హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: నేడే విశాఖలో ఉక్కు ప్రజా గర్జన.. హాజరుకానున్న అన్నిపార్టీల నేతలు..!

Vizag: నేడే విశాఖలో ఉక్కు ప్రజా గర్జన.. హాజరుకానున్న అన్నిపార్టీల నేతలు..!

విశాఖ స్టీల్ ప్లాంట్

విశాఖ స్టీల్ ప్లాంట్

నేడే విశాఖలోఉక్కు ప్రజా గర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమంటున్నారు స్థానికులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఇవాళ భారీ కార్యక్రమం నిర్వహించనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ నగరంలోని త్రిష్ణ మైదానంలో"ఉక్కు ప్రజా గర్జన" పేరుతో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు అన్ని పార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలు హాజరుకానున్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు.

విశాఖలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి.. వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్ నాథ్ హాజరుకానున్నారు. టీడీపీ నుంచి ఎంపీ రామ్ మోహన్ నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ రానున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్ నుంచి పీ రాకేష్ రెడ్డి, సీపీఐ నుంచి కె.రామకృష్ణ, సీపీఎం నుంచి శ్రీనవాసరావు, సీపీఐ (న్యూ డెమోక్రసీ) నుంచి కె. వెంకటేశ్వర్లు రానున్నారు. వీరితో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి కొణతాల లక్ష్మీ నారాయణ కూడా ఈ "ఉక్కు ప్రజా గర్జన "సభకు హాజరుకానున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత రెండేళ్లుగా  పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఇవాళ భారీ కార్యక్రమం నిర్వహించనుంది.  32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమని.. స్థానికంగా ఉన్న కార్మికులు, ఉద్యోగులు, మేధావులు కుటుంబాలతో సహా ఈ భారీ సభకు వచ్చి తమ పోరాటానికి మద్దతు పలకాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ జరిగే సభకు పెద్ద ఎత్తున జనం,విశాఖ వాసులు తరలివస్తారని సమాచారం అందుతోంది.

First published:

Tags: Local News, Vizag Steel Plant