Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM 75 YEARS OLD MAN GRABBING PEOPLE ATTENTIONS BY SHOWING TALENT IN ATHLETICS FULL DETAILS HERE PRN VSP

75years old Athlete: ఈయన 75 ఏళ్ల బాహుబలి.., పరుగుపెడితే పతకాల పంటే..!

వెంకటరమణ (ఫైల్)

వెంకటరమణ (ఫైల్)

Visakhapatnam: ఆయనకి 75 ఏళ్లు. వృద్ధుడు. కానీ.. అలా అంటే ఆయన ఒప్పుకోడు. ఇప్పటి కుర్రకారుతో సమానంగా స్పీడ్ గా పరుగెడతారు.

    P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

    ఆయనకి 75 ఏళ్లు. వృద్ధుడు. కానీ.. అలా అంటే ఆయన ఒప్పుకోడు. ఇప్పటి కుర్రకారుతో సమానంగా స్పీడ్ గా పరుగెడతారు. వయసైపోయినా.. తనకింకా ఇరవై ఏళ్లనే అంటారు. ఎప్పటికీ తన వయసు అలా ఉంచుకోవడానికే ఇష్టపడతానంటారు. విశాఖకి చెందిన ఈ పెద్ద కుర్రాడు.. పరుగులో హుషారు. చాలా స్పీడ్ చూపిస్తారు. ఇప్పటికే ఎన్నో కప్పులు కూడా గెలిచారు. నడివయసులోనే నడుం నొప్పులని నడవలేనని.. అదేదో అంటూ చెప్పే నేటి తరానికి తన పరుగులాంటి నడకతోనే దారి చూపిస్తానంటారు. ఎవరికైనా 70 ఏళ్లు దాటితే.. జీవితం చివరి దశకు వచ్చేసిందని భావిస్తుంటారు. ఇంటికే పరిమితమవుతుంటారు. కాని ప్రహ్లాదపురం దరి విరాట్‌నగర్‌ ప్రాంతానికి చెందిన తాళాబత్తుల వెంకటరమణ(74) మాత్రం పరుగులో దూసుకెళుతున్నారు. పరుగులో ప్రతిభ చూసి యువకులు కూడా అసూయ పడుతుంటారంటే అతిశయోక్తికాదు. అందుకే ఆయన్ను వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు పరుగుల బాహుబలి అని పిలుచుకుంటున్నారు.

    వెంకటరమణ అయిదేళ్ల వ్యవధిలో సుమారు వందకు పైగా పరుగు, నడక పోటీల్లో పాల్గొనడంతో పాటు పతకాలు సాధించారు. వెంకటరమణ విద్యుత్తు శాఖలో పని చేసి ఉద్యోగ విమరణ చేశారు. నివాసం ఉంటున్న విరాట్‌నగర్‌ ప్రాంతం నుంచి పలువురు ప్రతిరోజు ఉదయపు నడకకు వెళ్లడం చూసి తాను కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా 2016లో 69ఏళ్ల వయసులో గోశాల కూడలి దరి ఎస్‌వీఎల్‌ఎన్‌ వాకర్స్‌ క్లబ్‌లో చేరారు.

    ఇది చదవండి: అక్కడ తేలు కుడితే అదృష్టం... ఇదెక్కడి వింత ఆచారం..?


    నిత్యం వ్యాయామం, నడక, పరుగు సాధన చేసేవారు. తద్వారా యుక్త వయస్సులో ఉండే ఉత్సాహం సొంతం చేసుకున్నారు. ఏడాది తర్వాత 2017 నుంచి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు. నాటకాల్లో కూడా ప్రవేశం ఉండడంతో వాక్లర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో అభినయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.. గతంలో రాజస్థాన్‌లో జరిగిన మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో పాల్గొనడానికి వెళ్లి అక్కడా ఏకపాత్రాభినయం చేసి భళా అనిపించుకున్నారు.

    ఇది చదవండి: బంగాళాఖాతంలో భూకంపం.. ఏపీలో ప్రకంపనలు.. సునామీ ముంచుకొస్తోందా..?


    75ఏళ్లు వస్తున్నా ఇప్పటికీ ఆయనలో ఉత్సాహం తగ్గలేదు. ప్రతిరోజు ఉదయం నడక, ధ్యానం, యోగా సాధన చేస్తుంటానని చెబుతారు రమణ. కరోనా కారణంగా ప్రస్తుతం పోటీలు జరగడం లేదు. మళ్లీ జరిగితే తప్పకుండా పాల్గొంటానని ఉత్సాహంగా చెబుతారు. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే వయోభారం బాధపెట్టదని అంటారు. మంచి అలవాట్లతో జీవిస్తే నిత్యం ఉల్లాసంగా ఉండవచ్ఛు నేను శాఖాహారం మాత్రమే తీసుకుంటానని వెంకటరమణ అంటున్నారు.

    ఇది చదవండి: వివాదంలో సింహాచలం ఆలయం.. అపచారానికి పాల్పడుతున్నదెవరు..?


    ఇవీ ఘనతలు...
    వెంకటరమణ పరుగు, నడక సాధన ప్రారంభించిన అయిదేళ్ల వ్యవధిలోనే వందకు పైగా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. 2020 విశాఖ పోర్టు స్టేడియంలో జరిగిన ఏపీ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ 5వేల మీటర్ల పరుగు, నడక పోటీల్లో ద్వితీయ, 800 మీటర్ల పరుగులో తృతీయ, 2019 రాజస్థాన్‌లో జరిగిన జాతీయ స్థాయి 5 కిలోమీటర్ల నడక పోటీలో తృతీయ స్థానంలో నిలిచారు. 2019లో విజయనగరంలో జరిగిన ఏపీ స్టేట్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ 5వేల మీటర్ల నడకలో ప్రథమ, 5 కిలోమీటర్ల నడకలో తృతీయ, 800 మీటర్ల పరుగులో తృతీయ స్థానంలో నిలిచారు. 2019లో బెంగళూరులో జరిగిన మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ 5కిలోమీటర్ల నడకలో తృతీయ, 2017లో విశాఖలో జరిగిన డిస్ట్రిక్‌ 101 గవర్నర్స్‌ కప్‌ 10 కిలోమీటర్ల నడకలో మొదటి బహుమతి పొందారు. 2019 డిసెంబర్‌లో ఒడిశా రాష్ట్రం బరంపురంలో జరిగిన జాతీయ స్థాయి వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌లో 2కిలోమీటర్ల నడకలో ద్వితీయ, 2019లో గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ 5కిలోమీటర్ల నడకలో ద్వితీయ, 400మీటర్ల పరుగులో ద్వితీయ బహుమతి పొందారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Old man, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు