టాలు కూడా ఏర్పాటు చేశారు.
రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, రాయలసీయ, గోదావరి రుచులు ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మాంసాహార ప్రియులకు ప్రత్యేక బిరియానీలు సైతం ఇక్కడ ఫుడ్ స్టాల్లో లభిస్తున్నాయి. స్నేహాంజలి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులను, యువతను అలరించటకు జెయింట్ వీల్, టోరో టోరో, బ్రేక్ డాన్స్ మొదలగు ఎమ్యూనమేంట్ ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam