• HOME
 • »
 • NEWS
 • »
 • ANDHRA-PRADESH
 • »
 • VISAKHAPATNAM 4 PERSONS FROM SAME FAMILY DIED AFTER BURNT ALIVE IN VISAKHAPATNAM MADHURAWADA SK

Visakhapatnam: ఒకే ఇంట్లో నలుగురు సజీవ దహనం.. విశాఖలో విషాదం.. అసలేం జరిగింది?

Visakhapatnam: ఒకే ఇంట్లో నలుగురు సజీవ దహనం.. విశాఖలో విషాదం.. అసలేం జరిగింది?

ప్రతీకాత్మక చిత్రం

ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? ఎవరైనా హత్య చేశారా? లేదంటే వారే ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

 • Share this:
  విశాఖపట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. వీరింతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ దారుణమైన సంఘటన విశాఖపట్టణలోని మధురవాడలో చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన కథనం ప్రకారం.. మధురవాడలోని ఆదిత్య ఫార్చున్ టవర్‌లో ఫ్లాట్ నెంబర్ 505లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్లాట్‌ నుంచి భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు, మంటలు కనిపించడంతో మిగతా ఫ్లాట్స్ వారు భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఐతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

  చనిపోయిన వారిని బంగారునాయుడు (50), డాక్టర్ నిర్మల (44), దీపక్ (21), కశ్యప్‌ (19) పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లా గుంట్యాడకు చెందిన ఈ ఎన్నారై కుటుంబం.. బహ్రెయిన్‌లో స్థిరపడింది. నాలుగేళ్ల క్రితం తిరిగి విశాఖపట్టనానికి వచ్చారు. 8 నెలల క్రితమే ఆదిత్య ఫార్చున్ టవర్స్‌లోకి అద్దెకు వచ్చారు. ఆ అపార్ట్‌మెంట్లో ఓ ఫ్లాట్‌నుఅద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. అంతలోనే ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

  ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? ఎవరైనా హత్య చేశారా? లేదంటే వారే ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అపార్ట్‌మెంట్ చట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో మధురవాడ ఉలిక్కిపడింది. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు