Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM 89 FEET ECO FRIENDLY LORD GANESH STATUE NJ VNL ABH

VIzag: గాజువాకలో '' ఖైరతాబాద్‌ గణనాథుడు''..! 89 అడుగుల ఎకో ఫ్రెండ్లీ ఏకదంతుడు..!

89 అడుగుల ఎకో ఫ్రెండ్లీ ఏకదంతుడు..!

89 అడుగుల ఎకో ఫ్రెండ్లీ ఏకదంతుడు..!

ఈ సంవత్సరం భారి ఎత్తున ఖైరతాబాద్‌ గణనాథుని తయారుచేసే రాజేంద్రన్ ఆధ్వర్యంలో వైజాగ్‌లోని గాజువాకలో 89 అడుగులు గణనాథుని ఏర్పాటుచేస్తున్నామని ఆర్గనైజర్‌ గణేష్‌కుమార్‌ తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    (Neelima Eaty, News 18, Vizag)

    ప్రతి ఏడాది మన దేశంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతాయి. భారీ మండపాలు, ఎత్తైన గణేషుని విగ్రహాలు.. కొన్ని చోట్ల సందేశాత్మకంగా, మరికొన్ని చోట్ల వినూత్నంగా బొజ్జగణపయ్య కొలువుదీరుతాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ గణనాథుని ఏర్పాట్లు మొదలయ్యాయి. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ గణనాథుడికి ఎంత ప్రాముఖ్యం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ గణనాథుని తీర్చిదిద్దే రాజేంద్రన్‌ డైరక్షన్‌లో ఈ సారి వైజాగ్‌లోనూ భారీ గణనాథుడు కొలువుతీరనున్నాడు.

    ప్రతి సంత్సరమూ గణేషుని ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి వల్ల వినాయకచవితి వేడుకలు అంతగా జరగలేదు. అయితే ఈ సారి మాత్రం వాడవాడలా వైభంగా జరగబోతున్నాయి. ఈ సంవత్సరం భారి ఎత్తున ఖైరతాబాద్‌ గణనాథుని తయారుచేసే రాజేంద్రన్ ఆధ్వర్యంలో వైజాగ్‌లోని గాజువాకలో 89 అడుగులు గణనాథుని ఏర్పాటుచేస్తున్నామని ఆర్గనైజర్‌ గణేష్‌కుమార్‌ తెలిపారు.

    గాజువాకలో 89 అడుగుల భారీ వినాయకుడు..!
    గాజువాక లంక మైదానంలో 89 అడుగుల భారీ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతిలా స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.  పర్యావరణానికి ఎలాంటి హానీ కలగకుండా ఎకో ఫ్రెండ్లీ గణేషుని తీర్చిదిద్దుతున్నారు. కేవలం మట్టితో మాత్రమే ఈ గణనాథుని తయారుచేస్తున్నామని.. సహజ రంగులనే వాడుతున్నామన్నారు. భారీ మండపానికి కూడా సరుగుడు కర్రలు, వెదురు బొంగులనే వాడుతున్నామని ఆర్గనైజర్స్‌ తెలిపారు.

    ప్రజల భద్రత కోసం పూజలు నిర్వహించేందుకు ప్రత్యేక యాగశాలను నిర్మిస్తున్నారు. పాతాళ భైరవి, భారీ ఏనుగు లాంటి వాటిని స్పెషల్ అట్రాక్షన్ కోసం ఏర్పాటు చేయనున్నారు.

    గాజువాకలో తొలిసారిగా 2009లో గణేష్‌ ఉత్సవాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి నిర్విరామంగా ప్రతి ఏటా వైభవంగా గణనాథుని ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్‌ కంటే కాస్త ఎక్కువ ఎత్తులో ఈ గణేషుని తీర్చిదిద్దుతున్నట్లు ఆర్గనైజర్‌ గణేష్ తెలిపారు.  నాలుగు వేర్వేరు రాష్ట్రాలైన ఒరిస్సా, ఆంధ్రా, తెలంగాణ మరియు తమిళనాడు నుంచి వచ్చిన దాదాపు 40మంది కార్మికులు ఈ భారీ గణనాథుని నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రతిదీ కూడా ఫినిషింగ్ నీట్‌గా క్లియర్‌గా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నామని గణేష్‌ తెలిపారు.

    ఆగస్టు 31 నుంచి మొదలుకానున్న ఉత్సవాలను 21 రోజుల పాటు కొనసాగనున్నాయి. మహాగణపతికి రోజు పూజలు, యోగాలు, హోమాలు నిర్వహించనున్నారు. అంతేకాదు అభిషేకాలు, స్వామి వారి కళ్యాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆఖరిరోజున విగ్రహాన్ని ప్రతిష్టించిన చోటనే.. గోదావరి జలాలతో నిమజ్జనం చేయనున్నట్లు ఆర్గనైజర్‌ కమిటీ సభ్యులు త్రిమూర్తులు తెలిపారు.

    భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించనున్నారు. బాలింతలకు, చిన్నపిల్లల తల్లిదండ్రులకు, గర్భిణీలు, వృద్ధులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసేలా క్యూలైన్లను సిద్ధం చేస్తున్నారు. ఈ మహాగణపతిని దర్శించుకోటానికి ప్రతి ఏటా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వస్తుంటారు. అయితే ఈ ఏడాది లడ్డు వేలం లాంటి కార్యక్రమం ఏమి లేదని గణేష్‌కుమార్‌ తెలిపారు.



    ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ భారీ గణనాథుని ఏర్పాటుచేస్తున్నామని…ప్రతి ఒక్కరు వచ్చి స్వామిని దర్శించుకోవాలని ఆర్గనైజర్స్‌ కమిటీ కోరుతోంది.

    అడ్రస్: లంక గ్రౌండ్స్, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్- 530026

    ఎలా వెళ్లాలి?
    విశాఖపట్నం బస్టాండ్‌ నుంచి గాజువాక వెళ్లే బస్సులు ఎక్కి..అక్కడ లంక గ్రౌండ్స్‌ అంటే ఎవ్వరైనా ఆపుతారు. లేదా లోకల్‌గా ఆటోలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Devotional, Local News, Vishakaptnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు