Setti Jagadeesh, News 18, Visakhapatnam
అతను చదుకుంది ఏడో తరగతే.. చదువు పెద్దగా అబ్బలేదు. అయితేనేం, తనకంటూ ప్రత్యేక గుర్తింపు..తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నాడు. దానికోసం తనకు చేతనైన మార్గాలను అన్వేషించాడు. ప్రస్తుతం వుడ్ బిజినెస్‌లో మంచి లాభాలు వస్తున్నాయని దానిపై దృష్టిపెట్టాడు. అనుకున్నట్లుగానే కంప్యూటర్ ద్వారా వుడ్ డిజైనింగ్ నేర్చుకున్నాడు.. అదే వుడ్ డిజైనింగ్ మిషన్ పెట్టి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. ఇంతకీ ఆ యువకుడి సక్సెస్‌స్టోరీ ఏంటో తెలుసుకుందాం..! కంప్యూటర్ వుడ్ డిజైనింగ్ (Computerized wood designing) అయితేనే నేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ మిషన్ కొని బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేయాలా అని తర్జనభర్జన పడ్డాడు. ఎంక్వైరీ చేశాడు. నర్సీపట్నం పరసర ప్రాంతాల్లో ఎక్కడ లేదు అని తెలుసుకొని స్వస్థలం అయిన అనకాపల్లి (Anakapalli) నుండి నర్సీపట్నం వచ్చి సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ మిషన్ పెట్టడం ద్వారా మంచి గిరాకీ వస్తోందని రాజు తెలిపాడు.
పూర్వం రోజుల్లో వడ్రంగి వాళ్లు చెక్క తలుపులు ఎవరికి కావలసినట్లుగా, ఎవరికి వచ్చినట్లుగా వాళ్లు సొంతంగా చేతులతో రోజుల తరబడి చెక్కేవాళ్లు. ఇంటి తలుపులు, కిటికీలు అన్నిటి మీద డిజైన్లను వాళ్లే తయారు చేసేవారు. టెక్నాలజీ పెరిగే కొద్ది వడ్రంగి పనులు చేసేవారు కనుమరుగు అయిపోతున్నారు. అప్పట్లో పెద్దలు వారికి సంవత్సరానికి కొంత జీతంగా ఇస్తూ పనులు చేయించు కునేవారు కానీ ఇప్పుడు ఆ దాఖలాలు లేవు. కంప్యూటర్ తరం కావడంతో రోజులు మారాయి. ఇప్పుడు ఏ పనులు కావాలి అన్నా ఇట్టే అయిపోతున్నాయి.
ప్రస్తుత ట్రెండ్ తగ్గట్లు ఆలోచించాడు తంగేటి రాజు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణానికి చెందిన రాజు నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో కంప్యూటర్ వుడ్ డిజైనింగ్ ఎక్కడ లేదని తెలిసి ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశాడు. ఎవరికైనా చెక్క పై డిజైన్ కావాలి అంటే ఒక్కరోజులో ఇచ్చే విధంగా మిషన్ అందుబాటులో ఉంచాడు. ఏడో తరగతి చదువుకున్న రాజు చెక్కతో డిజైన్‌పై అవగాహన ఉండటంతో ఇదే వర్క్ కంప్యూటర్ ద్వారా తయారు చేస్తే మంచిగా లాభాలు వస్తాయి అని ఆలోచించి పెట్టాడు. కంప్యూటర్ రాకపోయినా పట్టుదలతో స్నేహితులు వద్ద నేర్చుకొని సొంతంగా వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. నర్సీపట్నం చుట్టుపక్కల ఎవరికి చెక్కపై డిజైన్ కావలసి వచ్చినా రాజు వద్దకే వస్తున్నారు.
తలుపు, కిటికీ, దేవుడి రూమ్ డోర్స్ అన్ని రకాల చెక్క తీసుకొచ్చిన వారు చెప్పిన డిజైన్ బట్టి పది, ఇరవై వేలు, మంచి మంచి డిజైన్స్ బట్టి వాటికి ధర ఉంటుంది. చేత్తో చేసే డిజైన్లు కన్నా కంప్యూటర్‌తో చేసే డిజైన్ నచ్చడంతో అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ డోర్స్‌కు తమకు నచ్చిన డిజైన్‌ను ఆర్డర్స్ ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam