Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM AGNIVIR ARMY RALY IN VISAKHAPATNAM ABH NJ VSJ

Vizag: ఈ నెల 14 నుంచి అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌..! ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లు..!

స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

విశాఖపట్నంలో ఈ నెల 14 నుంచి 31 వరకు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని విజయవంతం చేసేలా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డా. ఏ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    (Setti Jagadesh, News 18, Vizag)

    విశాఖపట్నం: ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. విశాఖపట్నంలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని విజయవంతం చేసేలా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డా. ఏ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. ఈ నెల 14 నుంచి 31 వరకు రిక్రూట్‌మెంట్‌ జరగనుంది.

    అదనపు పోలీస్ కమీషనర్ సుమిత్ గరుడ్, ఆర్మీ అధికారులతో కలిసి ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి అన్ని సదుపాయాలు కల్పించాలని.. 24 గంటల పాటు విద్యుత్‌, నీటి సరఫరా కల్పించాలని అధికారులకు సూచించారు. నగరంలో 18 రోజుల పాటు అగ్నివీర్‌ నియామకం జరగనుంది.



    ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి వివిధ జిల్లాల నుంచి హాజరవుతున్న అభ్యర్థులకు, ఆర్మీ అధికారులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్నిఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ర్యాలీకి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

    స్టేడియం మొత్తం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వర్షాల కారణంగా బురదగా ఉన్న రన్నింగ్ ట్రాక్‌ను త్వరగా బాగు చేయాలని…ఆ సమయానికి ఎలాంటి బురద లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. అదే విధంగా స్టేడియం ప్రాంగణంలో నిర్వహిస్తున్న మూడు సచివాలయాలను యథావిథిగా పనిచేసేటట్లు చూడాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ర్యాలీని విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోరారు.

    అగ్నివీర్‌ రిక్రూట్మెంట్‌ ప్రమాణాలు:
    ప్రతిబ్యాచ్‌లో వారి నిర్ణిత వ్యవధిని పూర్తి చేసుకుంటున్న అగ్నివీర్‌కు IA రెగ్యులర్ కేడర్‌లో నమోదుకోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అందించబడుతుంది. ఈ దరఖాస్తులను సైన్యం వారి నిర్ణీత వ్యవధిలో పనితీరుతో సహా అబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా కేంద్రీకృత పద్ధతిలో పరిగణించబడుతుంది. అగ్నివీర్ యొక్క ప్రతి నిర్దిష్ట బ్యాచ్‌లో 25% కంటే ఎక్కువ మంది IA యొక్క సాధారణ కేడర్‌లో నమోదు చేయబడరు.

    సాధారణ కేడర్‌గా నమోదు చేసుకున్న అగ్నివీర్ తదుపరి నిర్ణీత వ్యవధికి 15 సంవత్సరాల పాటు సేవ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న సేవా నిబంధనలు మరియు షరతులు (IA లో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు/ఇతర ర్యాంకులు) ద్వారా నిర్ణయించబడుతుంది. అగ్నివీర్‌ని ఎంపిక చేసుకునే హక్కు ఉండదు.

    నోటిఫికేషన్ ప్రకారం అన్ని నాలుగు సంవత్సరాల సర్వీస్ టర్మ్ ముగింపులో, అన్ని అగ్నివీర్లు విడుదల చేయబడతాయి. వారు "సేవా నిధి" ప్యాకేజీని అందుకుంటారు, ఇది వారు సమాజానికి తిరిగి రావడానికి మరియు ఇతర రంగాలలో పని కోసం వెతకడానికి వీలు కల్పిస్తుంది. వయో పరిమితి.అభ్యర్థుల వయస్సు 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇండియన్ ఆర్మీ అగ్నిపత్ మిలిటరీ రిక్రూట్‌మెంట్ స్కీమ్ కింద అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఇప్పటికే విడుదల చేసింది.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Local News, Visakhapatnam, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు