• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHAPATNAM 100 YEARS OLD WOMEN RECOVER FROM CORONA VIRUS SHE IS NOW COMPLETELY HEALTHY NGS VZM

Andhra Pradesh: కరోనాను జయిద్దాం ఇలా.. మహమ్మారిని ఓడించిన వందేళ్ల వృద్ధురాలు..

Andhra Pradesh: కరోనాను జయిద్దాం ఇలా.. మహమ్మారిని ఓడించిన వందేళ్ల వృద్ధురాలు..

కరోనాను జయించిన భామ

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. అయితే చాలామంది కరోనా భయంతోనే మరణిస్తున్నారు. అతి చిన్న వయసులో కూడా కరోనాపై అపోహలు పెరిగి. ఏదో అయిపోతుందనే భయంతో మరణిస్తున్నారు. అయితే అలాంటి వారంతా ఈ వందేళ్ల బామ్మను ఆదర్శంగా తీసుకోవాలి..

  • Share this:
    కరోనా మహమ్మారి ఎందరినో భయపెడుతోంది. తొలి దశతో పోల్చుకుంటే రెండో దశ తీవ్రత ఎక్కువ ఉంది. మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. దాదాపు చాలా జిల్లాల్లో ప్రతి రోజు పది మందికిపైగా మరణిస్తున్నారు. దాదాపు ఏడు జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నా మహమ్మారికి బ్రేకులు పడడం లేదు. ముఖ్యంగా అత్యంత చిన్న వయసుల వాళ్లు.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు సైతం మరణించడం కలవర పాటుకు గురి చేస్తోంది. ఓ వైపు కరోనా మహమ్మారి సోకి మరణిస్తుంటే.. కొంతమందిని ఆ భయమే చంపేస్తోంది. కరోనా సోకిందని తెలియడంతో కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మరికొందరు ఏదో అయిపోయిందనే భయంతో గుండె పోటుతో మరణిస్తున్నారు..

    అయితే కరోనా మహమ్మారికి చికిత్స ఉంది. వ్యాక్సిన్ రూపంలో కరోనాను ఓడించే ఆయుధం మన ముందు ఉంది. చిన్నపాటి జాగ్రత్తులు తీసుకుంటే కరోనా భూతం మనవైపు కూడా రాదు. అయినా కొంతమంది భయం వీడడం లేదు. అపోహలు అనుమానాలతో చిన్న వయసులోనే.. కరోనా భయంతో మరణించడం బాధాకరం. అలా భయపడుతున్నవారికి ఆదర్శంగా నిలిచింది ఓ భామ్మ.. వందేళ్ల వయసులో కరోనాతో పోరాడి.. జయించింది. కరోనా సోకిందనే భయం లేకుండా వైద్యుల సలహాలు పాటించి బామ్మ బంగారం అనిపించుకుంది..

    శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండలంలోని కుమ్మరిగుంట గ్రామానికి చెందిన వందేళ్ల వృద్ధురాలు యాళ్ల సీతారామమ్మ కరోనా మహమ్మారిని జయించారు. డిప్యూటీ సీఎం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు ఈమె స్వయాన పెద్దమ్మ కావడం విశేషం. ఈమె గత నెల కొవిడ్‌ బారిన పడ్డారు. వ్యాధి లక్షణాలు బయటపడటంతో ఇంటి వద్దే ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష నిర్వహించడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సారవకోట పీహెచ్‌సీ వైద్యాధికారి భార్గవప్రసాద్‌ తెలిపారు.

    అయినా ఆమె ఏమాత్రం భయపడలేదు. వైద్యులు సూచించిన మందులు వేసుకున్నారు. వారు చెప్పిన జాగ్రత్తలు పాటించారు. అందుకే అత్యంత త్వరగా కోలుకున్నారు. ఆమె ధైర్యమే త్వరగా కోలుకునేలా చేసిందని వైద్యులు అంటున్నారు. కరోనా బారిన పడి 25 రోజుల పాటు లక్షాణాలతో బాధపడ్డారు. అయినా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా బయటపడింది.

    కరోనా సోకిందనే భయంతో ఆమెను ఆ కుటుంబ సభ్యులు ఒంటరిగా వదిలేయలేదు. వందేళ్లు దాటింది కదా మనకెందుకులే అని మూలన పడేయలేదు. ఆ వయసులోనే ఆమెకు సపర్యలు చేశారు. పోషకాలు ఎక్కువ ఉండే ఆహారం స్వయంగా అందించేవారు. తన కుటుంబసభ్యులు నిత్యం ఉదయం తేనె కలిపిన నిమ్మరసం, మాంసాహారంతో భోజనం, బొప్పాయి, పళ్ల రసాలు వంటివి ఇచ్చేవారని అమె అంటున్నారు. మనోధైర్యంతో మహమ్మారిని జయించొచ్చని ఆమె పిలుపు ఇచ్చారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు