Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM 18YEAR BOY SUFFERING FROM SNAKE SKIN IN ANAKAPALLI DISTRICT SNR VSJ NJ

Snake Skin Boy: అతనిది పాము చర్మం..పేరు కూడా పాము ప్రసాద్‌ అంట

(బాలుడికి పాము చర్మం)

(బాలుడికి పాము చర్మం)

Snake Skin Boy:ఆ అబ్బాయికి శరీరంలో అన్ని అవయవాలు అందరికి ఉన్నట్లే ఉన్నాయి. కాని చర్మం మాత్రం పాము చర్మాన్ని పోలి ఉంది. అదే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది. ఎండలో తిరగలేడు. తోటి వ్యక్తులు దగ్గరకు రానివ్వని దయనీయస్థితిలో వింత చర్మ సంబంధిత వ్యాధితో కాలం వెళ్లదీస్తున్నారు పాము ప్రసాద్.

ఇంకా చదవండి ...
  (Jagadeesh,News18,Vishakapatnam)
  రూపం, శరీర నిర్మాణం, అవయవ లోపం వీటన్నింటి కంటే బాధాకరమైంది చర్మ సౌందర్య లేకపోవడం. అందుకే తినే తిండి కంటే వేసుకునే దుస్తుల కంటే కూడా రంగు రావడానికి , చూడటానికి అందంగా కనిపించడానికి ముఖానికి, రాసుకునే క్రీములే అత్యంత ఖరీదైనవి. మరి అలాంటి ఖరీదైన క్రీములతో కూడా మారని చర్మం మనిషికి ఉంటే ఏమనాలి ? అతడ్ని తోటి మనుషులు ఎలా చూస్తారో తెలుసా. అనకాపల్లి (Anakapalli)జిల్లాలోని 18ఏళ్ల యువకుడ్ని చూసినా.. అతని స్టోరీ తెలుసుకున్నఅందరికి అర్ధమవుతుంది. 18సంవత్సరాలు అంటే తోటి కుర్రాళ్లతో సరదాగా ఆడుకోవాల్సిన వయసు. అనుక్షణం అవధులు లేని ఆనందంతో గడపాల్సిన ప్రాయం. కాని రావికమతం(Ravikamatham)మండలం జెడ్‌.కొత్తపట్నం(Z.Kottapatnam)గ్రామానికి చెందిన పాము ప్రసాద్‌(Pamu Prasad)ని చూస్తే ఇవేమి అతనిలో కనిపించవు. అతను అందరిలో కలిసి తిరగాలనుకుంటాడు. స్కూల్‌కి వెళ్లి ఫ్రెండ్స్‌ పక్కన కూర్చోవాలని కలలు కంటున్నాడు. కాని వాళ్లు మాత్రం అతడ్ని దగ్గరకు రానివ్వరు. ఓ అంటరాని వాడ్ని చూసినట్లు, వింత జంతువును దూరంగా పెట్టినట్లు ఉంచుతారు. ఎందుకంటే అతను అందరు మనుషుల్లా ఉండడు కాబట్టి. అతని శరీరంలో ఉన్న వింత చర్మ వ్యాధి (Skin disease)కారణంగా పాము కుబుసం ఊడిపోయినట్లుగా ప్రసాద్‌ చర్మం ఊడిపోతూ ఉంటుంది. ఇంతటి ప్రమాదకరమైన వ్యాధితో దిన దిన గండంగా కాలం వెళ్లదీస్తున్నాడు. ప్రసాద్‌ చూడటానికి పాము చర్మం(Snake skin) కలిగి ఉండటమే కాదు అతని ఇంటి పేరు కూడా పాము అనే పదమే కావడం మరో విశేషం. అందుకే అతడ్ని ఎవరూ దగ్గరకు రానివ్వరు..కలిసి తిరిగేందుకు ఇష్టపడకపోవడంతో వింత చర్మ వ్యాధి, విచిత్రమైన ఇంటి పేరుతో ఒంటరిగానే జీవితం కొనసాగిస్తున్నాడు. ప్రసాద్‌ ఇంటి పేరు పాము కావడంతో అదే అతని పాలిట శాపంగా మారిందేమోననే సందేహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

  ఆ అబ్బాయి మనిషే..
  పాము ప్రసాద్‌ అత్యంత బాధాకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. వింత చర్మవ్యాధి కారణంగా పుట్టినప్పటి నుంచి చర్మం రోజూ పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. ఇక ఎండకు వెళ్లినా, వేసవి తీవ్రత అతనిపై చర్మంపై పడిన నిలబడలేని పరిస్థితి. అలాంటి వేడిని తట్టుకోవడానికి గంటకు ఒకసారి స్నానం చేయాల్సిన దుస్థితి. ప్రసాద్ తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి కూలీ చేసుకొని బిడ్డను పోషిస్తోంది. ఇంటి ఖర్చులు, ప్రసాద్ వైద్య ఖర్చులు సంపాధించడం కోసం కూలీ పని చేస్తోంది.

  (పాము ప్రసాద్..కాదు పాపం ప్రసాద్)
  (పాము ప్రసాద్..కాదు పాపం ప్రసాద్)


  చర్మమే పాముని పోలి ఉంటది..
  ప్రసాద్‌కి వచ్చిన ఈ వింత వ్యాధి ఏంటో దానికి ట్రీట్‌మెంట్‌ ఇవ్వమని తల్లి ప్రసాద్‌ని తీసుకొని చాలా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లింది. అయితే అక్కడి వైద్యులు కూడా ఈవింత వ్యాధి ఏమిటో తమకు అంతుపట్టడం లేదని తమ ఆసుపత్రిలో చర్మ వ్యాధి గురించి డేటా లేదని చెబుతూ చేతులు దులిపేసుకుంటున్నారు. అలాగని బిడ్డను ప్రైవేసు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించే స్థోమత, ఆర్ధిక పరిస్ధితి లేకపోవడంతో డబ్బులు ఉన్నప్పుడు డాక్టర్లకు చూపిస్తూ వైద్యం చేయిస్తున్నారు.

  పుట్టుకతో వచ్చిన వింత చర్మవ్యాధి..
  పాము చర్మంతో పుట్టిన ప్రసాద్‌కి చిన్నప్పటి నుంచి ఎన్నో టెస్ట్‌లు, చేయించినప్పటికి చర్మం కలర్, స్వభావం మారకపోవడంతో ఇది దీర్ఘకాలిక వ్యాధి అంటూ వైద్యులు చెబుతున్నారు. ఓవైపు అంతుచిక్కని చర్మవ్యాధి వేధిస్తున్నా ప్రసాద్‌లో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. ఎప్పటికైనా తాను బాగా చదువుకొని తన కుటుంబానికి అండగా నిలవాలని భావిస్తున్నాడు. ఎంతో మనో నిబ్బరంతో, ఆత్మస్తైర్యంతో కాలం వెళ్లదీస్తున్న ప్రసాద్‌కి చర్మవ్యాధి నయం చేయిస్తే అందరిలాగానే సంతోషంగా, అద్భుతంగా జీవితంలో ముందుకెళ్తాడని పలువురు అంటున్నారు. మరి ఇలాంటి వింత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి మెరుగైన వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే బాగుంటుంది.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: VIRAL NEWS, Vishakaptnam

  తదుపరి వార్తలు