VISAKHAPATNAM ALL INDIA CRAFT BAZAR IS THE PERFECT SHOPPING DESTINATION IN VISAKHAPATNAM FULL DETAILS HERE PRN VNL NJ
Visakhaptanam: వైజాగ్ లో బెస్ట్ షాపింగ్ స్పాట్ ఇదే.. అక్కడ దొరకనిదంటూ ఏదీ లేదు..
విశాఖలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఆలిండియా క్రాఫ్ట్ మేళా
విశాఖపట్నం (Visakhapatnam) లోని ఆర్కే బీచ్ రోడ్ (RK Beach Road) లో ఉన్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌ను మీరు ఒక్కసారైనా చూడాల్సిందే. అక్కడ మీకు దొరకనిది అంటూ ఏమి ఉండదు.
విశాఖపట్నం (Visakhapatnam) లోని ఆర్కే బీచ్ రోడ్ (RK Beach Road) లో ఉన్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌ను మీరు ఒక్కసారైనా చూడాల్సిందే. అక్కడ మీకు దొరకనిది అంటూ ఏమి ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే హైదరబాద్ (Hyderabad) బేగం జబార్ ఎలాగో విశాఖలో ఈ క్రాప్ట్ బజార్ అలాంటిది. మిడిల్ క్లాస్ వాళ్ల నుంచి హై క్లాస్ వాళ్ల వరకు అందరికి కావల్సినవి ఇక్కడ దొరుకుతాయి. 2017లో ఏర్పాటు చేసిన ఈ క్రాప్ట్ బజార్‌కు నగరవాసులే కాదు విదేశీయులు కూడా వచ్చి సందర్శిస్తారు... షాపింగ్ చేస్తారు. ఈ ఎగ్జిబిషన్ ఏడాది పొడువున 365 రోజులు తెరిచే ఉంటుంది. ఇక్కడ దొరకనిది అంటూ ఏమి లేదు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచే కాకుండా ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, రాజస్థాన్, ఒడిస్సా మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళా వస్తువులు, ఉత్పత్తులు ఇక్కడ అమ్మకానికి ఉంచుతారు. ఇతర రాష్ట్రాల వాళ్లు ఇక్కడే ఉంటూ...వారి ఉత్పత్తులను విక్రయిస్తుంటారు.
చెవిదిద్దుల నుంచి చెక్కతో చేసిన శిల్పాల వరకు..!
కాలేజి అమ్మాయిలకు, యువతులకు నచ్చే ఇయర్రింగ్ కలెక్షన్స్ అయితే చెప్పనక్కర్లేదు. డైలీ వేర్ నుంచి పార్టీవేర్ వరకు .. చెవికమ్మలు, గాజులు, కంఠాభరణాలు.. లేటెస్ట్ రబ్బర్ బాండ్స్, అల్ టైప్స్ ఆఫ్ హైర్బండ్స్ , నెక్లెస్ నుండి హారాలు ... ఇలా ఎన్నో మహిళలు మెచ్చే అలంకార ప్రాయమైన వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. వెరైటీ డిజైన్స్‌తో ఫ్యాషన్ బట్టలు..కుర్తీలు (kurtis), శారీస్, పలజో సెట్స్ (palazo sets), వేస్ట్ కోట్ (waist coat).. కిడ్స్ వేర్, మెన్స్ వేర్ ఇలా అన్ని రకాల బట్టలు ఉన్నాయి. వాటి ధరలు 300 నుంచి ప్రారంభమవుతాయి.
వారెవా అనిపించే వాచ్‌ల కలెక్షన్స్
వాట్ నాట్ అమ్మాయిల మనసు దోచేవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే వాచ్‌ల కలెక్షన్ అయితే అద్భుతమే చెప్పాలి. చాలా మోడల్స్‌లో ఇక్కడ వాచ్‌లు దొరుకుతాయి. తక్కువ ధరలలో చిన్నపిల్లలకి సైతం నచ్చే ఫ్యాషన్ వాచెస్ (watches) కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన రంగు రంగుల కళ్లద్దాలు దొరుకుతాయి.
డ్రీమ్ క్యాచర్స్ (Dream cactcher), కాళ్లకు వేసుకునే చెప్పులు, షూలలో ఎన్నో మోడల్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, పింగాణి సామాగ్రి, మొబైల్ కేసులు, మ్యాగ్నెటిక్ హోల్డర్స్, డిఫరెంట్ కీచైన్స్, కర్టన్స్, సన్ గ్లాసెస్..ఇలా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. స్వయంగా ఊటీ నుంచి వచ్చి మరీ ఇక్కడ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ స్టాల్ పెట్టి అమ్ముతున్నారు.
ఇంట్లోకి అందమైన అలంకార బొమ్మలు
ఇంట్లోకి కావల్సిన అన్ని రకాల డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఫ్లవర్ వాజ్‌లు, కలర్‌ఫుల్ ప్లవర్పాట్స్, హ్యాంగింగ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇంట్లో అందంగా డెకరేట్ చేసుకోడానికి మట్టితో తయారుచేసిన కలంకారీ బొమ్మలు, యాంటిక్ పీస్ బొమ్మలు అద్భుతంగా ఉన్నాయి. చెక్కతో తయారు చేసిన శిల్పాలు అయితే మరింత బాగుంటాయి. మట్టి బొమ్మలు మరియు మట్టి పాత్రలు ఇక్కడ ప్రత్యేకతంగా దొరుకుతాయి.
పిల్లలకు ప్రత్యేక ప్లే స్టేషన్
పెద్దవాళ్లు షాపింగ్ చేస్తున్నా..పిల్లలకు బోర్ కొట్టకుండా ప్లే స్టేషన్ కూడా ఉంది. గన్ షూటింగ్, జంపింగ్ గేమ్స్..పిల్లలు ఆడుకునేందుకు అన్ని రకాల ఫెసిలిటీలు ఉన్నాయి.
స్మోకీ బిస్కెట్స్ ప్రత్యేకం
ఫిష్ పెడిక్యూర్ కూడా అందుబాటులో ఉంది. టాటూ స్టాల్ పర్మినెంట్ లేదా తాత్కాలిక టాటూస్ ఇక్కడ వేస్తారు. స్మోకీ బిస్కెట్స్ ఇక్కడ చాలా ప్రత్యేకం. పిల్లలు, పెద్దలు తినేందుకు అన్ని రకాల ఫుడ్స్ కూడా దొరుకుతాయి.
ఏడాది పొడవునా రద్దీగా ఉండే క్రాఫ్ట్ బజార్
నిత్యం జనాల రద్దీతో ఈ క్రాప్ట్ బజార్ హడావిడిగా ఉంటుంది. ఇక్కడికి కేవలం చూడానికి వచ్చిన వాళ్లైన సరే.. వెళ్లేటప్పుడు ఏదో ఒకటి షాపింగ్ చేయకుండా ఉండలేరు అంటే నమ్మండి. A నుంచి z వరుకు అన్ని ఇక్కడ ఉండడం వలన బీచ్ కి వచ్చిన ప్రతిసారీ.. అందరూ తప్పకుండా ఇక్కడకు వెళ్తుంటారు.
టైమింగ్స్ : 365 రోజులు ఈ క్రాఫ్ట్ బజార్ తెరిచే ఉంటుంది. ప్రతి రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అన్ని షాప్‌లు తెరిచే ఉంటాయి. ఎవరైనా సందర్శించి ఇక్కడ షాపింగ్ చేయవచ్చును.
ఎలా వెళ్లాలి?
వైజాగ్ బస్టాండ్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. 99, 68k, 28 Z/H, 28k, 28H, 66A, 25M బస్సులను ఎక్కితే బీచ్ రోడ్‌కి వెళ్తాం. ఈ క్రాఫ్ట్ బజార్ బీచ్ రోడ్ బస్టాప్‌కి ఎదురుగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.