హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag Beach: విశాఖ బీచ్‌లో అద్భుతం.. పురాతన నిర్మాణం గుర్తింపు.. ఆ యుద్ధకాలం నాటిదేనా..?

Vizag Beach: విశాఖ బీచ్‌లో అద్భుతం.. పురాతన నిర్మాణం గుర్తింపు.. ఆ యుద్ధకాలం నాటిదేనా..?

విశాఖలో

విశాఖలో యుద్ధకాలం నాటి నిర్మాణం గుర్తింపు

విశాఖపట్నం (Visakhapatnam) అనగానే ముందుగా గుర్తుకువచ్చేది పాల నురగలా పైకి ఎగిరే అందమైన సముద్రమే. ఈ సముద్రం ఎన్నో రహస్యాలని తన అంతరగర్భములో దాచుకుంది. కాల క్రమంలో ఒక్కొక్కటిగా వాటి గుట్టుని విప్పుతుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  విశాఖపట్నం (Visakhapatnam) అనగానే ముందుగా గుర్తుకువచ్చేది పాల నురగలా పైకి ఎగిరే అందమైన సముద్రమే. ఈ సముద్రం ఎన్నో రహస్యాలని తన అంతరగర్భములో దాచుకుంది. కాల క్రమంలో ఒక్కొక్కటిగా వాటి గుట్టుని విప్పుతుంది. తాజాగా విశాఖ నగరంలో ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి ఆర్ కె బీచ్‌ (Vizag RK Beach) లో ప్రత్యక్షమయ్యింది. ఇప్పుడు విశాఖపట్నంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్‌లు చాలా వరకు విశాఖ తీరంలోనే ఉన్నాయి. అయితే, కాలప్రవాహంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని బంకర్లు ఇసుకలో కూరుకుపోయాయి. శత్రువులపై దాడి చేసేందుకు సైనికులు ఈ బంకర్‌లను నిర్మించుకుని అక్కడి నుంచి దాడులకు దిగేవారని చరిత్రకారులు చెబుతుంటారు.

  కేవలం రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే కాదు రాతి యుగంలో కూడా విశాఖలో నాగరికత ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అండర్‌గ్రౌండ్‌( భూమిలో) రహస్యంగా కట్టుకునే గదులు, ఇళ్లనే బంకర్లు అంటారని అందరికీ తెలుసు. అయితే నలుగురికి సరిపడే స్థాయి నుంచి.. పదుల సంఖ్యలో తలదాచుకోవడానికి వీలుగా ఈ బంకర్లను నిర్మించుకుంటారు. అత్యవసర పరిస్థితిలో వాడుకోడానికి మందులు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్, నీళ్లు, ఆహారం, వంటి వాటిని బంకర్లలో ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచేవారు.

  ఇది చదవండి: స్నేహమంటే ఇదేరా..! స్నేహితుడికి గుర్తుగా.. వీల్లేం చేశారో మీరే చూడండి..

  బంకర్‌ ఏదైనా సరే.. ఓ వైపు నుంచి చిన్నగా ఉపరితలానికి దారి, మెట్లు ఉంటాయి. ఎలాంటి కిటికీలుగానీ, ఇతర మార్గాలు గానీ దాదాపుగా ఉండవు. లోపల దాక్కున్నవారికి ఊపిరి ఆడేందుకు వీలుగా గాలి వచ్చిపోయేలా కాస్త వెంటిలేషన్‌ ఏర్పాటు చేస్తారు. యుద్ధ సంక్షోభ ప్రాంతాల్లో ఈ బంకర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాటి వినియోగం బాగానే ఉండేది…ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వైమానిక దాడుల కారణంగా బంకర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

  ఇది చదవండి: ఈ యుద్ధకళ నేర్చుకుంటే.. ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం..! మీరు ట్రై చేయండి..!

  ఓ సారి విశాఖ హార్బర్‌పై జపాన్ బాంబు దాడి చేసిందని చరిత్ర చెబుతుండటంతో ఈ బంకర్ అప్పటిదే అయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రాచీన నాగరికతకు ఆనవాలుగా చెప్పుకునే ఈ బంకర్ బయటపడడంతో.. అలాగే చూసేందుకు కూడా కాస్త వెరైటీగా ఓ గుహలాగా ఉండటంతో దానిని చూసేందుకు పర్యాటకులు విపరీతంగా వస్తున్నారు. ఓ వైపు సముద్రం అందాలు.. మరోవైపు ఈ బంకర్ పక్కన ఫోటోలు తీసుకుంటున్నారు. వరల్డ్‌ వార్‌ మెమరీస్‌ అంటూ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లలో షేర్‌ చేస్తున్నారు. బంకర్ ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

  అడ్రస్..: రామకృష్ణ బీచ్‌, వైజాగ్‌, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్‌- 530003.

  Vizag RK Beach Map

  ఎలా వెళ్లాలి..: విశాఖపట్నం కాంప్లెక్స్ నుండి ఆర్కే బీచ్‌కి చేరుకోవాలి. అక్కడనుండి 100 మీటర్ల దూరంలో కొబ్బరి చెట్లు వద్ద ఈ బంకర్లు కనిపిస్తాయి. బస్సు, ఆటో సదుపాయం కలదు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు