Setti Jagadeesh, News 18, Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్రులచిరకాల స్వప్నం, నిరుద్యోగుల కోరిక నెరవేరే సమయం వచ్చేసింది. విశాఖపట్నం (Visakhapatnam) కేంద్రంగా ఘనంగా ఏర్పాటుకానున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ కు శంకుస్థాపన ముహూర్తం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) బాధ్యతలు చేపట్టాక మూడోసారి విశాఖపట్నంలో పర్యటన ఖరారైన నేపథ్యంలో కొన్ని శంకుస్థాపన పనులకుశ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నవంబర్ 11నప్రధాని మోదీరూ.వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. దేశ ప్రధాని మోదీపర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డివిశాఖలో రెండు రోజుల పాటు పర్యటిస్తారు.
ఇందులో భాగంగా.. నవంబర్ 11న సీఎం జగన్ (AP CM YS Jagan) విశాఖకు చేరుకుని ప్రధానితో కలిసి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనకు సంబంధించి11వ తేదీ రాత్రి 7 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకోనున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలుకుతారు.
ఐఎన్ఎస్ డేగా నుంచి నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి మోదీ, సీఎం జగన్ చేరుకుంటారు. ఈఎన్సీ అధికారులతో రక్షణ రంగంపై చర్చించి ఆ రోజు రాత్రి అక్కడే బసచేస్తారు. మరుసటి రోజు 12వ తేదీ ఉదయం ఏయూ గ్రౌండ్ కి చేరుకుంటారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఏయూలో జరిగే వేదిక నుంచే పలు కీలక అభివృధి కార్యక్రమాలకు నరేంద్ర మోదీ శ్రీకారం చేస్తారు. అనంతరం ఏయూ గ్రౌండ్ నుండి మ.2 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ప్రధాని ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయల్దేరుతారు.
ప్రధాని మోదీ విశాఖలో ప్రారంభించే ప్రాజెక్టులు..!
విశాఖలో దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయంనిర్మాణానికి ప్రధాని మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ.120 కోట్లతో ఈజోన్నునిర్మిస్తారు. డీఆర్ఎం కార్యాలయం దగ్గరలో వున్న వైర్ లెస్ కాలనీలో ఈ హెడాక్వార్టర్స్ నిర్మిస్తారు. విశాఖ శివారు వడ్లపూడిలో గల రైల్వే అనుబంధ సంబందిత సంస్థ ఆర్ఎన్ఎల్ రూ.260 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యాగన్నుజాతికి అంకితం చేయనున్నారు. ఇక్కడ నెలకు 200 వ్యాగన్లను అంతా పూర్తిస్థాయిలో ఓవర్ హాలింగ్ చేసేలా అంతా నిర్మించారు. విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు రూ. 26 వేల కోట్ల వ్యయంతో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) చేపట్టిన రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టుని కూడా ప్రధాని మోదీ,సీఎంకలిసి ప్రారంభిస్తారు.
గంభీరంలో రూ.445 కోట్లతో మొదటి విడతలో నిర్మించిన విశాఖపట్నం క్యాంపస్నుకూడా ప్రారంభిస్తారు. దీంతోపాటు రూ.380 కోట్లతో ఈఎస్ఐ ఆస్పత్రికి సంబంధించిననిర్మాణానికీ కూడా వారు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇరువురు భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, PM Narendra Modi, Visakhapatnam