హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

296 Names: స్త్రీ, ఆడది, వనతి, అమ్మాయి.. ఇలా మహిళకు 294 పేర్లు ఆ లిస్ట్ చూసేయండి!

296 Names: స్త్రీ, ఆడది, వనతి, అమ్మాయి.. ఇలా మహిళకు 294 పేర్లు ఆ లిస్ట్ చూసేయండి!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

అసలు మహిళకు ఎన్ని పర్యాయ పదాలు.. వివిధ పేర్లు ఉన్నాయో తెలిస్తే అవురా అని ముక్కున వేలేసుకోవడం దాదాపు కన్ఫర్మ్.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

మహిళ. ఆమె లేనిదే సృష్టి లేదు. అసలు ఆమె లేకపోతే ఏదీ లేదు.  అలాగే తాను లేకపోతే.. పురుషుడు.. పురుషుడు లేకపోతే జగత్తు లేనే లేదు. మగువ కోసం ఎన్ని చెప్పినా తక్కువే. అయితే ఇప్పుడు మాత్రం తెలుగు భాషలో మహిళకు ఎన్ని పర్యాయపదాలు ఉన్నాయో చెప్పుకుందాం. అసలు మహిళకు ఎన్ని పర్యాయ పదాలు.. వివిధ పేర్లు ఉన్నాయో తెలిస్తే అవురా అని ముక్కున వేలేసుకోవడం దాదాపు కన్ఫర్మ్. ఆ పేర్లేంటో చూద్దాం..

1.అంగన, 2.అంచయాన, 3.అంబుజలోచన, 4.అంబుజవదన, 5.అంబుజాక్షి, 6.అంబుజానన, 7. అంబురుహాక్షి, 8.అక్క, 9.అతివ, 10.అన్ను, 11.అన్నువ, 12.అన్నువు, 13.అబల, 14.అబ్జనయన, 15.అబ్జముఖి, 16.అలరుబోడి, 17.అలివేణి, 18.అవ్వ, 19.ఆటది, 20.ఆడది, 21.ఆడుగూతురు, 22.ఆడుబుట్టువు, 23.ఇంచుబోడి, 24.ఇంతి, 25.ఇందీవరాక్షి, 26.ఇందునిభాస్య, 27.ఇందుముఖి, 28.ఇందువదన, 29.ఇగురాకుబోణి, 30.ఇగురుబో(డి)(ణి), 31.ఇభయాన, 32ఉగ్మలి,33 ఉజ్జ్వలాంగి, 34ఉవిద, 35ఎలతీగబోడి, 36ఎలనాగ, 37.ఏతుల, 38కంజముఖి, 39కంబుకం (ఠ) (ఠి), 40.కంబుగ్రీవ, 41కనకాంగి, 42కన్నులకలికి, 43కప్పురగంధి, 44కమలాక్షి, 45కరభోరువు, 46కర్పూరగంధి, 47కలకంఠి, 48కలశస్తని, 49కలికి, 50కలువకంటి, 51కళింగ, 52కాంత, 53కించిద్విలగ్న, 54కిన్నెరకంఠి, 55కురంగనయన,56 కురంగాక్షి, 57.కువలయాక్షి, 58.కూచి, 59.కృశమధ్యమ, 60.కేశిని, 61కొమ, 32కొమరాలు, 63.కొమిరె, 64.కొమ్మ, 65కోమ, 66.కోమలాంగి, 67కోమలి,68 క్రాలుగంటి, 69గజయాన, 70గరిత, 71గర్త, 72గుబ్బలాడి, 73గుబ్బెత, 74గుమ్మ, 75గోతి, 76గోల, 77చంచరీకచికుర, 78చంచలాక్షి, 79చంద్రముఖి, 80చంద్రవదన, 81చక్కనమ్మ, 82చక్కెరబొమ్మ, 83చక్కెరముద్దుగుమ్మ, 84చాన, 85చామ, 86చారులోచన, 87చిగురుటాకుబోడి, 88చిగురుబోడి, 89చిలుకలకొలికి, 90చెలి, 91చెలియ, 92చెలువ, 93చే(డె)(డియ), 94చోఱబుడుత, 95జక్కవచంటి, 96జని, 97జలజనేత్ర,98 జోటి, 99ఝషలోచన, 100తనుమధ్య, 101తన్వంగి, 102తన్వి, 103తమ్మికంటి, 104తరళలోచన, 105తరళేక్షణ, 106తరుణి, 107తలిరుబోడి,108 తలోదరి, 109తాటంకవతి, 110తాటంకిని, 111తామరకంటి, 112తామరసనేత్ర, 113తీయబోడి, 114తీ(గ)(వ)బోడి, 115తెఱవ, 116తెలిగంటి, 117తొ(గ)(వ)కంటి, 118తొయ్యలి,119 తోయజలోచన, 120తోయజాక్షి, 121తోయలి, 122దుండి, 123ధవళాక్షి, 124ననబోడి, 125నళినలోచన, 126నళినాక్షి, 127నవ(ల)(లా), 128నాంచారు, 129నాచారు, 130నాచి, 131నాతి, 132నాతుక, 133నారి, 134నితంబవతి, 135నితంబిని, 136నీరజాక్షి, 137నీలవేణి, 138నెచ్చెలి, 139నెలత, 140నెలతుక, 141పంకజాక్షి, 142పడతి, 143పడతుక, 144పద్మముఖి, 145పద్మాక్షి, 146పర్వేందుముఖి, 147పద్మాక్షి, 148పర్వేందుముఖి, 149పల్లవాధర, 150పల్లవోష్ఠి, 151పాటలగంధి, 152పుచ్చడీక, 153పుత్తడిబొమ్మ, 154పు(వు)(వ్వు)బోడి, 155పువ్వారుబోడి, 156పుష్కలాక్షి, 157పూబోడి, 158పైదలి, 159పొ(ల్తి)(లతి), 160పొ(ల్తు)(లతు)క,161ప్రతీపదర్శిని,162 ప్రమద,163 ప్రియ,164 ప్రోడ,165 ప్రోయాలు,166 బంగారుబోడి,167 బాగరి,168 బాగులాడి,169 బింబాధర, 170 బింబోష్ఠి,171 బోటి, 172 భగిని,173 భామ,174 భామిని,175 భావిని,176 భీరువు, 177 మండయంతి,178 మగువ,179 మచ్చెకంటి,180 మడతి,181 మడతుక, 182 మత్తకాశిని,183 మదిరనయన,184 మదిరాక్షి,185 మసలాడి,186 మహిళ, 187 మానవతి,188 మానిని,189 మించుగంటి,190 మించుబోడి,191 మీననేత్రి, 192 మీనాక్షి,193 ముగుద,194 ముదిత,195ముదిర,196ముద్దరాలు,197 ముద్దియ, 198 ముద్దుగుమ్మ,198 ముద్దులగుమ్మ,200 ముద్దులాడి,201 ముష్టిమధ్య,202 203 మృగలోచన,204 మృగాక్షి,205మృగీవిలోకన,206 మెచ్చులాడి,207 208 మెఱుగారుబోడి,209మెఱుగుబో(డి)(ణి),210 మెలుత,211 మె(ల్త)(లత),212 మె(ల్తు)(లతు)క,213 యోష,214 యోషిత,215 యోషిత్తు,216 రమణి 217, రామ, 218 రుచిరాంగి,219 రూపరి,220 రూపసి,221రోచన,222 లతకూన,223 లతాంగి, 224 లతాతన్వి,225 లలన,226 లలిత,227 లలితాంగి,228 లీలావతి,229 లేడికంటి, 230 లేమ,231 లోలనయన,232 లోలాక్షి,233 వధువు,234వధూటి 235వనజదళాయతాక్షి,236 వనజనేత్ర,237 వనజాక్షి,238 వనిత,239 వరవర్ణిని, 240వరానన,241వరారోహ,242 వలజ,242వశ,244 వామ,245 వామనయన, 246వామలోచన,247 వారిజలోచన,248 వారిరుహనేత్ర,249 వారిరుహలోచన, 250 వారిరుహానన,251 వాల్గంటి,252 వాలుగకంటి,253 వాశిత,254 వాసుర, 255విరితీవబోడి,256విరిబోడి,257విశాలాక్షి,258 వెలది,259శంపాంగి,260 శఫరాక్షి, 261శర్వరి,262 శాతోదరి,263 శిఖరిణి,264 శుకవాణి,265 శుభదంతి,266 శుభాంగి, 267శోభన,268 శ్యామ,269 శ్రమణ,270 సకి,271సకియ,272 సారసాక్షి,273 సిత, 274సీమంతిని,275సుందరి,276 సుగాత్రి,277 సుజఘన,278సుదతి,279 సుదృక్కు, 280 సుధ్యుపాస్య,281 సునయన,282 సుప్రియ,283సుభాషిణి,284 సుభ్రువు, 285 సుమతి,286సుమధ్య,287 సుముఖ,288 సురదన,289 సులోచన,290సువదన, 291 హంసయాన,292హరిణలోచన,293 హరేణువు,294 హేమ.

ఇవండి పేర్లు.. ఇంకా మీకు తెలిసినవి ఏవైనా ఉంటే.. చెప్పేయండి. ఇందులో కలిపేద్దాం..?

First published:

Tags: Andhra Pradesh, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు