Setti Jagadeesh, News 18, Visakhapatnam
మనుషులు రాక్షసులుగా మారుతున్నారు. మానవత్వాన్ని మరిచి.. చిన్న చిన్న కారణాలతో.. నరరూప రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా శ్రద్ధలాంటి ఘటన విశాఖపట్నం (Visakhapatnam)లో కలకలం రేపింది. మధురవాడ వికలాంగుల కాలనీ మహిళా హత్య కేసు పెద్ద మిస్టరీ అయ్యింది. వికలాంగుల కాలనీలోని ఓ ఇంటిలో వాటర్ డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృత దేహం (Married Women Dead Body) ఉందనే సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు (Police Case) నమోదు చేసి విచారణ ప్రారంభించారు.ఆ ఇంటి ఓనర్ ఇచ్చిన సమాచారంతో పాటు చుట్టుపక్కల వారి నుంచి పోలీసులు పలు వివరాలను సేకరించారు. పూర్తిస్థాయిలో పోలీసులు రంగంలోకి దర్యాప్తు చేపట్టారు.
ఆ ఇంటి ఓనర్ ఇచ్చిన సమాచారంతో అక్కడ అద్దెకు ఉంటున్న రిషి వర్ధన్ వివరాలను పూర్తిగా సేకరించిన పోలీసులు ఎట్టకేలకు శ్రీకాకుళం (Srikakulam) లోని అతని సొంత ఊరులో కొప్పిశెట్టి రిషివర్ధన్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసుల విచారణలో అతడే హంతుకుడిగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ హత్య తానే చేసినట్లు రిషి వర్ధన్ పోలీసులు ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొత్తూరు గ్రామం సీతంపేటకు చెందిన 25 ఏళ్ల రిషి వర్ధన్ 2019 డిసెంబర్ లో.. కొమ్మాదిలోని వికలాంగుల కాలనీలో నండూరు రమేష్ కు చెందిన ఇంటిలో అద్దెకు దిగాడు. ఆ ఇంట్లో తన భార్యతో కలిసి ఉంటున్నాడు. నండూరు రమేష్ కు ఉన్న ఎస్కే ఎంఎల్ లారీ బాడీ బిల్డింగ్ వెల్డింగ్ షాస్ లో రిషి వర్ధన్ హెల్ప ర్ చేరాడు. 2020 ఫిబ్రవరి నెలలో,రిషి తన భార్యతో కలిసి తన భార్య డెలివరీ కోసం వారి స్వగ్రామానికి వెళ్లాడు. అనారోగ్య కారణాల కారణంగా ఇంటి ఓనర్ నండూరి రమేష్ ఆ ఇంటికి వెళ్లకపోవడంతో కొన్నిసార్లు రిషివర్ధనక్ ఫోన్ కాల్స్ ద్వారా అద్దె మొత్తాన్ని అడిగాడు. ఇదిలా ఉండగా 2021లో ఆ ఇంటికి అధిక విద్యుత్ బిల్లు వస్తున్నట్లు ఇంటి ఓనర్ గమనించాడు.
ఇదీ చదవండి : రేపు సీఎం జగన్ ఎన్నికల సమర శంఖం.. జయహో బీసీకి భారీ ఏర్పాట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఈ నెల 4న తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఇంటిని శుభ్రం చేసేందుకు అక్కడికి వెళ్లగా, టేప్ తో సీల్ చేసిన బ్లాక్ కలర్ ప్లాస్టిక్ వాటర్ డ్రమ్ నుంచి దుర్వాసన రావడం గమనించారు. డ్రమ్ తెరిచి చూడగా, కుళ్లిపోయిన మృతదేహం కనిపించింది. పుర్రె, పొడవాటి నల్లటి వెంట్రుకలతో ప్లాస్టిక్ కవర్, ఆడ మృత దేహంలా కనిపించడంతో వెంటనే స్థానిక పీఎం పాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టారు. అసలు హంతకుడిని పట్టుకున్నారు. అయితే ఎందుకు హత్య చయాల్సి వచ్చింది అన్నది పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Local News, Vizag