టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు యువ నటుడు కె. సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత సమస్యలతో వైజాగ్ లో అతడు సూసైడ్ చేసుకున్నాడు. సుధీర్ వర్మ పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ సినిమాలతో పాటు షూట్ అవుట్ ఎట్ ఆలేరు వెబ్ సీరిస్ లో సుధీర్ కీలక పాత్రలు పోషించాడు. సుధీర్ మరణం జీర్ణించుకోలేనిదంటూ అతని సహ నటుడు, హీరో సుధాకర్ కొమాకుల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
సుధీర్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది. సుధీర్ వర్మ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. మరోవైపు అతని అకాల మరణంతో సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. సుధీర్‌తో పనిచేసిన వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Visakhapatnam, Vizag