Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM A WOMEN ATTACKED BY ONE VILLAGE PEOPLE BECAUSE SHE CHEAT THEIR NGS VZM

AP Crime News: మహిళను స్తాంభానికికట్టేసి.. కొట్టిన గ్రామస్తులు.. ఎందుకు అలా చేశారో తెలుసా..?

 మహిళను కట్టేసిన గ్రామస్తులు..

మహిళను కట్టేసిన గ్రామస్తులు..

AP Crime News: నిత్యం ప్రశాతంగా ఉండే ఆ గ్రామంలో.. మహిళను తీవ్రంగా శిక్షించారు.. సాధారణంగా ఆ గ్రామ ప్రజలు ఏ తగదాల్లోను తలదూర్చరు.. వారి పని చేసుకుంటూ ప్రశాంతంగానే ఉండడానికి ఇష్టపడతారు.. కానీ తాజాగా ఓ మహిళను అంతా కలిసి ఈడ్చుకెళ్లారు.. స్తంభానికి వేసి కట్టేశారు. అక్కడితో వారి ఆవేశం చల్లారకపోవడంతో తీవ్రంగా కొట్టారు.. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే?

ఇంకా చదవండి ...
    AP Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మారు మూల గ్రామాల్లోనూ ఈ మధ్య నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్థకపరమైన అంశాల్లో మోసాలు భారీగా వెలుగు చూస్తున్నాయి. రూపాయి రూపాయికి కష్టపడి.. రెక్కల కష్టాన్ని.. ఒక దగ్గర పోగేసుకోవాలి అనుకునే వారి ఆశను.. కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. తాజగా అలాంటి భారీ మోసమే వెలుగులోకి వచ్చింది. కొత్తగా ఏర్పడ్డ పార్వతీపురం మన్యం జిల్లా (Parvati Puram Manyam District) కొమరాడ మండలం శివిని గ్రామానికి చెందిన శోభ కొంతకాలంగా చిట్టీలు నిర్వహించేది. ఈ క్రమంలోనే గ్రామంలోని చాలామంది శోభ (Shobha) వద్ద చిట్టీలు వేశారు. చిట్టి డబ్బులు జమ అవుతున్నాయి గానీ, గ్రామస్తులెవరికీ తిరిగి ఇవ్వటంలేదు శోభ. చివరికి వడ్డీ కూడా చెల్లించలేదు.. అందర్నీ తప్పించుకునే తిరుగుతుండేది. గత కొన్ని రోజుల నుంచి దీనిపై కేసు నడుస్తోంది. ఆమె తమను మోసం చేసిందని ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. అయితే చాలా రోజుల నుంచి అందర్నీ తప్పించుకుని తిరుగుతున్న ఆ మహిళ గ్రామస్థులకు కనిపించడంతో (Villagers attacked on women).. వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది..

    అమెను ఒకసారి చూసే సరికి గ్రామస్థులంతా తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఆమెను ఈడ్చుకుని వెళ్లి మరీ.. ఆ మహిళను స్థానికులు స్తంభానికి కట్టేశారు. అక్కడితో వారి కోపం చల్లారకపోవడంతో కొట్టారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కొమరాడ మండలం శివిని గ్రామంలో శోభ అనే మహిళ చీటీల పేరుతో గ్రామంలోని రైతుల నుండి కోటీ యాభై లక్షలు వసూలు చేసింది. తిరిగి వారికి చెల్లింపు చేయకుండా ఇబ్బందులకు గురిచేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, మహిళలు.. శోభను స్ధంభానికి కట్టేశారు. వెంటనే తిరిగి తమ డబ్బులు చెల్లిస్తేనే విడిచి పెడతాం అంటూ హెచ్చరించారు.. తనకు టైం కావాలని అని అడుగుతున్నా.. స్థానికులు విడిచిపెట్టలేదు.  

    ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో అమరావతి నుంచి జగన్ పోటీ..! ఆయనకు వేరే ఆప్షన్ లేదా..?

    విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. స్థంభానికి కట్టేసిన మహిళ కట్లు విప్పేశారు. డబ్బులు చెల్లించలేదనే కారణంతో.. ఆ మహిళను స్ధంభానికి కట్టిన బాధితులపై కేసులు నమోదు చేస్తానని ఎస్‌ఐ హెచ్చరించారు. దీంతో ఎస్‌ఐ వైఖరి పట్ల గ్రామస్తులు నిరసనకు దిగారు.

    ఇదీ చదవండి : ఫ్రీ ఎడ్యూకేషన్ కోరుకుంటున్నారా? ఈ ఎంట్రన్స్ క్వాలిఫై అయితే.. ఇంటర్‌ వరకు మొత్తం ఫ్రీ

    తప్పు చేసింది అమె అని.. తమ రెక్కల కష్టాన్ని దోచుకుందని గ్రామస్థులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమను అంతాలా మోసం చేసిన ఆమెను వదిలేసి తమపై కేసులు పెట్టడం ఏంటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటికే శోభ పై అప్పులు ఎగొట్టిన కేసు కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు.. కేసు కోర్టులో ఉండగా గ్రామస్తులు శోభ పై దాడిచేయటాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.. అయితే గ్రామస్థుల నుండి ఎలాంటి ఇబ్బంది జరగకుండా శోభను పోలీసుల అదుపులోనే ఉంచారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizianagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు