హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఆనందంతో పాటు ఆహ్లాదం.. వైజాగ్ లో 2వేల ఏళ్ల నాటి బౌద్ధ క్షేత్రం తొట్లకొండ.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

Vizag: ఆనందంతో పాటు ఆహ్లాదం.. వైజాగ్ లో 2వేల ఏళ్ల నాటి బౌద్ధ క్షేత్రం తొట్లకొండ.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

అనందంతో

అనందంతో పాటు ఆహ్లాదాన్ని ఇచ్చే తొట్ల కొండ

Vizag: అందాల నగరం విశాఖలో ఎంతో ఆహ్లాదాన్ని పంచే ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఆధ్యాత్మికత పాటు.. ఆనందాన్ని ఇచ్చే అందమైన ప్రదేశం తొట్ల కొండ.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటో తెలుసా..?

  Neelima Eaty, News18 Visakhapatnam.

  Famous Tourist spot Thotlakonda: మనుషుల్లో శాంతిని నెలకొల్పేందుకు గౌతమ బుద్ధుడి ప్రబోధనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సుమారు 2500 ఏళ్ల క్రితం భారత దేశంలో పుట్టి, క్రమంగా ఖండాంతరాలు దాటిన బౌద్ధ మతం ప్రపంచ శాంతిని చాటి చెప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కాలక్రమేణా మనుషుల్లో ఇతర భావజాల సిద్ధాంతాలు పెరిగిపోయి.. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం బౌద్ధం ఆచరణలో కొనసాగుతుంది. ప్రాంతాలు, మనుషులు వేరైనప్పటికీ.. బౌద్ధం తాలూకు మూలాలు మాత్రం భారత దేశంలోనే ఉండడం మనకు గర్వకారణం. ఖండాంతరాలు ధాటి వెళ్లే నాటికి మన దేశంలోనూ బౌద్ధ మతం ఎంతో ఆదరణకు నోచుకుంది. నేటి ఆధునిక ప్రపంచం నుంచి రెండు వేల ఏళ్ల నాటి బౌద్ధ నాగరిక ప్రపంచంలోకి తీసుకువెళ్లే ఓ అద్భుతమైన ప్రదేశం విశాఖపట్నం నగర శివార్లలో ఉంది. అదే ప్రాచీన బౌద్ధ క్షేత్రం 'తొట్లకొండ'. ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది.

  తొట్లకొండ బౌద్ధ క్షేత్రం ఎలా బయటపడింది:

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బౌద్ధ మత వైభవానికి ఈ ప్రాంతం అర్థంగా మారింది. తొట్లకొండ బౌద్ధ క్షేత్రాన్ని 1970లో భారత నౌకాదళం ఏరియల్ సర్వేలో భాగంగా మొదటిసారిగా గుర్తించింది. 1978లో ఆంధ్ర ప్రదేశ్ పురాతన,  చారిత్రక స్మారక చిహ్నం, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం, 1960 ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ (APDAM) బౌద్ధ ప్రదేశాన్ని  "రక్షిత స్మారక చిహ్నం "గా ప్రకటించింది.

  తొట్లకొండ బౌద్ధ విహారం విశాఖపట్నం నగరానికి దాదాపు 15 కిలో మీటర్ల దూరంలో కాపులప్పాడ పరిసర ప్రాంతానికి సమీపంలో కొండపై ఉంది. భీమిలి పట్టణానికి వెళ్లే మార్గంలో సముద్ర మట్టానికి 128 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపైన తొట్లకొండ దగ్గర ఆహ్లాదకర వాతావరణంలో ఈ క్షేత్రం ఉంది. ఎంతో విశాలమైన, సుందరమైన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు దూర ప్రాంతాల నుండి బౌద్ధ సన్యాసులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. 1993లో వైమానిక సర్వే సందర్భంగా భారతీయ నావికాదళం ఈప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈ ప్రదేశం 200 BC, 200 AD నుండి పూర్తి ప్రక్రియలో ఉందని చెప్పబడింది.

  ఇదీ చదవండి : కోనసీమ అల్లర్ల కేసులో ఆగని దుమారం.. ఏ పార్టీపై ఎన్ని కేసులంటే..?

  దేశ విదేశాల నుంచి క్షేత్రాన్ని సందర్శించే బౌద్ధులు:

  బౌద్ధ మత ప్రచారంలో భాగంగా అనేక మంది ప్రజలు ఇక్కడకు వచ్చేవారు. వారి సౌకర్యార్ధం ఇక్కడ స్వీయ వసతులు ఏర్పాటు చేసుకునే వారు. అందులో భాగంగా ఇక్కడ రాతితో నిర్మించిన నీటి తొట్టెలు ఎక్కువగా ఉన్నాయి. నీటిని సేకరించే రాతి బావుల కారణంగా సాహిత్యపరంగా "రాతి బావులు ఉన్న కొండ" అని అర్ధం వచ్చేలా ఈ కొండకు తొట్లకొండ అని పేరు స్థిరపడిపోయింది. తొట్లకొండలో అద్భుతమైన నిర్మాణాలు, సన్యాసులకు కోసం నిర్మించబడిన ధ్యాన మందిరాలు నిర్మించారు. చైనా, బర్మా, అనేక ఇతర దేశాల నుండి వచ్చే బౌద్ధ సన్యాసులు తమ అభ్యాసాన్ని ముగించే ముందు నెలల తరబడి ఈ ప్రదేశంలో ఉంటారు.

  ఇదీ చదవండి : ఫలించిన ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం.. ఎట్టకేలకు పోస్టింగ్.. ఏ పదవి ఇచ్చారంటే..?

  తొట్లకొండలో వివిధ స్థూపాలు, విహారాలు, చైత్యాల నివాసం ఉంది. కొండపైన ఉన్న ఈ అద్భుతమైన,  ప్రశాంతమైన మఠం ఆరాధనకు దృశ్యాలను అన్వేషించడానికి అనువైన గమ్యస్థానాన్ని అందిస్తుంది. తొట్లకొండను చేరుకోవడం పర్యాటకులకు ఎవరికైనా ఒక అద్భుతమైన అనుభవం.


  తొట్లకొండ బౌద్ధ క్షేత్రానికి ఎలా చేరుకోవాలి:

  తొట్లకొండ బౌద్ధ క్షేత్రం ప్రస్తుతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. నిత్యం వందలాది మంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ బౌద్ధ క్షత్రానికి చేరుకోవాలంటే విశాఖపట్నం నగరం నుంచి 900K బస్సు ఎక్కి వెళ్ళచ్చు. ప్రైవేటు వాహనాల్లో కూడా ఇక్కడకు చేరుకోవచ్చు. తొట్లకొండపై నుంచి చూస్తే అద్భుతమైన సముద్రపు దృశ్యం అలరిస్తుంది. కొండపైన ఆహ్లదకర వాతావరణంలో కుటుంబంతో సహా గడిపేందుకు పార్క్ కూడా ఉంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పర్యాటకులకు అనుమతినిస్తారు. అడ్రస్:RCH5 CM3, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530048.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag

  ఉత్తమ కథలు