హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakhapatnam: ప్లాట్‌ఫాం చివర నిలబడి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న కుర్రాడు.. రైలు దూసుకురావడంతో జరిగిందో ఘోరం..!

Visakhapatnam: ప్లాట్‌ఫాం చివర నిలబడి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న కుర్రాడు.. రైలు దూసుకురావడంతో జరిగిందో ఘోరం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్నేహితుడిని రిసీవ్ చేసుకుందామని రైల్వే స్టేషన్ కు వచ్చాడో కుర్రాడు. రైలు రూపంలో మృత్యువు దూసుకొచ్చి అతడిని బలితీసుకుంది. అతడు చేసిన ఒకే ఒక్క పొరపాటు వల్ల అతడి ప్రాణం పోయింది..

ప్రమాదం ఏ రూపంలో వస్తుందో, మృత్యువు ఎలా ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. తనమానాన తాను రోడ్డుపై వెళ్తున్నా బస్సో, బైకో, కారో దూసుకొచ్చి ప్రాణాలను తీస్తుంటుంది. బస్సులో కూర్చుని పాటలు వింటున్నా ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన ఘటన హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఫ్రెండ్స్ తో ముచ్చట్లు చెప్పి ఇంటికెళ్లిన వ్యక్తి మంచంపైనే కుప్పకూలిపోయిన ఘటనలు ఎన్నో. కుటుంబ సభ్యులతో సంతోషంగా భోజనం చేసి నిద్రపోయిన వ్యక్తి మళ్లీ లేవని ఉదంతాలు కొకొల్లలు. తాజాగా ఓ కుర్రాడి విషయంలోనూ అదే జరిగింది. స్నేహితుడిని రిసీవ్ చేసుకుందామని రైల్వే స్టేషన్ కు వచ్చాడో కుర్రాడు. రైలు రూపంలో మృత్యువు దూసుకొచ్చి అతడిని బలితీసుకుంది. అతడు చేసిన ఒకే ఒక్క పొరపాటు వల్ల అతడి ప్రాణం పోయింది. విశాఖపట్టణం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్టణం జిల్లా గాజువాక సమీపంలోని కోరమాండల్ శాంతి నగర్ లో బంగారి రామారావు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. రామారావు డాక్ యార్డ్ ఉద్యోగి. అతడి కుమారుడు 28 ఏళ్ల రామ్మోహన్ డిప్లోమా చేశాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు. భార్యాకొడుకుతో హ్యాపీగా ఉన్న రామారావు కుటుంబంలో శనివారం ఓ విషాధ ఘటన చోటుచేసుకుంది. తీరని దు:ఖాన్ని మిగిల్చింది. రామ్మోహన్ స్నేహితుడు శనివారం వేరే సిటీ నుంచి వస్తున్నాడు. అతడిని రిసీవ్ చేసుకునేందుకు రామ్మోహన్ దువ్వాడ రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. రైలు రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని అనౌన్స్ మెంట్ వినిపించింది. దీంతో ఖాళీగా ఉండలేక చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడు.

పాటల సౌండ్ మరీ ఎక్కువగా పెట్టుకున్నాడో ఏమో కానీ, బయట ఏం జరుగుతోందో, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వినిపించనంతగా పాటల్లో మునిగిపోయాడు. ఫ్లాట్ ఫామ్ పై ఉన్న బెంచీలపై కూర్చోకుండా నిలబడి, ఫ్లాట్ ఫాం చివరకు వెళ్లి పాటలు వింటున్నాడు. ఫ్లాట్ ఫాం చివరన అతడు ఉన్న సమయంలోనే ఓ రైలు దూసుకొచ్చింది. రైలు హారన్ కూడా అతడికి వినిపించకపోవడం వల్ల రైలు గాలి వేగానికి అతడు పట్టాలపై పడిపోయాడు. రైలు కింద పడి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతడి తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Telangana crime, Train accident, Visakhapatnam

ఉత్తమ కథలు