Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ALIVE BABY HAD BEEN TRIED TO BURIAL AT VIZAG VRY

vizag crime : దారుణం... బతికున్న శిశువునే పూడ్చిపెట్టు శ్మశానానికి తీసుకువచ్చారు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

vizag crime : దర్జాగా కారులో వచ్చారు..పిల్లాడు చనిపోయాడు ఖననం చేయాలని చెప్పారు.అయితే.. అందుకోసం సిద్దమైన కాటికాపరి షాక్ అయ్యాడు..తీరా వాళ్లు ఇచ్చిన కవర్‌ను విప్పి చూస్తే.. పిల్లాడు ఏడుస్తూ కనిపించాడు..ఏంటని ప్రశ్నించడంతో ఆ నిందితులు అక్కడి నుండి జారుకున్నారు..

ఇంకా చదవండి ...
    మానవత్వం మంటగలిపే సంఘటనలకు చుట్టూ ఉన్న సమాజమే కారణం అవుతుంది..తాము ఎలా పుట్టి ఎలా పెరిగామో మరిచిపోతున్న వారు.. తీరా మానవత్వం లేకుండా వ్వవహరిస్తున్నారు.. దీంతో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి... వాళ్ల అవసరాల కోసం బతికుండగానే ప్రాణాలు తీసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు.. ఇలా ఓ పసికందును కూడా వదలలేదు కొంతమంది దుర్మార్గులు.. ప్రాణంతో ఉన్న పసికందును ఓ కవర్‌లో చుట్టి తీసుకువచ్చారు..అలానే పూడ్చిపెట్టమని అడిగారు.

    కారాణాలు ఏవైనా బతికున్న పసికందును ఓ నలుగురు పెద్ద మనుష్యులు పూడ్చి పెట్టాలని చూసిన సంఘటన విశాఖపట్నంలోని జ్ఝానాపురం శ్మశాన వాటికలో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం విశాఖలోని నలుగురు వ్యక్తులు కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ శ్మశాన వాటికకు క్లాత్‌లో చుట్టిన ఓ శిశువును తీసుకుని కారులో వచ్చారు. పిల్లాడిని ఖననం చేయాలని కాటికాపరిని కోరారు. అయితే వాళ్లు చెప్పినట్టు శిశువు ఖననానికి సిద్దం అయిన సిబ్బంది క్లాత్ తీసి చూడగా ఒక్కసారిగా పిల్లాడి ఏడుపు వినిపించింది. దీంతో శ్మశాన వాటిక సిబ్బంది బతికున్న శిశువును ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించడంతో ఆ నలుగురు అక్కడి నుండి జారుకున్నట్టు వారు తెలిపారు. అనంతరం శిశువును శ్మశాన వాటిక సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించినట్టు చెప్పారు..అయితే ఆసుపత్రి కూడ వారిపై దురుసుగా వ్యవహరించారని వాపోయారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని స్థానిక కంచర పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

    ఇంతకి వాళ్లు బతికుండగానే తీసుకువచ్చారు..లేదా చంపామని అనుకుని పిల్లాడిని తీసుకువచ్చారా అనేది తేలాల్సి ఉంది..పిల్లాడిని తీసుకుని వారు కారులో వచ్చారంటే ఏదైన ఉన్నత వర్గాలకు చెందిన వారై ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు..
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు