• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHAPATNAM A YOUNG MAN TRIED TO SUICIDE IN FRONT OF AP SPEAKER TAMMINENI SEETHARAM IN SRIKAKULAM NGS

Andhra pradesh: చిరంజీవి నాగ్ మోసం చేశారు. ఏపీ స్పీకర్ సభలో యువకుడి ఆత్మహత్యాయత్నం

Andhra pradesh: చిరంజీవి నాగ్ మోసం చేశారు. ఏపీ స్పీకర్ సభలో యువకుడి ఆత్మహత్యాయత్నం

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం(ఫైల్ ఫొటో)

చిరంజీవి నాగ్ తనను మోసం చేశారని శ్రీకాకుళంలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. స్పీకర్ సభకు వెళ్లి.. అందరూ చూస్తుండగానే ఆత్మహత్యకు ప్రయత్నించారు. బ్లేడ్ తో మెడపై గాయపరుచుకున్నారు. ఇంతకీ చిరంజీవి నాగ్ అతడ్ని ఎందుకు మోసగించారు? ఏం జరిగింది.

  • Share this:
    ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లకు సత్కార కార్యక్రమం ఘనంగా సాగుతోంది. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారని సీఎం సహా నేతలంతా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అలా అద్భుత సేవలు అందించిన వాలంటీర్లను జిల్లాల వారిగా గుర్తించి వాళ్లకు ఆయా జిల్లాల్లో సన్మానం చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం సైతం వాలంటీర్ల సత్కార సభకు హాజరయ్యారు. కానీ ఆ సభ మధ్యలో అనూహ్య ఘటన ఆయనకు షాక్ ఇచ్చింది.

    శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో వాలంటీర్లకు పురస్కారాలను ప్రధానం చేసేందుకు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు హాజరయ్యారు. అందులో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఒక్కక్కొకరిగా సన్మానిస్తున్నారు. అయితే సభ మధ్యలోనే 14 వార్డులోని ఐ జె.నాయుడు కాలనీకి చెందిన లొట్ల అనీల్ కుమార్ అక్కడికి వచ్చాడు. వెంటనే స్పీకర్ ను కలవాలంటూ సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అతడ్ని ముందుకు కదలనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సభలో కాసేపు ఉద్రిక్తత కనిపించింది.

    స్పీకర్, మంత్రి ఉన్న సభలో యువకుడు ఇలా దూసుకురావడంతో పోలీసులు భయపడ్డారు. అతడ్ని అక్కడే అడ్డుకుని బయటకు పంపే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ యువకుడు తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్ ను.. జేబులోంచి తీశాడు. అందరూ చూస్తుండగానే మెడ, మణికట్టు భాగాలపై కోసుకుని గాయాలు చేసుకున్నాడు.

    ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బ్లేడ్ దాడితో స్వల్పంగా అనిల్ కుమార్ గాయపడటంతో వెంటనే అతడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనిల్ కుమార్ గతంలో ఆముదాలవలస మున్సిపాలిటీ శానిటరీ వర్కర్ గా అవుట్ సోర్సింగ్ లో పనిచేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఏడాదిన్నర క్రితం అనిల్ కుమార్ ను ఉద్యోగం నుంచి తొలగించారు.

    అప్పటి నుంచి తనకు ఉద్యోగం ఇప్పించాలని తమ్మినేని ఇంటి చుట్టూ తిరుగుతున్నాను అని చెప్పాడు అనీల్ కుమార్. స్పీకర్ , ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ చుట్టూ అనేక సార్లు తిరిగానని.. అయినా న్యాయం జరగలేదన్నారు. చిరంజీవ్ నాగ్ తనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని అనిల్ వాపోతున్నాడు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై అధికార పార్టీ నేతలు ఎవరూ స్పందించ లేదు.
    Published by:Nagesh Paina
    First published: