ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు... బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి

రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదైనా, మేఘాల ప్రభావం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది.

news18-telugu
Updated: December 29, 2019, 7:10 AM IST
ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు... బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అత్యంత చల్లగా మారింది. సూర్యగ్రహణం ఏర్పడిన 26వతేదీ నుంచి అటు ఏపీ... ఇటు తెలంగాణలో కూడా వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి. ఎండ సరిగా లేకుండా చల్లనిగాలులు వీస్తున్నాయి. అయితే బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో శనివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కూడా కురిసాయి.తేమ గాలుల వల్ల చలి పెరిగిందని విశాఖవాతావరణ శాఖ పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందంది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాలో వచ్చే రెండు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. త్రిపుర నుంచి ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.

వచ్చే రెండు రోజుల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణకేంద్రం తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదైనా, మేఘాల ప్రభావం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, తేమగాలులు వీస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా చలి పెరిగిందని తెలిపారు అధికారులు.
Published by: Sulthana Begum Shaik
First published: December 29, 2019, 7:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading