• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHA STEEL PLANT RAW WORKERS START AGITATION AT VIZAG STEEL PLANT AGAINST PRIVATISATION DECISION OF CENTRAL GOVERNMENT NK

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికుల ఆందోళన.. ముట్టడికి పిలుపు

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికుల ఆందోళన.. ముట్టడికి పిలుపు

విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికుల ఆందోళన.. ముట్టడికి పిలుపు

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయ పార్టీలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఇక కార్మికులు, ప్రజలే ప్రత్యక్ష పోరాటంలోకి దిగారు.

  • Share this:
    Visakha Steel Plant: విశాఖపట్నంలోని ప్రముఖ స్టీల్ ప్లాంట్‌ను కచ్చితంగా ప్రైవేటీకర చేసి తీరతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న క్లారిటీగా చెప్పడంతో... ఇప్పటివరకూ రాజకీయ పార్టీలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని అర్థమైపోయింది. అందుకే నిన్న సాయంత్రం నుంచే ఒక్కసారిగా ఆందోళనలు మిన్నంటాయి. నిన్నటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రైవేటీకరణపై కేంద్రం విధానాలను నిరసిస్తూ ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించారు. తెల్లవారుజామున ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేశారు. నేడు స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడికి పిలుపిచ్చారు. ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతున్నాయి.

    ప్రజలు, కార్మికులు ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతో... పార్టీలు కూడా తమ వంతుగా ప్రకటనలు చేస్తున్నాయి. ఎలాగైనా ప్రైవేటీకరణను అడ్డుకొని తీరతామని అంటున్నాయి. ఇదే అంశంపై తాజాగా ప్రభుత్వం నుంచి ఓ ఆసక్తికర ప్రకటన వచ్చింది. విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు అన్న మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితులలో అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఎంపీలు లోక్‌సభలో ఈ విషయంపై క్లారిటీ కోరినప్పుడు... కేంద్రం ప్రైవేటీకరణ చేసి తీరుతామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఐతే... రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం మాత్రం... ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉందనీ... ఇందుకు సంబంధించి... ఇది వరకే సీఎం జగన్ మోహన్ రెడ్డి... ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారని గుర్తుచేశారు.


    విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలను అధిగమించి లాభాల్లోకి వెళ్లేలా కేంద్రం మద్దతు ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరారు. "రాష్ట్ర ప్రభుత్వం అదే మాటపై నిలబడి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం" అని అన్నారు.


    ఈ ప్రైవేటీకరణ అనేది టీడీపీ హయాంలోనే నిర్ణయం జరిగిందన్న బొత్స సత్యనారాయణ... దాన్ని అడ్డుకునేందుకు టీడీపీ ఎలాంటి ప్రయత్నాలూ చెయ్యలేదని ఆరోపించారు. ఈ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని కేంద్రం చెప్పిందన్న బొత్స... తాము ఒప్పుకోవడం వల్లే ప్రైవేటీకరణ జరుగుతోందన్న టీడీపీ ఆరోపణల్లో నిజం లేదన్నారు. కేంద్రం తమ నిర్ణయం మార్చుకునేలా తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.



    ఇది కూడా చదవండి: Horoscope Today: మార్చి 9 రాశి ఫలాలు... మెరుగ్గా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

    ప్రైవేటీకరణ ఆగుతుందా?:
    ప్రస్తుతం ప్రజలైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు ఉద్యమాలు కొత్తేమీ కాదు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందే ఉద్యమం ద్వారా. అప్పట్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది భూములు ఇవ్వడం ద్వారా విశాఖకు దాన్ని తెప్పించుకున్నారు. ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరిస్తామని కేంద్రం అంటుంటే... ప్రజలు భగ్గుమంటున్నారు. తమ ప్రాణాలైనా పణంగా పెడతాం గానీ... ప్రైవేటీకరణ జరగనిచ్చేది లేదంటున్నారు. మొత్తంగా ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో అనే ఆందోళన ఉంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు